S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డాక్టర్లు, నర్సుల సస్పెన్షన్‌కు డిమాండ్

పరకాల, జూలై 24: పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతికి కారణమైన డాక్టర్లను, నర్సులను తక్షణమే సస్పెండ్ చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చిట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి గందం సమ్మయ్య, మండల పార్టీ అధ్యక్షులు చాడ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన పరికరాలు లేవని చెప్పారు. డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని తెలిపారు. అంతేకాకుండా పేద వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను, నర్సులను తక్షణమే సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పిల్లల రవీందర్, లక్కం ప్రకాశ్, జన్ను రవీందర్ పాల్గొన్నారు.