S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుండారం రిజర్వాయర్ వద్ద గేట్ల వద్ద బుంగ

కమాన్‌పూర్, జూలై 24: మండలంలోని గుండారం రిజర్వాయర్ గేట్ల వద్ద బుంగ ఏర్పడడంతో ప్రమాదకరంగా మారింది. కాగా గతంలో ఆర్‌ఎస్‌బి గేట్ల పక్కన ఉన్న గోడ కూలిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌పి అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం దాని పక్కనే సుమారు 15 అడుగుల గోతి ఏర్పడింది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో ఈ గోతి ఏర్పడింది. సిబ్బంది గోతిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చలనం లేదు. ముఖ్యంగా ఈ గేట్ల నుంచి మంథని, ముత్తారం, కమాన్‌పూర్ మండలాల ఆయ కట్టు ప్రాంతాలకు సాగునీరు విడుదల చేస్తారు. ప్రస్తుతం ఈ గేట్ల వద్దనే పెద్ద బుంగ ఏర్పడడంతో భారీ ప్రమాదం జరిగే సూచనలున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కలికంగా రైతులు బుంగలో నామమాత్రంగా మట్టిని పోశారు. ఒక వేళ భారీ వర్షాలు కురిస్తే రిజర్వాయర్‌లోకి నీరు చేరి ప్రమాదం జరిగే సూచనలున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సదరు అధికారులు వెంటనే చొరవ తీసుకొని బుంగ పూడ్చాలని కోరుతున్నారు.