S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ తరహ ఉద్యమం

మానకొండర్, జూలై 24: అగ్రవర్ణాల్లోని పేదలందరికి విద్య, వైద్య, ఉద్యోగ ఉపాధి రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అవకశం కల్పించి సమన్యాయం జరపాలనిఅగ్రకుల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ ఉద్యమ తరహలో నిరంతరం ఉద్యమిస్తామన్నారు. అదివారం మండల కేంద్రంలోని వేంకటేశ్వర దేవలయంలో ఓసి సంక్షేమ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఓసి సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడిరి స్వామిరెడ్డి మాట్లాడుతూ కులం మతం ప్రాతిపదికను కాకుండా అన్ని వర్గాల ఆర్థిక స్థోమతను బట్టి రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
అగ్రవర్ణాల హక్కుల సాధనకోసం రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వడి కులస్థులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యోగ ఉపాధిరంగాల్లో 19 శాతం రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో ప్రాధన్యత కల్పించేంతవరకు దీర్ఘకాలిక, నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓసి స్థితిగతులపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిరపేదలను గుర్తించి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఓసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10 వేల కోట్లతో ప్రత్యేక నిధులను కల్పించి విద్యార్థులకు వసతిగృహాలు, స్టడిసర్కిల్లు, స్కాలర్‌షిష్‌లు, రైతులకు రాయితీ రుణాలను డిమాండ్ చేశారు. ఆగస్టులో లక్ష మందితో మహాగర్జన సభ కరీనంగర్‌లో నిర్వహించనునట్లు తెలిపారు. ఈసభకు ఓసి వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కంకనాల సరోజన, రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, నాయకులు సింగిరెడ్డి మోహన్‌రెడ్డి, బొడ ప్రమోద్‌రెడ్డి, మందల రవిందర్‌రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.