S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హామీలు నెరవేర్చాకే టిబిజికెఎస్ పోటీ చేయాలి

గోదావరిఖని, జూలై 24: సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కులను సాధించడంలో టిబిజికెఎస్ పూర్తిగా విఫలం చెందిందని సింగరేణి స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టియుసి) ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ విమర్శించారు. కార్మికులకు మాయ మాటలు చెప్పి గుర్తింపు సంఘంగా ఎన్నికైన టిబిజికెఎస్ ఏ ఒక్కనాడు కార్మికుల కోసం పని చేయలేదన్నారు. హామీలు నెరవేర్చాకనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్ పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖని పట్టణంలోని ఐఎన్‌టియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జనక్ ప్రసాద్ మాట్లాడుతూ బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏనాడూ టిబిజికెఎస్ ముఖ్యమంత్రిని కలువలేదని, కానీ ఎప్పటికప్పుడు మాయ మాటలతో కార్మికులను మోసం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. సకల జనుల సమ్మె వేతనం ఇప్పించకుండా, వారసత్వపు ఉద్యోగాలు కల్పించకుండా కోతలు కోయడం మానుకోవాలని ఆ సంఘానికి జనక్ హితవు పలికారు. కార్మికుల రక్షణను సింగరేణి యాజమాన్యం పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. నాలుగేళ్ల గుర్తింపు సంఘం కాలంలో సింగరేణి అధికారుల పెత్తనం పెరిగిపోయి గని కార్మికులపై నిర్బంధం పెరిగిందని పేర్కొన్నారు. సింగరేణి కంపెనీ సి ఎస్ ఆర్ నిధులు స్థానికంగా ఖర్చు చేయకుండా సింగరేణేతర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ యాజమాన్యం దుర్వినియోగానికి పాల్పడుతుందని జనక్ ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడే యూనియన్‌ను రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు. విలేఖరుల సమావేశంలో మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, ఐ ఎన్‌టియుసి నాయకులు ధర్మపురి, గుమ్మడి కుమారస్వామి, లక్ష్మిపతి గౌడ్, లింగమూర్తి, తాడికొండ నర్సయ్య, సాగర్, విజయ్, బాపు, జగన్ తదితరులు పాల్గొన్నారు.