S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక ఢోకా లేదు

బాన్సువాడ, సెప్టెంబర్ 25: ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయని, దీంతో వచ్చే సంవత్సర కాలం పాటు తాగు, సాగునీటికి ఢోకా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ మండలంలో పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకున్న కొన్ని చెరువులను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మండల కేంద్రంలోని ఎల్లయ్యచెరువు వద్ద మంత్రి పోచారం స్థానిక విలేఖరులతో మాట్లాడారు. గడిచిన నాలుగైదు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని, నిండుకుండళ్లా తొణికిసలాడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు ప్రస్తుతం భారీ వర్షాలు కురియడం హర్షించదగ్గ విషయమన్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడం వల్ల కొంతమంది రైతులు పంటల సాగుకు వెనుకడుగు వేశారని, అయితే రబీలో పూర్తిస్థాయిలో పంటల సాగుకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పోచారం పేర్కొన్నారు. ఈ భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగి, వచ్చే రెండు సంవత్సరాల వరకు నీటి కొరత సమస్య ఉండబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 24లక్షల బోరుబావుల కింద రైతులు 52లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా నిరాటంకంగా 9గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున్‌సాగర్, జూరాల, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండటంతో జలవిద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభమవుతుందని, ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్య ఉండదని మంత్రి స్పష్టం చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో 5గేట్ల ఎత్తి లక్షకు పైచిలుకు క్యూసెక్కుల నీటిని దిగువ నిజాంసాగర్‌లోకి విడుదల చేయడం జరిగిందన్నారు. సింగూర్ మిగులు జలాలతో పాటు మెదక్ జిల్లా హల్దివాగు, పోచారం రిజర్వాయర్ ఇన్‌ఫ్లో వల్ల ఆదివారం సాయంత్రం కల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని మంత్రి పోచారం తెలిపారు. దీంతో నిజామాబాద్ జిల్లా రైతాంగానికి తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వెంట నీటిపారుదల శాఖ డిఇ భూమారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్‌బాబా, ఎఎంసి చైర్మన్ నార్ల సురేష్‌గుప్తా, బాన్సువాడ సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, తెరాస నాయకులు డాక్టర్ అంజిరెడ్డి, జంగం గంగాధర్, మహ్మద్ ఎజాజ్, ముఖీద్ తదితరులు ఉన్నారు.