S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కుండపోత వర్షానికి పెరిగిన గోదావరి నీటిమట్టం

ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 25: మండలంలోని సదర్‌మాట్ ఆయకట్టు శనివారం రాత్రి 12 అడుగులకు చేరుకుంది. పోలీసులు బాదన్‌కుర్తి, ఒగులాపూర్ బ్రిడ్జిపై ఎప్పటికప్పుడు ప్రేక్షకులను గమనిస్తూ వారు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంచేస్తున్నారు. సదర్‌మాట్ ఆనకట్ట లోపలికి వెళ్లకుండా కంచెలు నిర్మించి చిన్నపిల్లలను లోనికిపోకుండా ఇరిగేషన్ డిప్యూటి, జె ఈలు పోలీసు పహారాలో కాపుకాస్తున్నారు. ఎస్సారెస్పీ 42 గేట్లను ఒకేసారి వదలడంతో 2006లో గోదావరి నది ఉప్పొంగగా 10 సంవత్సరాల తర్వాత పాత పరవళ్లు తొక్కుతున్న గోదావరి కళ సంతరించుకుందని ఖానాపూర్ గ్రామస్తులు అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి కర్షకులు వర్షాన్ని చూసి హర్షిస్తున్నారు. రెండు పంటలకు నీరందే విధంగా వరణుడు కరుణించాడని చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయన్నారు.

బంగారుగూడ వాగులో పడి ఒకరు గల్లంతు
ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబర్ 25: ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ వాగులో శనివారం రాత్రి 10 గంటలకు బంగారుగూడ గ్రామానికి చెందిన బౌరె దిలిప్ (45) వాగులో పడి గల్లంతైనట్లు రూరల్ ఎస్సై రాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గల్లంతైన వ్యక్తి ఆచూకి తెలియరాలేదని, గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు. హామాలీ పనిచేసే దిలిప్ రోజువారిగానే పని ముగించుకొని ఆదిలాబాద్ నుండి బంగారుగూడకు వెళ్తుండగా మార్గమద్యలో గల వాగు ఉదృతిని అంచనా వేయలేక వాగుదాటే ప్రయత్నం చేశాడని, దీంతో నీటి ప్రవాహానికి వాగులో పడి గల్లంతుకావడం జరిగిందన్నారు.

పరవళ్లు తొక్కుతున్న సోన్ గోదావరి
నిర్మల్ రూరల్, సెప్టెంబర్ 25: మూడు రోజులుగా కురస్తున్న వర్షాలకు తోడు శనివారం శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తివేయడంతో సోన్ గోదావరి పరవళ్లు తోక్కుతుంది. నిండుకుండలా గోదావరమ్మ జల కళతో ఉట్టిపడుతుంది. ఆదివారం శ్రీరాంసాగర్ ఎగువ భాగం నుంచి ఎక్కువ మొత్తంలో నీరు చేరుతుండటంతో ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి దిగువకు నీటిని వదిలారు. దీంతో సోన్ గోదావరి నిండుగా పారుతుంది. గ్రామస్థులు, చుట్టు ప్రక్కల వారు సోన్ పరవళ్లను చూడడానికి తరలి వచ్చారు. వర్షం తగ్గుముఖం పట్టకుండా ఇలానే కురుస్తే ఎగవ నుంచి నీటి ఉదృతి పెరిగినట్లయితే గోదావరి నీటి మట్టం మరింత పెరగవచ్చని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

ఎస్సారెస్పీని సందర్శించి ఉప ముఖ్యమంత్రి కడియం
దివ్యనగర్, సెప్టెంబర్ 25: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి మిగులు నీటిని గోదావరిలోకి వదులడంతో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నీటిమట్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఎస్సారెస్పీ నిండడంతో రాబోయే రెండేళ్లలో సాగునీటికి ఇబ్బందులు తొలగనున్నాయన్నారు. రెండు పంటలు పండించే అవకాశం కలిగిందన్నారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి భారీ వరదనీరు ప్రాజెక్టులోకి వస్తున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మంత్రి అల్లోల సందర్శన....
రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోవివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఎస్సారెస్పీ నిండడంతో రైతులు హర్షిస్తున్నారన్నారు. రాబోయే రెండేళ్లలో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు కరువు దరిచేరదన్నారు. రెండు పంటలు పండించడంతోపాటు తాగునీటికి ఇబ్బందులు తొలగనున్నాయన్నారు. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ మిగులునీటిని గోదావరిలోకి వదులుతున్నామన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.

చిన్నబెల్లాల్ వద్ద ఉప్పొంగిన ఉత్తరవాహిని గోదావరి
కడెం, సెప్టెంబర్ 25: ఆదిలాబాద్ జిల్లాలోని కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామ సమీపంలో గల ఉత్తరవాహిని గోదావరిగా పేరుపొందిన గోదావరి నది భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చిచేరడంతో మహారాష్టల్రో కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఒక్కరోజే ఐదు లక్షల క్యూసెక్కుల నీరు శ్రీరాంసాగర్ నీరు జలాశయంలో చేరడంతో ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేసి 2 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో కడెం మండలంలోని బెల్లాల్ గ్రామసమీపంలో గల గోదావరిలో భారీగా వరదనీరు వచ్చిచేరడంతో గోదావరి నీటితో ఉప్పొంగిపోయింది. గతంలో చిన్నబెల్లాల్ గ్రామ సమీపంలో గోదావరి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాపుష్కరాలు నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో పుష్కరస్నాన ఘాట్లు కూడా అధికారులు ఏర్పాటుచేశారు. కాగా గోదావరి అధికంగా ప్రవహించడంతో గతంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన పుష్కరఘాట్లు కూడా గోదావరి నీటిలో మునిగిపోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న గోదావరి నదిపక్క చుట్టుపక్కల ఉన్న పెద్ద బెల్లాల్, చిన్నబెల్లాల్, పెర్కపల్లి, నర్సింగాపూర్, మొర్రిగూడెం, పాండ్వాపూర్, కోండుకూర్, చిట్యాల్, కడెం, కన్నాపూర్, తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు గోదావరికి తరలివచ్చి పరవళ్లుతొక్కుతున్న గోదావరిని తిలకించారు. కొందరు గోదావరి నదిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గత నాలుగైదు సంవత్సరాల నుండి ఈ గోదావరి నదిలో నీరులేక వెలవెలబోగా ఈ సంవత్సరం భారీ వర్షాలు కురియడం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 46 గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున నీరు గోదావరిలోకి పరవళ్లు తొక్కుతుండడంతో పలు గ్రామాల ప్రజలు ఆనందోత్సాహల మద్య గడిపారు.