S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆగని ఆందోళనలు

గద్వాలటౌన్, సెప్టెంబర్ 25: గద్వాల జిల్లా చేయాలని నడిగడ్డ ప్రజల ఆందోళనలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుతో నడిగడ్డ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించకుండా రాజకీయ కోణంలో జిల్లాల ఏర్పాటును ఎందుకు చేస్తున్నారని నడిగడ్డ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఉద్యమకారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. జెఎసి మూడు రోజుల బంద్ విజయవంతంగా సాగింది. పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడిపేందుకు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న జె ఎసి, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపోకు చేరుకొని డిపో ముందు ఆందోళన చేపట్టి డిపో గేటు ముందు ట్రాక్టర్లను అడ్డంగా నిరసన తెలిపారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా జెఎసి నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వీరభద్రప్ప, వెంకటరాజారెడ్డి, బీజాపూర్ ఆనంద్‌లు మాట్లాడుతూ రెండు జీవనదులు, అంతర్జాతీయ స్థాయిలో చేనేతకు గుర్తింపు, చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు, విశాలమైన ప్రభుత్వ భూములు, కార్యాలయాలు ఉన్నాయన్నారు. అదే విధంగా రైల్వే, జంక్షన్‌తో పాటు వంద ఎకరాల రైల్వే భూములు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో జంక్షన్‌తో పాటు వివిధ సౌకర్యాలు, అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు దోహదపడతాయన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖద్వారాలుగా నడిగడ్డ ప్రాంతమేనని, ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించకపోవడం వెనుక ఉన్న రాజకీయ ద్రోహులు ఎవరో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులు జిల్లా ఉద్యమంలో పాల్గొంటున్నందుకు సంతోషమని హితవు పలికారు. గత నెలలో జెఎసి 72 గంటల బంద్ విజయవంతం చేసి చరిత్ర సృష్టించిందన్నారు. అదే విధంగా మరోమారు 72 గంటల బంద్ శాంతియుతంగా చేపట్టిన బంద్‌కు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎన్నడు లేని విధంగా నడిగడ్డ ప్రాంతంలో వివిధ పోలీసు బలగాలను గద్వాలలో నియమించి ప్రజలను, ఉద్యమకారులను అణచివేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని హెచ్చరించారు. ఇట్టి ధోరణి ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేసి ప్రభుత్వంపై యుద్ధానికి కూడా సిద్ధమని తెలియజేశారు. అదే విధంగా ఆర్టీసీ డిపోలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి ఉద్యమకారులు అక్కడే భోజనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, అతికూర్ రహిమాన్, మున్నాబాష, మధుసూదన్‌బాబు, రాజశేఖర్‌రెడ్డి, గంజిపేట రాములు, వాల్మీకి, కోళ్ళ హుస్సేన్, ప్రభాకర్, ఇస్మాయిల్, అడ్డాకుల కిరణ్, విద్యార్థి, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబర్ 25: కృష్ణా పరివాహాక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది. ఈ ప్రవాహం ఇలాగే మూడు,నాలుగు రోజులు కొనసాగితే రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకునే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో 885 అడుగులకుగాను 879.5 అడుగులు, గరిష్ట నీటి నిలువ 215 టిఎంసిలకుగాను 185.56 టిఎంసిలుగా ఉంది. జూరాల నుంచి లక్షా 85వేల 568 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతుండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68, 721 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ప్రాజెక్టులోని కుడి పవర్ హౌజ్‌లో నాలుగు జనరేటర్లు 103 మేగావాట్ల విద్యుత్‌ను చేస్తూ 31, 626 క్యూసెక్కుల నీటిని, తెలంగాణ పరిధిలోని భూగర్భ పవర్ హౌజ్‌లోని ఐదు జనరేటర్లు 150 మేగావాట్ల చొప్పున విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 35, 315 క్యూసెక్కుల నీటిని, పోతిరెడ్డిపాడు ద్వారా 500 క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 1680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.