S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెల్‌జర్లలో విజృంభించిన విషజ్వరాలు

షాద్‌నగర్, సెప్టెంబర్ 25: కురుస్తున్న ముసురు వర్షాలకు విష జ్వరాలు విజృంభించి ప్రజలు మంచనపడ్డారు. ఫరూఖ్‌నగర్ మండలం వెల్‌జర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి బైడ్ల నర్సయ్య (60), సత్తమ్మ (45), ఎం.నర్సమ్మ (50), బ్యాగరి రమేష్ (25), మరియ శ్రీను (18), జాంగారి రాజు (25), మంద రాజు (30), కావలి సాయిలు (32), సబావత్ హన్మంత్ (28), మర్రి ఆకాష్ (10), భ్యాగరి అంజమ్మ (55)లతో పాటు దాదాపు 70మంది గ్రామస్తులు విషజ్వరాల భారిన పడ్డారు. వారం రోజుల నుండి ఏడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలకు రోడ్లపై మురుగు నీరు చేరి ఈగలు, దోమల కారణంగా విషజ్వరాలు ప్రబలినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వివరించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు పేర్కొన్నారు. కాళ్లు, మోకాళ్ల నొప్పులతో పాటు విషజ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, పైకి లేచేందుకు సైతం రావడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామంలోని మురుగు కాలువలను శుభ్రం చేయించడంతో పాటు విధుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు తెలపడం జరిగిందని, కానీ ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే కొంతమంది షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు, ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి చికిత్సలు పొందుతున్నారని గ్రామస్తులు వివరించారు. నిరుపేద ప్రజలు ఏమి చేయలేక ఇంటివద్దనే మంచం పట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే డెంగ్యూ, కలర, మలేరియా తదితర వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.