S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వరద నీటిలో వ్యక్తి గల్లంతు.. చిక్కని బాలుడి ఆచూకీ

హత్నూర, సెప్టెంబర్ 25: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల పరిధిలోని బోర్పట్ల-రెడ్డిఖానాపూర్ శివారులోని వాగులో వ్యక్తి గల్లంతైన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామానికి చెందిన కుర్తి ఆంజేనేయులు గౌడ్ (32), చంద్రంలు రోజు మాదిరిగానే బైక్‌పై బోర్పట్ల శివారులోని అరబిందో యూనిట్-1 విధి నిర్వహణ కోసం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రహదారిపై ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా మద్యలోకి రాగానే బైక్ ఆగిపోయింది. దీంతో ప్రవాహంలో బైక్‌ను నెట్టుకుంటు వెళ్తున్న క్రమంలో బైక్‌తో సహా ఇద్దరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. చంద్రం ఈదుకుంటూ ఒడ్టుకు చేరగా, గల్లంతైన ఆంజనేయులు ఆచూకి ఇప్పటి వరకు లభించలేదు. సంఘటన స్థలాన్ని తూఫ్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, నర్సాపూర్ సిఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ బాల్‌రాజు సందర్శించారు.
వరదలో గల్లంతు-లభించని ఆచూకీ
జహీరాబాద్: వరదనీటిలో గల్లంతయిన చిన్నారి ముజాహిద్ ఆచూకీ ఆదివారం సాయంత్రంవరకు కూడా లభించలేదు. ఆయనకోసం పోలీసులతోకలిసి గ్రామస్థులు కిలోమీటర్ల మేర వాగులో గాలించినా లాభం లేకుండాపోయింది. బాలుని ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. మండలంలోని హోతి(బి) గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షంతో వచ్చిన ఎదురుగడ్డ వాగులో కొట్టుకుపోయిన ఎడ్లు, మనుషులు సురక్షితంగా బయట పడ్డారు. కానీ ఒక బర్రె మృతిచెందగా, ఓ బాలుడు మాత్రం కనిపించకుండా పోయాడు. అతని కోసం శనివారం అర్దరాత్రి వరకు గాలించిన గ్రామస్థులు, ఆదివారం కూడా గాలింపులు కొనసాగించారు. అయినా లాభం లేకుండా పోయింది. మున్సిపల్ సిబ్బంధి, ఇతర నిపుణులచే గాలించాలని సిఐ.నాజరాజు భావిస్తున్నారు.