S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాలమూరులో భారీ వర్షం

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26: జిల్లా కేంద్రమైన పాలమూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా కేంద్రంలోని పలు రోడ్లు చెరువులను తలపించాయి. ముఖ్యంగా జడ్చర్ల నుండి రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాళాలు నిండి పొంగిపొర్లాయి. ముఖ్యంగా న్యూటౌన్‌లో భారీ వర్షానికి పెద్ద చెరువుకు వెళ్లే కాలువ నిండుకుండలా పారింది. న్యూటౌన్‌లో రోడ్డుపై మూడు నాలుగు ఫీట్ల ఎత్తులో వర్షపునీరు వచ్చి చేరి వరదలా ప్రవహించింది. దింతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొందరు యువకులు నీటిలోనే వాహనాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మధ్యలోనే నిలిచిపోవడంతో అవస్థలకు గురయ్యారు. పెద్ద చెరువుకు మూడు నాలుగు కాలువలు ఉదృతంగా పారాయి. దాంతో పెద్ద చెరువు అలుగు మరోసారి పారింది. ఈ కారణంగా భగీరథకాలనీ, బికెరెడ్డికాలనీ, మర్లు తదితర కాలనీల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది.