S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీపావళి

దీపావళి సందర్భంగా చినజీయర్ స్వామి వారి గురించిన ఆసక్తికరమైన ఎన్నో అంశాలను అందజేసినందుకు ధన్యవాదాలు. స్వామి జన్మస్థలం మా తూర్పుగోదావరిలో అర్తమూరు. నిజంగా మా జిల్లా వాసులు ధన్యులు. దీపావళి నేపథ్యంలో అందించిన స్టోరీ ఆకట్టుకొంది. సిసింద్రీ ఒక్క దీపావళికే ఉంటుంది. కానీ మా సిసింద్రీ వారం వారం ముచ్చట్లతో సందడి చేస్తుంది.
-ఎన్.ఎస్. (ఆర్.నగర్, తూ.గో.జిల్లా)
కొత్తొక వింత
ఈ వారం ఆదివారం ఆంధ్రభూమి కవర్‌స్టోరీ ఎల్‌ఈడీ బల్బులు గురించి చాలా మంచి సమాచారాన్ని అందించారు. కొత్తొక వింత, పాతొక రోత అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యుత్ వినియోగంలోనూ మార్పులు వచ్చాయి. విద్యుత్ ఆదా చేయడానికి ఇప్పుడు అందరూ ఎల్‌ఈడి బల్బులనే వాడుతున్నారు. ఆదివారం భూమిలో మాకు ఇష్టమైనవి సండే గీత, ఓ చిన్న మాట - ఎందుకంటే ఇవి చదవటానికి చిన్నవే అయినా అందించే సందేశం మాత్రం పెద్దది. ఒక్క తూటా చాలు సీరియల్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ‘పేగుబంధం’ కథ చాలా బాగుంది. అక్షరాలోచనాలులో కవితలు బాగున్నాయి. బాలల పేజీ సిసింద్రీ ఎప్పటి మాదిరిగానే అలరిస్తోంది. మొత్తానికి ఆదివారం ఆంధ్రభూమి ఒక మినీ వీక్లీలా ఉన్నది.
-మార్టూరు అజయ్‌కుమార్ (గుంటూరు)
ప్రత్యేక కథనం
ఈ వారం ‘కవర్‌స్టోరీ’ శీర్షికన అందించిన ‘ఎల్‌ఈడీ మెరుపులు - జగమంత వెలుగులు’ చాలా ఉపయుక్తంగా ఉంది. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న విద్యుత్ వాడకం దృష్ట్యా ఈ కథనం ఉపయోగకరంగా అనిపించింది. కాస్తయినా విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ‘పేగు బంధం’ కథ హృదయాన్ని హత్తుకుంది. సీరియల్ ఆసక్తిదాయకంగా సాగుతుండగా, కథ, శీర్షికలు మళ్లీమళ్లీ చదివించేలా చేస్తున్నాయి. వారం వారం మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న ఆంధ్రభూమి ఆదివారం అనుబంధానికి ధన్యవాదాలు.
-నీలిమ సుబ్బిశెట్టి (రాజానగరం)
వేరు కాపురం
కొత్తగా వచ్చిన కోడలు తన భర్తతో కలిసి కలహాలు లేని కాపురం చేసుకోవాలనే కోరిక అత్యంత సహజం. దీనికి అత్తమామలు వత్తాసు పలకడం సర్వత్రా మంచిది. ప్రేమగా పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రులు వివాహానంతరం కూడా కొడుకు తమ మాటే వినాలనుకోవడం పొరపాటు. అత్తమామలు మరీ వయసు మీరి అప్పటికి మనుమలు, మనుమరాళ్లు కలిగితే కొడుకు దగ్గర చేరి పిల్లల బాగోగులు చూసుకుంటూ కోడలికి సహాయకారిగా ఉండవచ్చు. కొత్తకాపురాల్లో చిచ్చు రేగడానికి అత్తమామలు ఎంత మంచి వాళ్లైనా ముమ్మాటికీ వారే కారణమవుతారు. ఇకపోతే సండే గీత కాలం విలువను వివరించింది. మనం వృధా చేస్తున్నది కాలాన్ని. టైమ్ మేనేజ్‌మెంట్ పాటించకపోతే కోల్పోయేది ఎంతో. ముఖ్యంగా విద్యార్థులు గమనించి కాలాన్ని ప్రతి క్షణమూ సద్వినియోగపరచుకోవాలి.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
పండుగ వైశిష్ట్యం
విజయ దశమి పండుగ వైశిష్ట్యం, దుష్ట, దుర్గుణ సంహారం కొరకు వెలసిన అమ్మవారి వివిధ అవతారాలపై ప్రత్యేక వ్యాసం కన్నుల పండువుగా ఉంది. ఇదో ప్రేమ కథలో ప్రేమ పేరుతో కొందరు యువతీ యువకులు నైతిక విలువలకు, భారతీయ సత్సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి నయవంచనకు ఎలా పాల్పడుతున్నారో రచయిత చక్కగా వివరించారు. మల్లాది వారి అనువాద కథ థ్రిల్ పేరుకు తగ్గట్టుగానే చదువుతూంటే గొప్ప థ్రిల్ కలిగించింది. అసమాన ప్రతిభ, పాటవాల కారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథను తెలుగు రచయిత రాసినట్లుగా ఉంది. సుప్రసిద్ధ క్రైం కథలను తెలుగు ప్రేక్షకులకు తమదైన స్టైల్‌లో అందిస్తున్న మల్లాది వారికి, ఆంధ్రభూమికి కృతజ్ఞతలు.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
అమృతవర్షిణి
ప్రేమ అనేది ప్రశాంతతకు మూలధాతువు అని, ఎవ్వరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారికే ఆనందం, ప్రశాంతత లభ్యవౌతాయన్న అద్భుతమైన విషయాన్ని హృదయానికి హత్తుకునేలా సండే గీతలో వివరించారు. సంగీత, సాహిత్యాల మాధుర్యాన్ని విశదపరచే ‘అమృతవర్షిణి’ శీర్షికలో తన అద్భుతమైన సంగీత యజ్ఞంతో యావత్ ప్రపంచానే్న కాక సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిని పరవశింప జేయగలిగిన నాదబ్రహ్మ త్యాగయ్య గురించిన విశేషాలు, సంగీత జీవన ప్రస్థానం అలరించాయి. సంగీత ప్రియులను ఎంతగానో అలరించే చక్కని శీర్షికను ప్రారంభించినందుకు కృతజ్ఞతలు.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.