S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (నవంబర్ 13 నుండి 19 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అనుకున్న పనులు ఏదో ఒక రూపంలో పూర్తి చేస్తారు. ఆశయాలకు తగ్గట్టు వ్యక్తులతో పరిచయాలుంటాయి. బంధువుల రాకపోకలకు ఖర్చులు అధికమవుతాయి. ఇతరుల నుంచి మెప్పును పొందుతారు. పొదుపునకు అవకాశాలు బలపడతాయి. ఆదాయ లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, ఇంజనీరింగ్ రంగాల వారికి అనుకూలం. పోటీ పరీక్షలందు అభ్యర్థులకు విజయావకాశాలు. శుభకార్యాలు మెరుగవుతాయి. ఆందోళన తగ్గించుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. గృహ మార్పులుంటాయి. వ్యవహారాలు ఆలోచించి పూర్తి చేసుకోండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
అనుకున్న పనులు అలసటపై పూర్తవుతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. రాబుడులు, పోబడులందు అంచనాలు, ప్రణాళికలు మేలు. బంధుమిత్రుల అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం అన్నింటా లేదన్నది గమనించండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య, వైద్య, ఐ.టి, సి.ఏలు అనుకూల ఫలాలు అందుకుంటారు. ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ మీ సామర్థ్యంతో దూసుకెళ్తారు. ఖర్చులు అంచనాలను మించవచ్చు. శుభకార్యాలకు అవకాశం. సంతాన సౌఖ్యం. అలసట, అకాల భోజనం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అన్ని రంగాల వారికి పలు విధాల మంచిది. వృత్తి, వ్యాపారాలలో రాణింపు. విస్తరణకు అవకాశాలు. ఆదాయానికి లోటు ఉండదు. వాహన సౌఖ్యం. సంతానంతో సఖ్యత. అభివృద్ధి. మిత్రుల కార్యక్రమాలలో పాల్గొనవలసి వస్తుంది. స్ర్తిల మాటకు విలువ పెరుగుతుంది. కోపావేశాలకు దూరంగా ఉండాలి. పూర్వార్జితం విలువ పెరుగుతుంది. అధికారుల తోడ్పాటు ఉంటుంది. తొట్రుపాటు పడవద్దు. అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. గృహ నిర్మాణ కార్యాలు మెరుగవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
అన్ని కార్యాలందు ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఇతరత్రా ఆదాయాలు ఆనందాన్నిస్తాయి. ఇంటా బయటా గౌరవాలు పొందుతారు. శుభ, పుణ్యకార్యాలందు ధన, సమయ కేటాయింపులుంటాయి. నూతన వ్యాపార ప్రారంభాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్య, వృత్తి, వ్యాపార రంగాలలో పోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లకు అవకాశాలు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కుదురుతుంది. అన్ని వ్యవహారాల్లోనూ దూకుడుగా వ్యవహరించకండి. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోయినా చివరకు పూర్తవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
చేపట్టే పనులు మెల్లగా పూర్తవుతాయి. ఆదాయం, ఖర్చులు ప్రయోజనకారిగా ఉంటాయి. అధికారుల అండదండలుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ప్రయాణాలుంటాయి. విలువైన వస్తువుల ధారణలో మెళకువలు పాటించాలి. సంతాన ప్రాప్తి. కుటుంబ సభ్యుల సంతోషంలో మీ పాత్ర మరువరానిది. వృత్తి, వైద్య, విద్య, వైవిధ్య రంగాల వారు సానుకూల వాతావరణంలో గుర్తింపును పొందుతారు. ఆర్థిక తృప్తి. పాత బకాయిలు వసూలవుతాయి. శత్రువులపై ఆధిక్యత. ఉద్యోగులకు అన్నింటా లాభం సిద్ధి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
అనుకున్న పనులందు జయం. అపజయాలకు తక్కువ అవకాశం. ఆశయసిద్ధి. ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తారు. వ్యవహారాలందు సలహాలు తీసుకున్నా మీ ఆలోచనకే ప్రాధాన్యత ఇవ్వండి. సంతానానికి శుభ నిర్దేశాలున్నాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఐ.టి. మెడిసిన్, చేతి వృత్తులవారు లాభాలను అందుకుంటారు. ప్రయాణాలందు, ఆరోగ్య విషయాల్లోనూ మెళకువ అవసరం. ఆర్థిక లోటుపాట్లు తొలగిపోతాయి. మిత్రుల సాయం లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు కలసి వస్తాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
అనుకున్న, అనుకోని పనులు వెంటవెంటనే చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలందు మెళకువ వహించండి. తులనాత్మక పరిశీలన అన్నింటా మేలు. హుషారుగా పనులు నిర్వర్తిస్తారు. ఈర్ష్యా ద్వేషాలు ప్రబలే అవకాశాలున్నాయి. అన్నింటా గమనింపు అవసరం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రైవేటు వారికి పర్మినెంట్‌కు అవకాశాలున్నాయి. ఆదాయ వ్యయాలు అనుకున్నట్లుగా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంఘ కార్యాలందు పాల్గొని మన్ననలు పొందుతారు. వ్యాపార రంగాల వారికి అపార ఆలోచనలు కలసి వస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
యాదృచ్ఛికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఖర్చులకు తగ్గట్టు వ్యవహారాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాథి అవకాశాలు. ఆటంకాలున్నా శుభకార్యాలు ముందుకు వెళ్తాయి. ఆర్థక వనరులు ఖర్చులకు సరిపడేట్టు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం. పుణ్యనదీ స్నానాలు, ఆధ్యాత్మిక ఉన్నతికై ప్రయాణాలు చేస్తారు. గమనింపు అన్నింటా అవసరం. వృత్తి, వ్యాపార, విద్య రంగాల వారు అనుకున్నవి సాధిస్తారు. శ్రమానుకూలంగా ఫలితాలుంటాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
చేపట్టనున్న పనులు లౌక్యంతో పూర్తి చేస్తారు. శ్రమకు గుర్తింపు లభిస్తుంది. సంప్రదింపులతో పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. నేత్ర, పంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. అధికారుల ఆశీస్సులుంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు చేయటం మేలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలందు ఊహించని మార్పులుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. ఊహించని విధంగా ఖర్చులుంటాయి. అప్రమత్తంగా ఉండండి. స్ర్తి సాయం అన్నింటా ఉంటుంది. వస్తు, వస్త్ర ప్రాప్తి. సంఘంలో గుర్తింపు. మాటకు విలువ ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అధికారుల ఆశీస్సులుంటాయి. అన్నింటా, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. సాలోచనతో పనులు పూర్తి చేయండి. శ్రమతో కూడిన ప్రయాణాలుంటాయి. మతిమరుపు లేకుండా వ్యవహరించండి. ఎవర్నీ తేలికగా నమ్మకండి. విందులు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలకు సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. కొన్ని వార్తలు ఇబ్బందిని కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి శ్రమానుకూలంగా ఫలితాలుంటాయి. నూతన పరిచయ లాభం. ప్రలోభాలకు లొంగకండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
చేపట్టే పనులు ఇతరుల సాయంతో, మీ లౌక్యంతో పూర్తి చేస్తారు. ధైర్యసాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఆరోగ్యం తృప్తినిస్తుంది. వాహన సౌఖ్యం. శత్రు జయం. ఇతరుల సలహాలు తీసుకున్నప్పటికీ మీ నిర్ణయానుకూలంగా మెలగటం ఉత్తమం. నూతన పరిచయ లాభం. వృత్తి, ప్రవృత్తులలో మీకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణ, స్ర్తి ప్రేరణ వల్ల లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలందు శుభ పరిణామాలు. అన్నింటా మీ పర్యవేక్షణ మేలు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అవసరానికి మిత్రులు సాయపడతారు. అనుకోని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలందు అపార గుర్తింపు, రాణింపు. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలుంటాయి. వ్యవహార జయం. స్ర్తి మూలక ధనలబ్ధి. అన్నింటా జయాన్ని పొందుతారు. ఆందోళన పడకండి. సంతృప్తితో మెలగే అవకాశాలు మెండు. వ్యక్తిగత గుర్తింపు. అన్ని పనులందు మార్గదర్శకత్వం మేలు చేస్తుంది. వృత్తి, వ్యాపార వ్యవహారాలు ఆలోచింపజేస్తాయి. ఆర్థిక లావాదేవీలందు అప్రమత్తత అవసరం. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. బంధుమిత్రుల రాకపోకల వల్ల ప్రయోజనాలు పొందుతారు. మనసులోని మాట అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855