S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రక్షణ ఆయుధం

ప్రపంచంలోని పది అనాగరిక ఆయుధాలలో ఒకటి బార్బ్‌డ్ వైర్. 150 ఏళ్ల క్రితం దీన్ని కనిపెట్టారు. ఇది స్వేచ్ఛని కోరే వారికి శత్రువు. ఇనుప తీగెల చుట్టూ ముల్లులా బయటికి పొడుచుకు వచ్చేలా అల్లిన కంచే బార్బ్‌డ్ వైర్ అంటే. దాని లక్ష్యం అడ్డగించి వెనక్కి పంపడం, ప్రవేశాన్ని, పారిపోవడాన్ని నిషేధించడం. గత నూట యాభై ఏళ్లుగా ఇది ఆవులని, ఇతర పెంపుడు జంతువులని బయటికి పోనివ్వకుండా కాపాడుతోంది. శత్రు సైనికులు తమ సరిహద్దుల్లోకి రాకుండా అడ్డగిస్తోంది. యుద్ధ ఖైదీలు, లేబర్ క్యాంపుల్లో బంధించబడ్డ వారు బయటకి పోకుండా కూడా బార్బ్‌డ్ వైర్ నిరోధిస్తోంది.
అమెరికాలో కేన్సాస్ రాష్ట్రంలోని లా క్రాస్ అనే చిన్న ఊరి ప్రజలకి బార్బ్‌డ్ వైర్ అంటే ఎంతో ప్రీతి. ఈ చిన్న గ్రామానికి ప్రపంచ బార్బ్‌డ్ వైర్ రాజధానిగా పేరు వచ్చింది. దీని జనాభా 1289. అంటే న్యూయార్క్‌లోని రద్దీగా ఉన్న ఓ సబ్‌వే రైల్లోని ప్రయాణీకులతో సమానం. ఈ గ్రామంలో ఏటా బార్బ్‌డ్ వైర్‌ని సేకరించే వారి సంఘం స్వేప్ అండ్ సెల్ (ఎక్స్చేంజ్ చేసుకోవడం, అమ్మడం) అనే ఈవెంట్‌ని జరుపుతూంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బార్బ్‌డ్ వైర్ సేకరణదారులు ఇందులో పాల్గొని బార్బ్‌డ్ వైర్‌ని అమ్మడమో, ఎక్స్చేంజ్ చేయడమో చేస్తూంటారు. అక్కడ వరల్డ్ ఛాంపియన్ బార్బ్‌డ్ వైర్ స్పయిసింగ్ పోటీ కూడా జరుగుతుంది. ఇందులో పాల్గొన్న పోటీదారులు తెగిన బార్బ్‌డ్ వైర్‌ని బాగుచేసి దాన్ని యథాస్థితికి తీసుకురావాలి. ఎవరు ముందుగా బాగుచేస్తే వారు నెగ్గినట్లు.
ఈ ఊళ్లో కేన్సాస్ బార్బ్‌డ్ వైర్ మ్యూజియం కూడా ఉంది. ఇందులో 19వ శతాబ్దం నించి నేటి దాకా ఉపయోగంలో ఉన్న రెండు వేల రకాల బార్బ్‌డ్ వైర్‌లని ప్రదర్శనలో చూడొచ్చు. కోల్ట్ పిస్తోలు, రైలు పట్టాలు, బార్బ్‌డ్ వైర్ ఈ మూడూ యూరోపియన్స్ నార్త్ అమెరికాలోని రెడ్ ఇండియన్స్ నించి అమెరికా భూభాగాన్ని ఆక్రమించుకోడానికి ఉపయోగించిన ప్రధాన ఆయుధాలుగా నేడు చరిత్రకారులు భావిస్తున్నారు.
పశ్చిమ అమెరికాలో లక్షల కొద్దీ ఎకరాల్లో సాగు మొదలయ్యాక కొత్తగా స్థిరపడ్డ రైతులకి ఆవులు, గేదెలు లాంటి జంతువుల నించి తమ పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చెక్క కంచె ఖరీదైంది. ఎందుకంటే అక్కడ చెట్లు తక్కువ. పైగా అది తగలబడవచ్చు. ఇనుప వైర్‌ని కంచెగా ఏర్పాటు చేసుకోవడం చవక. పని తక్కువ. కంచె బరువు కూడా తక్కువే. గాలి దాన్ని పడగొట్టలేదు. మంచు దాని మీద పేరుకోదు. కాని దాదాపు 450 కిలోల బరువుగల టెక్సాస్ గేదె ఆ కంచెని తేలిగ్గా తోసి పారేయగలదు. అందువల్ల ముళ్లతో కూడిన కంచె మాత్రమే చక్కటి రక్షణని ఇస్తుంది. కాని వేల కొద్దీ మైళ్ల కంచెగా వేయడానికి ముళ్ల పొదలు దొరకవు. దాంతో ముళ్ల పొదలని పోలిన మరో రకం కంచె అవసరం ఏర్పడింది.
అమెరికాలోని వందల మంది వ్యాపారులు అలాంటి కొత్త రకం ముళ్ల కంచెని అమ్మే వ్యాపారాన్ని ఆరంభించారు. 1867లో అల్ఫాన్సో డాబ్ మొదటిసారి ఇలాంటి ముళ్ల ఇనుప వైర్‌ని కనిపెట్టాడు. దానికి ది పికెటెడ్ స్ట్రిప్ అనే పేరు పెట్టాడు. దాన్ని అప్పటికే ఉన్న ఇనుప కంచెకి తగిలించారు. ఐతే అది సరిగ్గా పని చేయలేదు. అదే సంవత్సరం లూసియన్ బి స్మిత్ అనే వ్యాపారి ముళ్ల వైర్‌ని కనిపెట్టాడు. ఇనుప వైర్‌కి చెక్క స్పూల్స్ మీద మేకులు పొడుచుకు వచ్చేలా కొట్టి వాటిని అమ్మాడు. దాన్ని వైర్‌లో గుచ్చవచ్చు. అదీ రక్షణ ప్రయోజనాన్ని ఇవ్వలేదు. 1867-1874ల మధ్య 200 రకాల బార్బ్‌డ్ వైర్‌లకి అమెరికాలోని వివిధ ఇనె్వంటర్స్ పేటెంట్స్‌ని తీసుకున్నారు. ఈ వైర్లకి పళ్లు, అనేక రీతుల్లో బయటకి పొడుచుకు వచ్చిన ముళ్లు ఉన్నాయి.
1871లో లిమాన్ పి జడ్సన్ అనే అతను తను కనిపెట్టిన వైర్‌కి బార్బ్‌డ్ వైర్ అనే పేరు పెట్టాడు. ఆ డిజైన్ నిలవక పోయినా ఆ పేరు మాత్రం నిలిచిపోయింది. వీటన్నిటిలోని సమస్య సాధారణ వైర్‌కి ముళ్లు బయటకి పొడుచుకు వచ్చేలా చేత్తో వైర్ ముక్కలని చుట్టాల్సి రావడం. ఇది విసుగు, బాధని కలిగించే, ఆలస్యంగా జరిగే పని. 1874లో ఒకేసారి జోసెఫ్ గ్లిడెన్, జాకబ్ హైష్ అనే ఇద్దరు రెండు వైర్లని ముళ్లుగా చుట్టే కంచె వైర్‌కి పేటెంట్ తీసుకున్నారు. ఓ వైర్‌కి యంత్రం సహాయంతో మరో వైర్‌ని చుట్టవచ్చు. ఈ డిజైనే నేటి బార్బ్‌డ్ వైర్‌కి మూలం. వీరిద్దరి మధ్యా పేటెంట్ యుద్ధం జరిగి గ్లిడెన్ గెలిచాడు. దాంతో అతను అమెరికాలో చాలా ధనవంతుడయ్యాడు. తర్వాత ముళ్లని పిరమిడ్‌లా, ఐదు ముళ్ళలా, గుండ్రంగా, ఇలా అనేక రకాలు గల బార్బ్‌డ్ వైర్‌లని కనిపెట్టారు. డిజైన్‌ని బట్టి వాటికి వివిధ పేర్లు కూడా పెట్టారు. సండర్‌లేండ్ కింక్, బార్బర్ పర్‌ఫెక్ట్, హోల్డ్ పాస్ట్, నెక్ టై, అంటోర్న్ రిబ్బన్, కోర్సికానా క్లిప్, అండర్ ఉడ్ టేక్.. ఇలా.
1900కల్లా వేల మంది అమెరికన్స్ ఆనాటి వివిధ వెరైటీల బార్బ్‌డ్ వైర్‌లని సేకరించడం ఆరంభించారు. లా క్రాస్ వీటికి రాజధాని ఐంది. బార్బ్‌డ్ వైర్ మనుషుల్ని దూరంగా ఉంచక దగ్గరగా చేసే ఊరుగా లా క్రాస్ మారింది. అనేక మంది పర్యాటకులు ఏటా ఈ ఊరు వెళ్తూంటారు. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలు బార్బ్‌డ్ వైర్‌ని అధికంగా ఉపయోగించాయి. నేడు నగరాల్లో కాంపౌండ్ వాల్ మీద దీన్ని బిగిస్తున్నారు. పోలీసులు కూడా ఆందోళనకారులని ఆపడానికి ఈ బార్బ్‌డ్ వైర్ చుట్టలని అడ్డంగా పెడుతూంటారు. 1885కే అమెరికాలో లక్షా ముప్పై వేల టన్నుల బార్బ్‌డ్ వైర్‌ని ఉపయోగించారు. *

-పద్మజ