S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవతామూర్తి

చిన్న జీయర్ స్వామివారి ‘తిరునక్షత్ర మహోత్సవం’ గురించిన ఆసక్తికర అంశాల నెన్నింటినో తెలుసుకోగలిగాం. నవ యువకుడిలా కనిపించే చిన్న జీయర్‌కు అప్పుడే అరవై ఏళ్లు నిండాయా అని భక్తులు ఆశ్చర్యపోవటంలో అతిశయోక్తి లేదు. ఆ ముఖ వర్ఛస్సు అటువంటిది. మానవత్వానికి ప్రతీకగా చెప్పుకొనే పెద్ద జీయర్ స్వామి అడుగుజాడల్లో చిన్నజీయర్ పయనిస్తూ, సమాజానికి స్ఫూర్తిని కలుగజేస్తున్నారు. చక్కటి ఆధ్యాత్మిక వ్యాసాన్ని అందజేసినందుకు కృతజ్ఞతలు.
-సి.కృష్ణవేణి (సికిందరాబాద్)

ఈ మనిషి ఉన్నాడా?
టీవీ వచ్చింది. ‘దూద’ అనే దూరదర్శన్ ఒకటే ఛానల్. అందులో వచ్చిన సీరియల్స్ కొన్ని బాగుండేవి. కానీ, అన్నీ బాగున్నాయనుకుని చూడడం తప్పలేదు. అక్కడ ‘ముల్లా నస్రుద్దీన్’ అనే పేరుతో ఓ మేధావి మరోసారి ముందుకు రావటాన్ని ప్రస్తావిస్తూ నసీరుద్దీన్‌ని గురించి ఎన్నో విషయాలను ‘లోకాభిరామమ్’ శీర్షికలో చెప్పిన గోపాలంగార్కి ధన్యవాదాలు.
-కె.మహిమ (మార్టేరు)

సిసింద్రీ
వారం వారం సిసింద్రీ ఎనె్నన్నో సంగతులను అందిస్తోంది. అమెరికా ఎన్నికల పోరు సందర్భోచిత కవర్‌స్టోరీ కథనం సూపర్బ్. కార్టూన్లు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఫైబర్ ఆవు భలే గమ్మత్తుగా ఉంది. ‘వల ది నెట్’ కథ చాలా బాగుంది. ‘అక్షరాలోచనాలు’ ప్రతి అక్షరం ఆలోచనాత్మకంగా ఉంటోంది. రచయితలకు ధన్యవాదాలు.
-నీలిమ సబ్బిశెట్టి (రాజానగరం)

సండే గీత
ఆదివారం అనుబంధంలో ‘సండే గీత’ ‘ఓ చిన్న మాట’ రెండూ మణిపూసల్లాంటివి. అవి చదివాకే మిగిలినవి. సృష్టిలో మార్పు సహజం. మార్పులను ఆమోదించడం తప్ప మరేం చేయలేం అనడం బావుంది. మాటలో మర్యాద గురించిన చిన్న మాట మనం మిస్ అవుతున్న మర్యాదను జ్ఞప్తికి తెచ్చింది. మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తాం. ఆంగ్లంలో అయితే మా ఇంట భోజనానికి రాగలరా అని పిలవాలి. కర్ణాటకలో పరిచయస్థుల్ని ఇంటి భోజనానికి పిలవరు. మన సంప్రదాయం ప్రకారం వారిని ఇంటి భోజనానికి పిలిస్తే ఎంతో సంతోషించి అబ్బురంగా అందరితో చెప్పుకుంటారు.
-కె.ప్రవీణ్ (కాకినాడ)

ప్రేరణ
మనం మంచి రిసోర్స్ పెర్సన్ అని మన సహోద్యోగుల్లో నమ్మకం కలిగించగలిగితే వారిలో మనం ప్రేరణ కలిగించగలం అంటూ శర్మగారు చెప్పిన విషయాలు ఉపయుక్తంగా ఉన్నాయి. ఆయన రాసే కాలమ్‌కి ఏదైనా పేరు పెడితే బాగుంటుంది కదా. క్రైం కథ బాగుంది. కాని నిజాయితీపరుడైన టాక్సీ డ్రైవర్‌ని చంపెయ్యడం అయ్యో అనిపించింది. మరణించిన వారి స్మృత్యర్థం బంధువులు అర్పించే నివాళులు అబ్బురపరిచాయి. మరణాన్ని కూడా సృజనాత్మకంగా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా నమ్మలేని నిజం. క్లాప్ కొట్టు గురూలో నటీమణులకు తప్ప పురుష పుంగవులకు స్థానం లేదా?
-కె.సుభాష్ (శ్రీనగర్)

బహిష్కరించుదాం
అక్షరాలోచనాల్లో ‘ప్రపంచ మేధావులారా ఈ అక్షరం పిలుపు ఆలకించండి’ అంటూ యుద్ధ అనర్థాల్ని వివరించిన ‘బహిష్కరించుదాం’ కవిత చాలా బాగుంది. ఎందుకొచ్చిన పట్నం ఇది? నాకేమిచ్చింది? నన్ను దయ్యమై పట్టి మనిషిని గాకుండా చేసిందంటూ గోపాలంగారు ఆవేదన చెందడం మా హృదయాల్ని కలచివేసింది.
-కె.లక్ష్మీప్రసన్న (పేర్రాజుపేట)

తైత్తరీయం
సామవేద సర్వస్వం అయిన స్వరాలంకార మయమైన సంగీతం సరస్వతీ లక్షణమయినా ఆరాధించే ఏ దైవ కృప వల్లనయినా ఇష్టకామ్యాలు సిద్ధించి ముక్తి పొందిన మహానుభావులలో రామభక్తుడు త్యాగయ్య ఒకడు. తైత్తరీయ తత్వంలోని ఆనందాలవల్లిలో చివరి అంకమయిన బ్రహ్మానందంలో తాను సృష్టించిన కృతుల కీర్తనలలో తాదాత్మ్యం చెందిన నాదబ్రహ్మ ఆయన. ఆర్థిక బాధలు ఆయనను అంటలేదు. వాటికాయన కృంగిపోలేదు. త్యాగయ్య కృతులు తెలుగువయినా ముఖ్యంగా తమిళులు కళ్లకద్దుకుని నిష్ణాతులయ్యారు, అవుతున్నారు. నిజమే కదా - మానసికానందానికి మించిన ఆనందం లేదన్నారు. ఓ మంచి పుస్తకం చదువుతుంటే ఇతరులెవరూ గోచరించరు. కొంగ్రొత్త శీర్షిక ‘అమృతవర్షిణి’ త్యాగరాజు శిష్య పరంపరలోని ఓ ‘కృతి’ మల్లాది సూరిబాబుగారిచే ప్రారంభించడం సంగీతం విని ఆనందించే వారికి ఆదివారం కానుక.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.