S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? ( నవంబర్ 20 నుండి 26 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అనుకున్న పనులు ఏదో ఒక రకంగా పూర్తి చేస్తారు. మీ ఆశయాల కనుగుణంగా కొందరు సాయపడతారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆర్థికంగా ఎదుగుతున్నా ఖర్చులు తప్పనిసరిగా ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ప్రయోజనకారిగా ఉంటాయి. ఆందోళన తగ్గించుకోవాలి. ఆరోగ్య భద్రత ముఖ్యం. స్థాన చలనాలు, ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. వృత్తి, వ్యాపార, ఉపాథి, ప్రయాణ రంగాల వారు అనుకున్నవి సాధిస్తారు. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ప్రయాణాలందు ఆందోళన పడకండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

అనుకోని ప్రయాణాలుంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పాటించండి. ఇంటి సమస్యలు, కంటి సమస్యలు రాకుండా చూసుకోండి. ఖర్చులు, రాబడులను సరిచూసుకోవాలి. అప్పులు అధికంగా చేయకండి. బంధుమిత్రుల మాటలకు మీ మాటలకు పొంతన కలిగి ఉండండి. మీ నిర్ణయాలకే ప్రాధాన్యత నివ్వండి. ఉద్యోగ వ్యవహారాలు సానుకూలపడతాయి. కొత్త సామాగ్రిని సమకూర్చుకుంటారు. స్పెక్యులేషన్ ఫరవాలేదనిపిస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంతాన సౌఖ్యాన్ని గుర్తిస్తారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

అనుకున్నదొక్కటి అవనున్నది ఒక్కటి అన్నట్లుంటుందీ కాలం. అనుకోని ఆశ్చర్యకరమైన సంతోషకరమైన సంఘటనలు మీ కుటుంబాన్ని ఆహ్లాదపరుస్తాయి. అపజయాలను సైతం మీకు అనుకూలంగా మార్చుకొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పు చేర్పులుంటాయి. ఆస్తి విలువ ఆనందాన్నిస్తుంది. ఆదాయ వ్యయాలు పరిధులు దాటకుండా ఉంటాయి. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు వేగవంతమై అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు. వౌనం మేలు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఉత్సాహంతో కార్యాలు పూర్తి చేస్తారు. గౌరవ మన్ననలు అందుకుంటారు. శుభ, పుణ్య కార్యాలకు ప్రత్యేకంగా పైకం కేటాయించే అవకాశముంది. నూతన వ్యాపారాలు మెరుగయ్యే సూచనలున్నాయి. ప్రతి పనిపై శ్రద్ధ చూపండి. ఇతరులు అన్న మాటలను పట్టించుకోవద్దు. హితులు మీకై ఎదురుచూస్తుంటారు. స్ర్తి మాట సాయంతో కొన్ని కుటుంబ కార్యాలు మెరుగుపరచుకొంటారు. వృత్తి, వ్యాపార, ఆర్థిక, చేతివృత్తులు, ట్రేడిగ్ లందు లాభాలను పొందుతారు. ప్రయాణాలందు మెళకువగా ఉండండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

అనుకున్న పనులు శ్రమ మీదట పూర్తి చేస్తారు. కొన్నింట మిశ్రమ ఫలితాలందుకుంటారు. అధకారులు అనుకూలంగా వున్నా, మిగిలిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. అనవసర మార్గదర్శకాలకు దూరంగా మసలండి. దంపతులు పరిశీలనాత్మక దృష్టితో ఉండాలి. ముఖ్యమైన శుభకార్యాలందు పాల్గొంటారు. మిత్రులు మీకు ప్రయోజనాన్ని కలిగిస్తారు. స్పెక్యులేషన్ తృప్తినిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. కొత్తవారితో జాగ్రత్తగా మాట్లాడండి. వైవిధ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పుష్టి ఉంటుంది. ఖర్చపై దృష్టి నిలపండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ప్రయత్న కార్యాలు సిద్ధిస్తాయి. స్థాయి మరచి ప్రవర్తించకండి. ఆరోగ్యం తృప్తినిస్తుంది. కీర్తి పొందుతారు. ఆందోళనలు తగ్గుతాయి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, బదిలీలుంటాయి. మీరు చేసే పనులను బట్టి గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. సంతోష వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలందు అనుకూలమైన సలహాలు ఉపకరిస్తాయి. ఆస్తిపై స్థిర ఆదాయానికి ప్రణాళికలు ప్రయోజనకారిగా ఉంటాయి. అతి ఎందులోనూ వద్దు. చేపట్టిన వృత్తులు ఆలోచింపజేస్తాయి. స్ర్తిలు మంచిని పెంచుకుంటారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

అన్నింటా శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పరిశ్రమ రంగాల వారు ఎదురుచూసినవి ఆలస్యంగా పొందుతారు. విందు వినోదాలు కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం యోగ్యంగా మలచుకోవాలి. అనుకోని ప్రయాణాలు, బదిలీలు, ఉద్యోగ మార్పులు ఉంటాయి. ఆదాయ వృద్ధి ఉంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. వాహన వేగాన్ని తగ్గించుకోవాలి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది. వ్యాపకాలు ఉపయుక్తంగా ఉంటాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

చేద్దామనుకున్న కార్యాలు మిత్రుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తత మేలు. అన్నీ శ్రమానుకూలంగా ఉంటాయి. ఒత్తిడి తగ్గనుంది. ఆటంకాలున్నా శుభకార్యాలు ముందుకు వెళతాయి. మీ లౌక్యానికి, ఆత్మశక్తితో పనులు ఊపందుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలు, విద్యార్జన కృషికి అనుకూలంగా ఉంటాయి. ఆదాయం కృషికి తగ్గట్టు ఉంటుంది. సన్నిహితులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు, ఇష్టులతో సమిష్టి ప్రయాణాలుంటాయి. విలువలను అన్నింటా పాటించండి. స్ర్తిలు అనుకున్నవి సాధించుకొంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

కోపతాపాలకు అవకాశమివ్వకండి. మార్పులు, తీర్పులు అనుకూలం. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతారు. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. కంటి, పంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. విమర్శలను పట్టించుకోకండి. స్ర్తిలు కోరుకున్నవి ఆలస్యంగా పొందుతారు. అధికారుల అండదండలుంటాయి. చేపట్టిన కార్యాలు ఊపందుకుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

అనుకున్న శుభాశుభ మిశ్రమాలుంటాయి. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. అధికారులు అనుకూలిస్తారు. ఇబ్బందులు లేని ప్రయాణాలుంటాయి. పెట్టుబడులు, రాబడులు ఆలోచింపజేస్తాయి. అనుకున్నవి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు కృషి మేరకు ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులు సమయానికి సాయాన్ని అందిస్తారు. అనుకున్న పనులు వాయిదా పడేట్లున్నాయి. మిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం యోగ్యంగా చూసుకోండి. వాహన మార్పిడి ఉంటుంది. శత్రు జయం,

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికై ప్రయత్నాలు, ఖర్చుల నియంత్రణ మేలు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. యంత్ర, వాహనాలు నడపటంలో మెళకువలు పాటించండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాలు పెట్టుబడుల విషయంలో తీసుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రియల్ ఎస్టేట్ రంగాల వారు తృప్తిని పొందుతారు. ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలుంటాయి. పర్యవేక్షణ మేలు. రైతాంగం వారు సమస్యలున్నా లౌక్యంతో బయటపడతారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆశించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల విషయాలలో ముఖ్య పాత్ర పోషించవలసి వస్తుంది. ఖర్చు అదుపు తప్పకుండా, ఆదాయాన్ని పెంచుకోండి. వృత్తి, వ్యాపారాలందు రాణింపు. ఆరోగ్య లాభం. సంతాన ప్రాప్తి. కుటుంబ సభ్యులకు మీ సంప్రదింపులు ఉపకరిస్తాయి. ఇతరుల సమస్యలు మీవి అనుకోకండి. అన్నింటా ముందంజలో ఉంటారు. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక ప్రయాణాలుంటాయి. స్వీయ పర్యవేక్షణ మేలు.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855