S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

తనకల్లు, నవంబర్ 19 : మండల పరిధిలోని డేగానువారిపల్లి ప్రాంతం లో శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులను గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తనకల్లు నుంచి డేగానువారిపల్లికి బాలాజినాయుడు(19), సురేష్‌నాయుడు(16), సోమశేఖర్‌లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీనితో బాలాజినాయుడు, సురేష్‌నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాలాజినాయుడు కదిరి వివేకానంద డిగ్రీ కాలేజిలో బిఎస్‌సి చదువుతున్నాడు. సురేష్‌నాయుడు ఇంటర్ కదిరి ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. సోమశేఖర్ వంకపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సంఘటన విషయాన్ని డేగానువారిపల్లి గ్రామస్థులు ఎస్‌ఐ శ్రీనివాసులుకు అందించగా ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకని మృతి
బత్తలపల్లి, నవంబర్ 19: మండల పరిధిలోని పోట్లమర్రి సమీపంలో గల పెట్రోలుబంకు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన బాలిరెడ్డి (38) మోటార్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న పొలంలో సాగు చేసిన కనకాంబరాలకు సంబంధించి డబ్బులు రావాల్సి ఉండగా బత్తలపల్లికి ద్విచక్ర వాహనంలో వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో పోట్లమర్రి సమీపంలో గల పెట్రోలుబంకు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనగానే ఎగిరిపడి అదే సమయంలో వస్తున్న పుట్టపర్తి డిపో బస్సును ఢీకొనగానే బాలిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుమార్గాన వస్తున్న పోట్లమర్రి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు హనుమంతరెడ్డి వెంటనే బత్తలపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైలుకింద పడి యువకుడి మృతి
అనంతపురం అర్బన్, నవంబర్ 19: నగరంలోని రామ్‌నగర్ సమీపంలో జాకీర్ కొట్టాలకు చెందిన షాహిద్ (17) రైలు కిందపడి మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రే జరిగివుండవచ్చునని తెలిపారు. రైల్వే హెచ్‌సి శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు జాకీర్ కొట్టాలకు చెందిన షాహిద్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడని, చిన్నపుడే తల్లి మరణించిందన్నారు. తండ్రితో కలిసి వుంటున్నారన్నారు. మృతునికి జ్యోతిష్యం పిచ్చి వుందని, మూడు నెలల క్రితం ఓ జ్యోతిష్యుని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నాడని, జ్యోతిష్యుడు మూడు నెలల లోపు రక్తం కక్కుకుని చస్తావు అని హెచ్చరించినట్లు, దీంతో కొద్ది రోజులుగా మానసికంగా బాధపడుతూ జీవితం విరక్తి చెంది శుక్రవారం రైలు కిందపడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం సర్వజన అసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
బెళుగుప్ప, నవంబర్ 19 : మండల పరిధిలోని దుద్దేకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు, శిరీషా కుమార్తె అక్షయ (7నెలలు) శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు దుద్దేకుంటకు చెందిన భార్యాభర్తలు రామాంజినేయులు, శిరీషా, కూతురు అక్షయ, రామంజినేయులు తమ్ముడు తిమ్మప్పతో కలసి బెళుగుప్ప నుండి దుద్దెకుంటకు ఆటోలో వెళ్తుండగా బెళుగుప్ప సమీపంలోని వేర్‌హౌస్ వద్ద ప్రమాదవ శాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో అక్షయ అక్కడిక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులు రామంజినేయులు, శిరీషకు గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు మృతి
బత్తలపల్లి, నవంబర్ 19: మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రంగయ్య(60) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామాపురం గ్రామస్తుడైన రంగయ్య ఈ నెల 15న తన ఇంటి వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.