S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం - ఎడిటర్‌తో ముఖాముఖి

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తులు కొత్తనోట్లు ముద్రించలేరా?
వాళ్లు ముద్రించే లోపు కొత్త నోట్లు రద్దుకావచ్చు

ప్యాకేజీతప్ప ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టంగా చెప్పిన తర్వాతకూడా జగన్ మిగతా ప్రజాసమస్యలేవీ లేనట్లు దానిమీదే గొడవపడటం ఎందుకు?
వేరే స్లోగన్ దొరికించుకోలేక.

కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉండి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉపన్యాసాలు దంచుతున్నాడు. ముఖ్యమంత్రి పీఠం మీద కనే్నశాడంటారా?
ముఖ్యమంత్రి పీఠమే తన మీద కనే్నసిందని అనుకుంటున్నాడేమో!

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
నల్లధనం నిరుపేదలకు పంచితే పుణ్యం పురుషార్థం రెండూ లభిస్తాయి కదా?
‘నల్ల’నయ్యలు ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే బిజీగా ఉన్నారు.

తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి, విశాఖ
గోవా బీచ్‌లో బికినీలు, సన్‌బాత్‌లు, రంగుల గొడుగులు, సర్ఫింగ్ క్రీడలకు అడ్డురాని హిందూ సంస్కృతి, విశాఖలో ప్రప్రథమంగా మూడు రోజులు ప్రేమోత్సవాలు జరిపి ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనుకోవడం, తద్వారా పర్యాటక రంగానికి పెట్టుబడులకు ముఖ్య కేంద్రం చేయాలనుకోవడం తప్పెలా అవుతుంది?
ఆ ఉత్సవం గోవాలో పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. గోవా విచ్చలవిడితనాన్ని తెలుగునాడుకు పాకించడం తప్పు.

ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
అపవాదులెదుర్కొన్న ట్రంప్ నెగ్గడమేమిటి? రాజకీయానుభవం కలిగి సర్వే రిపోర్టులు తీర్పు ఇచ్చినా హిల్లరీ ఓడిపోవడమేమిటి?
మీడియా కళ్లతో చూస్తే అమెరికా అర్థం కాదు.

చడీచప్పుడూ లేకుండా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం సబబేనంటారా? మరల కొత్త 500, 2000 నోట్లు వచ్చిన తరువాత నల్లధనం పేరుకుపోదా?
ఇప్పటి స్థాయిలో జరగదు. ముందు కథ చాలా ఉంది.

గోనుగుంట్ల మురళీకృష్ణ, రేపల్లె
500, 1000 నోట్ల రద్దు నైతిక విలువలు పెరగటానికి దోహదం చేస్తుందంటారా?
బహుశా- కొంతవరకు

ఆ నోట్లు రద్దు చేసి అంతకన్నా విలువైన 2000 నోట్లను ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? వీటి బదులుగా అవి కూడబెడతారుకదా!
పోయిన పెద్ద నోట్లంత ధారాళంగా కొత్త నోట్లు చలామణిలోకి రావు. కాబట్టి ఆ పని కష్టం.

పుష్యమీసాగర్, హైదరాబాద్
మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు వలన నల్లధనం రావడం మాట ఎలా ఉన్నా సామాన్యులు విపరీతమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లోనే ఇలా జరగడం వలన వేలాది మంది ఉపాథి కోల్పోవాల్సి వచ్చింది. ఉద్దేశం మంచిదే అయినా ముందస్తు చర్యలు లేకపోవడం వలన విమర్శలకు గురికావలసి వచ్చింది కదా... ఇంతకీ నోటు రద్దు మంచిదా? చెడ్డదా?
మంచిదే.

సామాన్యులలో ఎక్కువ శాతం అంగీకరించడం లేదు. సరి అయిన అవగాహన లేక అంటారా?
ఔను. ప్రజలు మరీ అవస్థలు పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయలేని ప్రభుత్వ లోపం కూడా ఒక కారణమే.

మరోవైపు చాలామంది పెద్ద సెలబ్రిటీస్ ఇది మంచిదే, అవినీతి అరికడుతుంది అని సెలవిస్తున్నారు. ఇలా ప్రకటనలు చేసే బడాబాబులు సక్రమంగా పన్నులు కడుతున్నారా?
అలాంటివి మనం అడక్కూడదు.

గుండు రమణయ్య గౌడ్, పెద్దపల్లి
ఉగ్రదాడుల నేపథ్యంలో సినిమాల్లో పాకిస్తాన్ కళాకారుల నిషేధంపై మీ అభిప్రాయం?
మంచిదే.

నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వ్యవసాయానికి బహుళజాతి కంపెనీల పీడ పోవాలి.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
న్యాయస్థానంలో న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురుచూసే కక్షిదారులవలె, ప్రతివారం ‘మనలోమనం’లో మీరు ఇచ్చే సమాధానాల కోసం ఎదురు చూడటం ఆంధ్రభూమి పాఠకుల వంతు అయింది!
ఇదో శిక్ష అన్నమాట!

ఎం.కనకదుర్గ, తెనాలి
ప్రపంచంలో ఉగ్రవాదం పుట్టుకకు, విస్తరణకు ప్రస్తుత భయానక స్థితికి చేరుకుని ఏటా వేలాదిమందిని బలి తీసుకునే స్థాయికి చేరుకోవడానికి సామ్రాజ్యవాదమే కారణం అనిపిస్తోంది. ఏదోఒక పేరుతో ప్రపంచంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకున్న అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాల వైఖరి మారనంతవరకు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం కష్టం కాదా?
ఔను.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com