S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రైం

విపత్కర పరిస్థితుల్లో ఒక గదిలో బంధించబడి నిస్సహాయంగా రోజుల తరబడి ఉండిపోయిన మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో క్రైం కథలో చక్కగా వివరించారు. క్రైం కథల ప్రత్యేకత అదే. వస్తు వైవిధ్యం! వెటకారం చేసేవారికి కనిపించకపోవచ్చు గానీ రైల్వేస్‌లో కాస్తంత మార్పు కనిపిస్తోంది. ప్లాట్‌ఫామ్స్ వెనకటికన్నా శుభ్రంగా ఉన్నాయి. రైళ్ల సరాసరి ఆలస్యం 2 గంటలు తగ్గింది. ఎస్సెమ్మెస్ చేయగానే పక్క స్టేషన్‌లో సిబ్బంది వచ్చి ఆగిపోయిన ఫ్యాన్ తిరిగేట్టు చేసి వెళ్లారు. టిటిఇ డబ్బు తీసుకొని బెర్తులు ఇస్తున్నాడని ఎస్సెమ్మెస్ పంపగానే సిబ్బంది వచ్చి టిటిఇని అరెస్టు చేశారు. ఇది ప్రగతి కాదా?
-బి.సోనాలి (సూర్యారావుపేట)
చిన్న మాట
‘ఓ చిన్న మాట’గా మంచి పుస్తకాలు చదవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందనడం సబబే. కాని ధిక్కార స్వరం వస్తుంది. అన్యాయాన్ని ఎదిరించే తత్వం అలవడుతుందనడం ఏమో గాని నాకేల అని తప్పుకుపోయే వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. మలయాళం సినిమా చూస్తూ భాష అర్థంకాక గోపాలంగారు పడిన అవస్థలు చదివితే దశాబ్దాల క్రితం థియేటర్ మధ్యలో కూచుని హిందీ సినిమా డైలాగులు రన్నింగ్ కామెంటరీలాగ తెలుగులో గట్టిగా అందరికీ వినిపించేట్టు చెప్పే ప్రక్రియ జ్ఞాపకం వచ్చింది. పరభాషా చిత్రాలు చూసేటప్పుడు ప్రతి పదం అర్థం తెలియకపోయినా కథ స్థూలంగా అర్థం అవుతూనే ఉంటుంది.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)
అమృతవర్షిణి
మల్లాది సూరిబాబుగారు కర్ణాటక సంగీత విశే్లషణ అనితర సాధ్యంగా, వారి సంగీత పరిజ్ఞానంతో మహాకళాకారుల విశేష విషయాలను, విద్వాంసులకే కాక, సంగీతాభిమానులకు అపూర్వంగా వివరించడం ఒక వరంగా భావించాలి. కర్ణాటక సంగీతంలో స్టార్ సింగర్స్‌లో విదుషీమణులైన ఎం.ఎల్. వసంతకుమారి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మిల సంగీత ప్రావీణ్యతను తేటతెల్లంగా తెలియజేయడం, సూరిబాబుగారి పరిశీలనకు మచ్చుతునక. స్వయంగా రామదాసు కీర్తనలు పాడటంలో దిట్ట అయిన వీరు ఇతర సంగీతజ్ఞులను పరిచయం గావించడం వారి సహృదయతకు తార్కాణం. ఆరోహణ అవరోహణలు, రాగాలు చెప్పడమే కాదు అని చెప్తూ స్క్రిప్ట్‌కూ, పాడే స్వరాలకు తేడా ఉంటుందని, ఆనాటి గురువుల సూచనలను మనకందించిన మల్లాదివారి శీర్షిక ఎంతో విలువైనది.
-యం.వి.రమణకుమారి (హైదరాబాద్)

ఎంపిక
‘ఎంపిక’ కథ బాగుంది. శాంతికి యశ్వంత్ కొద్దిపాటి పరిచయం వున్న వ్యక్తి అయినా తనకు తోడుగా నిలిచి సహాయం చేస్తాడని అనుకొంది. ఐతే యశ్వంత్ అవకాశవాది మనీమైండెడ్ మనిషి అని తెలియటంతో అతడి నుంచి దూరం జరిగి... సరైన నిర్ణయం తీసుకుంది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
మీకు తెలుసా?
ఈ శీర్షికలో చెప్పిన పోలెండ్ కోళ్లు, చిలుకల్లాంటి పుష్పాలు, వేలాడే నగ్నమానవుల్లా కనిపించే పుష్పాల విశేషాలు భలేగా ఉన్నాయి. కర్ణాటక సంగీతంలో స్టార్ సింగర్లపై వ్యాసం ఆకర్షించింది. రెండువేల రకాలున్న ఉక్కు ముళ్లకంచెలున్న మ్యూజియం గురించి చదివి ఆశ్చర్యపోయాం. అలాంటి ముళ్లకంచెలు చూస్తూనే ఉంటాం. వాటి వెనుక ఇంత కథ ఉందా? మానవ జీవితంలో మార్పు సహజం అంటూ మార్పును స్వాగతించే ప్రేరణ పద్ధతుల్ని బాగా వివరించారు శర్మగారు.
-పి.చంద్ర (కాకినాడ)
కథాసాగరం
కథాసాగరం కొత్త శీర్షిక పేరు చూసి ఇప్పుడొస్తున్న కథల్లో ఆణిముత్యాల్ని పరిచయం చేస్తారనుకొన్నాం. కాని ‘సండే గీత’ ‘ఓ చిన్న మాట’ లాంటి మరో ఆణిముత్యం అనుకోలేదు. బాగుంది. సండే గీతలో జీవన మరణాల గురించి చెప్తూ మరణం ఎలాంటి శబ్దం లేకుండా మట్టిలో ఇంకిపోయే బిందువులా రావాలి. మిగుల ముగ్గి నేలరాలే పండులా రావాలి అని చెప్పడం ఎంతో బాగుంది. ‘అవీ ఇవీ’లో పిల్లల్ని బొజ్జపై పడుకోబెట్టుకొని సముద్రజలంలో వెల్లకిలా ఈదే సీఆట్టర్ విశేషంగా అలరించింది.
-కె.ప్రవీణ్ (కాకినాడ)
రాజకీయం
గాంధీని గొప్పవానిగా చేయడం తెల్లవారి రాజకీయమా? అని అడిగిన ప్రశ్నకు మీ సమాధానం మా కళ్లు తెరిపించింది. ఈ మధ్య సుప్రీం మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ గాంధీని బ్రిటీష్ వారి ఏజెంట్‌గా అభివర్ణించడం జ్ఞాపకం వచ్చాక మా ఆలోచనలు రగుల్కొన్నాయి. నిజమే. మీరు చెప్పినట్టు గాంధీ కీర్తి అంతా బ్రిటీష్‌వారి చలువే.
-సదా ప్రసాద్ (గొడారిగుంట)