S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాస్తవాలు

మల్లాది సూరిబాబుగారు ‘అమృతవర్షిణి’ శీర్షికలో సంప్రదాయ సంగీత వారధుల వివరణలో ఎంతో వాస్తవం ఉంది. మహా సంగీత స్రష్ఠలు రూపొందించిన శాస్ర్తియ సంగీతాన్ని, లలిత సంగీతంలా మార్చి, తేలికగా రూపొందిస్తున్న విధానాలు, సంప్రదాయ సంగీతాన్ని కించపరిచేలా అన్నమయ్య పాటలు బాధాకరంగా ఉన్నాయి. సినీ గీతాలు సందర్భోచితంగా రచించబడి, గొప్ప నేపథ్య గాయనీ గాయకులు మధురంగా పాడేసిన పాటలు, అతి సులభంగా నేర్చేసుకుని, వేదికలపై పాడేస్తూ గాయకులుగా చెలామణీ అయ్యే కృత్రిమ అనుకరణలు, అసలు సంగీతమనేది ఇంకా ఉందా? అనే అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. బాణీలు రక్తికట్టేలా ఉండి, కలకాలం అవి పాడుకోబడేలా అన్నమయ్య సంకీర్తనలు కూడా ఉండాలి. కానీ కాస్తో కూస్తో పాట తెలిసిన వారు స్వరకర్తలుగా మారి వాటిని ప్రచారం చేసేస్తున్నామని అనడం, అనుకోవడం ఆ సంకీర్తనలకు అపచారమే. చక్కటి వ్యాసాలను అందజేస్తున్నందుకు ధన్యవాదాలు.
-యం.కమల (హైదరాబాద్)

చక్కని ముగింపు
‘అన్‌ఫిట్’ కథ ఆలోచింపజేసింది. అధికారులు తమ కింద పనిచేసేవారు పొరపాట్లు చేస్తే విసుక్కోకుండా, సున్నితంగా హెచ్చరిస్తూ సరిదిద్దితే వారు మెరుగుపరచుకుంటారు. కాని డాక్టర్ కృతి పట్ల చీఫ్ డాక్టర్ వౌక్తిక్ లాగా దురుసుగా ప్రవర్తిస్తే చివరకు తనకే అది బెడిసికొడుతుందని నిరూపించింది. అలాగే డాక్టర్లు తమ చేతిరాత, నోటిదురుసుతనం సరిచేసుకోవాలని తెలిపింది. ఆఖరికి కృతి చక్కని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది సమాజానికి కనువిప్పు.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)

అరుదైన వరం
ఆంధ్రులకు దక్కిన అరుదైన వరం గానగంధర్వ బాలసుబ్రహ్మణ్యంపై ‘కవర్‌స్టోరీ’ చాలా బాగుంది. మాకు తెలియని ఎన్నో విషయాలు చక్కగా విశదీకరించారు. జాతి విరోధులకు పౌరహక్కులు వర్తించవని నిష్కర్షగా మీరు చెప్పిన సమాధానం మాకెంతో నచ్చింది. అందరూ ఆ విధంగా భావిస్తే ఎంత బాగుణ్ణు! శస్త్ర చికిత్సకు ఆద్యుడు మన భారతీయుడు సుశ్రుతునిపై చిరువ్యాసం అలరించింది. మనం ఆభరణాల్లో వాడే పగడాలు నిజానికి ఒక సముద్రజీవి అవశేషాలు అని తెలిసి ఆశ్చర్యపోయాం. కష్టపడి సంపాదించింది ఎప్పుడూ విలువైనదే. అక్రమార్జన అన్యాయమే అని చెప్పిన కథాసాగరంలోని కథ ఆకట్టుకుంది.
-కె.గునే్నశ్ (కొవ్వాడ)

బాలు
బాలసుబ్రహ్మణ్యం బాలుడు కాదు. సంగీత సాధనలో ఆరితేరినవాడు. పండిత పామరులను సైతం అమితంగా మెప్పించినవాడు. అన్ని రకాల పాటలను నవరసాలలో బంధించినవాడు. మంచి మాటకారి. అంతకు మించి ఆకట్టుకునే వ్యాఖ్యాత. పాటల పూర్వాపరాలు తెలిసినవాడు. వీటిని అందరకూ తెలియజేస్తున్న మహామనీషి. మహమ్మద్ రఫీ అంటే మిక్కిలి మక్కువ కలిగినా ఘంటసాలను తలవనిదే తనకు పుట్టగతులుండవని నమ్మేవాడు. తనికెళ్ల భరణి జ్ఞాపకాల్లో ప్రచురించిన ఫొటోల్లో బాలు ఘంటసాల కలిసి ఉన్న ఒక ఫొటోని ఇచ్చి ఉంటే మరింత కనువిందుగా ఉండేది.
-ఎన్.ఆర్.లక్ష్మి (సికిందరాబాద్)

సత్యం
జీవితంలో మనం నమ్మింది చెప్పగలగాలి. అదీ స్పష్టంగా! అదే బలం! అంటూ చెప్పిన ‘సండే గీత’లో ఎంతో సత్యం ఉంది. మనసులో మాట స్పష్టంగా చెప్పలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకునేవారు ఎందరో ఉన్నారు. వారికి ఈ గీత కనువిప్పు కావాలి. జెయింట్ ఫ్రైడ్ ఎగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్, కదళీ నివేదన, పుష్కర శోభ అలరించాయి. అధికార పార్టీ ప్రయోజనాలకు ప్రజాధనం వెచ్చించడాన్ని చట్టపరంగా నిలదీయొచ్చన్న మీ సమాధానం సరియైనదే అయితే మహా చండీయాగం బ్రహ్మాండంగా నిర్వహించి అదంతా నా సొంత సొమ్మని చెప్పుకునే ముఖ్యమంత్రుల్నేం చేయగలం?
-పి.చంద్ర (కాకినాడ)

పరిమళం
పాటకు పరిమళం అద్దిన కంఠం.. మాటకు మార్దవం నేర్పిన గళం- పరిచయం అక్కరలేని పేరు బాలు! ఆయన గురించి ఎంత చదివినా ఆయన పాటలు ఎన్ని విన్నా తనివి తీరదు. జన్మ సరిపోదు. బాలు గురించి కవర్‌స్టోరీ అలరించింది. కూలిపోయిన లిఫ్ట్‌లోని ఆరుగురిలో ఒకడు మరణించగా అది ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించినా, మరణించిన వ్యక్తి తండ్రి అది హత్యగా భావించి ఏడాది తర్వాత లిఫ్ట్‌లో మిగిలిన వారిలో నలుగురిని విందుకు ఆహ్వానించి హంతకుడు తనకు తానుగా తెలియకుండానే శిక్ష విధించుకోవడం క్రైం కథని అద్భుతంగా ఆవిష్కరించారు.
-కె.సుధీర్ (కాకినాడ)
**
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.