S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్లాస్టిక్ కరెన్సీ

పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడానికి కారణం ఇరుగు పొరుగు దేశాల ద్వారా పెద్దఎత్తున నకిలీ నోట్లు దేశాన్ని ముంచెత్తడం, ఉగ్రమూకలకు ఊతమివ్వడం అని తెలుపుతూ, నల్లకుబేరుల ఆట కట్టించే ఉద్దేశంతో ఇలా వాత పెట్టిందని తెలిపారు. అయినా సరే కొత్తనోట్లకూ నకిలీ బెడద పొంచి ఉందని తెలుపుతూ, అసలు నోట్ల తయారీ విధానం, వాటికి నకిలీలు వచ్చే విధానం తెలుపుతూ ‘ప్లాస్టిక్ కరెన్సీ’ ఆవశ్యకతను వివరించారు. పాలిమర్ నోట్లను అందుబాటులోకి తేవాలనే వాదన, దాని తయారీ విధానం తెలుసుకున్నాం. దీనివల్ల నకళ్లను తయారుచేయడానికి అవకాశం లేదని గ్రహించాం. ప్లాస్టిక్ నోట్ల వల్ల ప్రయోజనాలను సవివరంగా తెలుసుకున్నాం. ఇండియాలోనూ ప్లాస్టిక్ నోట్లు చెలామణిలోకి వస్తే మోసకారుల ఆట కట్టించవచ్చు. అమాయకులు నష్టపోరు.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)
క్రైం కథ
బద్ధకస్తుడైనా బుర్రని వాడుతూ ఉండే షెరీఫ్ ఎత్తుగడతో చిత్తు అయి దొరికిపోయిన హంతకుని క్రైం కథ ఆకట్టుకుంది. ప్రతి కథలోనూ సామాజిక స్పృహ సుత్తి, సందేశాల భారం ఉండనక్కర్లేదు. సరదాగానూ ఉండొచ్చు - అంటూ గోపాలంగారు కథకిచ్చిన నిర్వచనం మాకు నచ్చింది. గాన యోగి వోలేటి పదునైన తన కంఠంతో చక్కని అడుగులతో తెల్ల పావురాల్ని గాలిలోకి విసురుతున్నట్లు పాడుతూంటే ఆ చిన్మయ లహరిని గొప్పగా వర్ణించారు మల్లాది సూరిబాబుగారు. శాస్ర్తియ ఆవిష్కరణల్లో వాతావరణ మార్పుల గురించి స్ప్రింగ్ సిద్ధాంతం గురించి చెప్పిన విషయాలు ఆకట్టుకున్నాయి.
-కె.గునే్నశ్ (కొవ్వాడ)
మనీమనీ
నకిలీ నోట్ల బెడద నుంచి దేశాన్ని కాపాడడానికి ప్లాస్టిక్ మనీ ఎలా ఉపయోగపడుతుందో కవర్‌స్టోరీలో బాగా వివరించారు. ఆస్ట్రేలియాని ఆదర్శంగా తీసుకొని మనమూ ఆ రంగంలోకి ఎంత త్వరగా ప్రవేశిస్తే అంత మంచిది . అక్షరాలోచనాల్లో ‘ముద్దు ముద్దులో మురిపెం..’ హైకూ బాగుంది.
-ఎ.చైతన్య (వాకలపూడి)
సండే గీత
ఈ శీర్షిక ద్వారా అందించిన ‘మరణం’ అనే ప్రక్రియను ఆత్మ ఒక ప్రయాణం ముగిసాక మరొక ప్రయాణం ప్రారంభించేదిగా, నిశ్శబ్దంగా కాలం ఒడిలో జారిపోయే సందర్భంగా విశే్లషించుకొని, స్వాగతించగలిగితే, అది ఎంతో మధురమైన సంఘటనగా ఉంటుంది. ‘ఎంపిక’ కథ బాగుంది. కథాసాగరం ఫీచర్ ప్రారంభంలోనే ఆకట్టుకొంది. చక్కని జీవిత సత్యాలను కథల రూపంలో అందించే ప్రక్రియ స్వాగతించదగినది. కర్ణాటక సంగీతం ఔన్నత్యాన్ని చాటిచెబుతున్న అమృతవర్షిణి శీర్షిక మాలాంటి సంగీతాభిమానులకు ప్రాణప్రదంగా ఉంటోంది.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
బాల్యం
‘సండే గీత’లో ఇంక్ పెన్నుల గురించి చెప్పి మా బాల్యం గుర్తుకు తెచ్చారు. మేం కూడా చాలాకాలం లారెల్ రోజ్, ఎమరాల్డ్ గ్రీన్ సిరాలు వాడేవాళ్లం. తర్వాత వాటి ఉత్పత్తి ఆగిపోగా బాల్‌పెన్‌లోకి మారాం. ఇప్పుడు ఇంక్ పెన్‌లు గగన కుసుమాలు! ‘అవీ ఇవీ’లో 800 మీటర్ల పది కేజీల పాగా పెట్టుకొని వినోదం పంచుతున్న వ్యక్తి, సంగీతంతో నిరసన తెలిపే మహిళ అంశాలు బాగున్నాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన దేశంలో గెలిచిన వ్యక్తి మాకొద్దు అని నిరసన వ్యక్తం చేయడం వింతగా ఉంది.
-ఆర్.సత్య (కరప)
అమృతవర్షిణి
ఈ శీర్షిక ద్వారా ప్రతీ వారం ఒక్కో సంగతిని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ప్లాస్టిక్ కరెన్సీ గురించి తెలియపరచినందుకు కృతజ్ఞతలు. ‘ఆ రాత్రి’ కథ మాకెంతో నచ్చింది. ‘లోకాభిరామమ్’ గురించిన విశేషాలను ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ శీర్షిక ద్వారా ఎన్నో విషయాలను పాఠకులతో పంచుకొంటూ తీయటి అనుభూతిని కలిగిస్తున్నారు.
-చోడవరపు నాగేశ్వరరావు (బాగ్‌అంబర్‌పేట)
గత స్మృతులు
గత స్మృతులను మరల గుర్తు చేస్తున్న మల్లాది సూరిబాబుగారి ‘అమృతవర్షిణి’ ఆదివారం అనుబంధానికి హైలైట్. దాదాపు శత వసంతాలు జీవించిన పినాకపాణిగారు, అలాగే నేదునూరి గార్లను మనసారా తలచుకోవడం, వారి శాస్ర్తియ సంగీతభరిత కీర్తనలను మాధ్యమాల ద్వారా వింటూ కళ్లు మూసుకుని తన్మయత్వం పొందని తనువుండదు. సంగీతం విని ఆనందించనివాడు తల్లిదండ్రులను హత్య చేయడానికి కూడా వెనుకాడడని షేక్స్‌పియర్ అన్నట్టు ఎక్కడో చదివిన జ్ఞాపకం. కర్ణాటక సంగీతం వినేవారి సంఖ్య తగ్గుతున్నా, వటవృక్షంలా మన భారతీయ సంస్కృతిలో నాటుకుపోయిన ఈ సామవేదం ఎప్పటికీ అమరమే.
-ఎన్.ఆర్.ఎల్. (సికిందరాబాద్)