S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? డిసెంబర్ 25 నుండి 31 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అంచనాలు తారుమారవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక వనరులు చర్చనీయాంశమవుతాయి. అనుకోని ఖర్చులు, తడబాటులు వచ్చేట్లున్నాయి. ఏదయినా అంతా మీ మంచికే అన్న భావనతో ఉండండి. అనుకోని అతిథుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. పైకం సర్దుబాటు అవుతుంది. వదంతులు నమ్మకండి. కచ్చితత్వం మేలు చేస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు సంయమనం పాటించాలి. ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. మతిమరపు లేకుండా వ్యవహరించండి. స్పెక్యులేషన్ స్వల్ప లాభం. సమయ పాలన మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
అనుకోని బరువు బాధ్యతలు మోయవలసి వస్తుంది. ఇతరుల కార్యాలందు తలదూర్చకండి. ఇబ్బందులు పడతారు. సుఖ సంతోషాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో పనితనంతో సంబంధీకుల మెప్పును పొందుతారు. వ్యాపారాదులు తృప్తినిస్తాయి. వృత్తి, ప్రవృత్తి కార్యాలందు దృష్టిని నిలుపుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వున్నా, ఏదో వెలితి గోచరిస్తుంది. అవసరానికి హితులు ఆదుకుంటారు. వాదులాటకు దిగకండి. స్ర్తి పురుషులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నవి పొందుతారు. దూరపు బంధువుల రాక ఆనందాన్నిస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ద్వంద్వ వైఖరితో పనులు ప్రారంభించకండి. అవగాహనతో కార్యాలు పూర్తి చేయండి. నిరుద్యోగులకు సదవకాశాలు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకోని పనులు కూడా తేలికగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సాంకేతిక, కళ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాల వారికి శుభప్రదమైన కాలం. ఆచితూచి అన్నింటా వ్యవహరించండి. ఓర్పు నేర్పు మీకు ఉపయోగపడతాయి. నిరీక్షణ ప్రయోజనకారి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అనుకున్నది ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. వాయిదా పద్ధతులు అంత మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. ముఖ్యమైన ఖర్చులు, ప్రయాణాలు అనుకోని రీతిలో ఉండనున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తత పాటించండి. బకాయి పడ్డ పనులు మిత్రుల సాయంతో పూర్తవుతాయి. దంపతులు సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళతారు. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. స్వీయ పర్యవేక్షణ అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు తృప్తినిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
విద్యార్థులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షలు అనుకూలిస్తాయి. తాత్కాలిక ఉపాథి మార్గాలు చిరుద్యోగులకు అదనపు ఆదాయాన్ని అందిస్తాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, వైద్య రంగాల వారు తృప్తిని పొందుతారు. స్పెక్యులేషన్ ఆలస్యంగా ఫలిస్తాయి. ప్రయాణాలందు విలువైన ఆభరణాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. కొనుగోలు విషయంలోనూ. ఆస్తి విలువలు, రియల్ ఎస్టేట్ రంగాల వారు అనుకున్నది సాధిస్తారు. రావలసిన పైకం ఆలస్యంగానైనా అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

మీ పరిధిలో విజయాన్ని సాధిస్తారు. అనుకున్న కార్యాలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అన్ని విధాల పైకి ఎదుగుతారు. కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది. అధికారం అనుకూలిస్తుంది. చాలాకాలంగా వున్న సమస్యలు పరిష్కార మార్గంలో సమసిపోతాయి. వృధా కార్యక్రమాలు చేపట్టకండి. ఏకాగ్రతకు భంగం కలుగకుండా చూసుకోండి. దంపతులు సమిష్టిగా మేలైన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. స్పెక్యులేషన్ ఫలవంతమవుతుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రగతి గోచరిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. శ్రద్ధ అన్నింటా ముఖ్యం. ఒత్తిడిని పెంచుకోవద్దు. విద్య, వైద్య, పోటీ పరీక్షలు లాభాన్నిస్తాయి. పెద్దల, అధికారుల అండదండలుంటాయి. రియల్ ఎస్టేట్ వృద్ధి పొందుతుంది. వైవిధ్యభరితమైన పనులకు ఇతరులతో కలిసి శ్రీకారం చుడతారు. మొహమాటం, మొండితనం విడనాడండి. స్ర్తిలు వారికి కావల్సినవి క్రమం తప్పకుండా పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్నవి తలవని తలంపుగా నెరవేరుతాయి. ఊహించని విజయం పొందుతారు. బదిలీలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అన్నింటా ఆశించిన ఫలితాలు లభిస్తాయి. గౌరవ పురస్కారాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, స్టేషనరీ, ఐ.టి. రంగాల వారు అభివృద్ధిని చూస్తారు. గత వైభవం మళ్లీ వస్తుంది. కొత్త పనుల్ని ఆరంభిస్తారు. స్పెక్యులేషన్ ఫలవంతం. మంచి వార్తలు వింటారు. సంతోషాన్ని పంచుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

వ్యాపార, వృత్తి విస్తరణ, మార్పులుంటాయి. ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. ముఖ్యమైన పనులకు పైకం సర్దుబాటవుతుంది. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తత అవసరం. ప్రయాణాలు ఆలోచించి నిర్ణయించండి. ఆలోచనలు ఉత్సాహాన్నిస్తాయి. మీ మార్గదర్శకత్వంలో ముఖ్యమైన పనులను హితులు పూర్తి చేసుకుంటారు. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆందోళనకు గురికాకండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్న ప్రగతి గోచరిస్తుంది. సమయానికి పైకం అందుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. ఓ శుభవార్త అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. అవకాశం ఎదురవుతుంది. వ్యాపార, ఉద్యోగ, వృత్తి రంగాల వారు అనుకోని ఉపయోగ కార్యాలు చేపడతారు. ఎదురుచూస్తున్న పనులు నేర్పుతో పూర్తి చేస్తారు. మీ సమర్థతే మీకు ప్రశంసల నందిస్తుంది. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

పట్టిందల్లా బంగారం చందాన పనులు ప్రయోజనకరంగా పూర్తవుతాయి. ఏకాగ్రతతో కార్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి గతంకంటె మేలు. వ్యయ భారం పెరిగేట్లుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు వద్దు. నిందలు వేసేవారిని లక్ష్యపెట్టకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల వారు అనుకోని లాభాలను పొందుతారు. మనశ్శాంతి కొరవడే అవకాశముంది. రుణ సమస్యలు మెల్లగా తొలగుతాయి. నమ్మినవారి సూచనలు వమ్ముకావు. శ్రమతో మీ రంగంలో వృద్ధిని సాధిస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

స్వ, పర జనములతో మాటలాడేటపుడు జాగ్రత్తలను, మెళకువలను పాటించండి. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. బుద్ధిబలంతో మంచి ఫలితాలను, పట్టును సాధిస్తారు. కార్యసిద్ధి ఉంది. ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ధైర్య సాహసాలు ఆపద నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. అనుకోకుండా పైకం సర్దుబాటవుతుంది. అనుబంధాలు, బంధాలు ఆలోచింపజేస్తాయి. స్పెక్యులేషన్ ఫలప్రదమవుతుంది.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855