S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం(ఎడిటర్‌తో ముఖాముఖి)

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
ఒక మత బోధకుడు టీవీలో ప్రసంగిస్తూ కోతిని కొలిచేవారు కోతులేనన్నాడు. పరోక్షంగా ఆంజనేయ స్వామి ఆరాధకుల మీద విమర్శ చేసినట్లు కాదా?
ఔను. కోతులలాగే మీద పడి ఒళ్లంతా కరిస్తే మళ్లీ ఆ కూత కూయడు. కాని భక్తులు ఆ పని చెయ్యరు. అందుకే హిందువులు అందరికీ అలుసు.

వరిగొండ కాంతారావు, హనుమకొండ
పత్రికలలో ప్రచురింపబడే వ్యాసాలకు పాత్రికేయ భాషా వాసన అంటుకోవడం అనివార్యమా?
కాదు. భాషలో, వ్యక్తీకరణలో తప్పులు, అభ్యంతరకర అంశాలు లేనంతవరకు ఎవరి శైలిలో వారు రాసిన దాన్ని తగుమాత్రం ఎడిటింగుతో ప్రచురించటమే భావ్యం.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మధ్యాహ్నం 2 గంటలకే మరణించినట్లు మీడియాలో వార్తలు, వాట్సప్‌లో ఫొటోలు కూడా వచ్చాయి. అంతర్జాతీయ న్యూస్ ఛానెల్స్‌లో కూడా ఈ విషయం వచ్చింది. అయితే ప్రభుత్వపరంగా అధికారిక ప్రకటన రాత్రి 11 గంటలకు మాత్రమే వెలువడింది. ఇందుకు కారణాలు ఏమిటి? ఈ విషయంలో పాటించాల్సిన ప్రొటోకాల్స్ ఏమైనా ఉన్నాయా?
అనంతర ఏర్పాట్లు, సర్దుబాట్లు, పరిష్కారాలు, పరామర్శకు రావలసిన వారి వీలూ చాలూ, వగైరాలన్నీ చూసుకున్నాకే ఘరానా వ్యక్తుల మరణాన్ని ప్రకటించటం ఇప్పటి పద్ధతి. జయలలితకు ముందూ ఇలాంటివి ఎన్నో జరిగాయి. అనేక సంపన్న కుటుంబాలలో ఈ మధ్య ఇదే రివాజు.

సాంస్కృతిక కళా రంగాలలో విశేష ఖ్యాతి గడించిన ఎందరో తెలుగువారికి జాతీయపరంగా వచ్చిన గుర్తింపు, పురస్కారాలు తక్కువేనని చెప్పాలి. అదీ లాబీయంగ్ చేసి, ఒత్తిడి తెచ్చే పొరుగు రాష్ట్రాలలోని కళాకారులకు పురస్కారాలు తామరతంపరగా వచ్చి పడుతున్నాయ. కె.విశ్వనాథ్, బాలమురళీకృష్ణ, కైకాల ఇలా ఎందరో లబధ్రపతిష్ఠులను గుర్తించి గౌరవించడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. మీ అభిప్రాయం ఏమిటి?
పైరవీ లేనిదే ఏ పనీ కాదు. మనవాళ్ల ప్రతిభ గుర్తింపునకు మనం సాయపడాలన్న ఇంగితజ్ఞానం పై స్థాయలోని మన శాల్తీలకు లేదు.

కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా అటు చిత్రసీమను, నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావితం చేసిన యన్టీఆర్‌కు అటు ఫాల్కే రాలేదు, ఇటు భారతరత్న ఇప్పటికీ రాలేదు. ఎందుకు?
వాళ్ల అల్లుడికి తెలియాలి.

సిహెచ్. సాయ ఋత్విక్, నల్గొండ
రెండేళ్లలో దేశంలో నగదు రహిత విధానంతోనే లావాదేవీలు జరుపుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రకటించాయ. గ్రామీణ ప్రాంతాలకు చేరువ కాని బ్యాంకింగ్ వ్యవస్థ, సగం మందికి కూడా చేరువకాని అంతర్జాలం, నత్తనడకన నడుస్తున్న అక్షరాస్యత, నగదును నిల్వ చేసుకునే సంప్రదాయ భారతీయ విధానం తదితర సమస్యల కారణంగా ఇంత త్వరగా క్యాష్‌లెస్ విధానం అమలుచేయడం సాధ్యమేనంటారా?
రోగం కంటే వైద్యం ప్రాణాంతకం.

డి.వై. అన్నపూర్ణ, రాజమండ్రి
ప్రతిపక్షాలన్నీ ఒక్కటైనా చలించకుండా తన మనస్సులో ఉన్నది ఉన్నట్లు రాత్రికి రాత్రి చెయ్యగల ‘గండరగండడు’ - కాశ్మీర్‌లో 370ని ఎందుకు తొలగించలేదు?
దానికి చాలా దమ్ములుండాలి.

గుండు రమణయ్య, పెద్దాపూర్, పెద్దపల్లి
ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇదే చివరి క్యూ’ అంటే నమ్మవచ్చా?
రాజకీయ నాయకుల మాటల్ని ఎవరు నమ్మమన్నారు?

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
విద్యాదానం గొప్పదా? అన్నదానం గొప్పదా? కడుపు నిండితే ‘చాలు’ అనే సంతృప్తి అన్నదానం గుణం. మరి విద్యాదానమునకు ‘ఇంత’ అని పరిమితి లేదు కదా?
ఔను. జీవితకాలానికి సరిపడా అన్నం పెట్టేది విద్య.

పి.రామకృష్ణ, రాజమండ్రి
దేవాలయ సిబ్బంది, వలంటీర్లు తమని జబ్బపట్టి లాగుతున్నారని, దీనివల్ల శ్రీవారి దర్శనంలో ఏకాగ్రతకి భంగం కలుగుతోందని భక్తులు డయల్ యువర్ ఇ.ఓ. కి చెప్పేదాకా తెలియదా? ఇదేమి చోద్యం? సదరు ఇ.ఓ.గారు క్యూ లైన్లు ఎప్పుడూ పరిశీలించరా?
వారు పరిశీలించే సమయంలో అలాంటివి జరగవు. జరుగుతున్నాయని తెలిసినా అధికారులు పట్టించుకోరు. అన్ని పెద్ద దేవాలయాల్లో ఉన్నదే ఇది.

పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
వెండితెరపై జాతీయ గీతాలాపన నిర్ణయం సముచితం. కాని ప్రదర్శించినా ప్రేక్షకులు ఎంతవరకు నిలబడతారనేది ప్రశ్నార్థకమే? కాదంటారా? పోలీసుల చెకింగ్ ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది?
పోలీసుల చెకింగు కంటే తోటి ప్రేక్షకుల చెకింగే మంచి ప్రభావం చూపుతుంది. నిమిషంపాటు తిన్నగా నిలబడలేవా అని మిగతా వారు దులిపేస్తే కొక్కిరాయిలకు కాస్త భయం ఉంటుంది.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
మనలో మనం, ఆదివారం అనుబంధం,
ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్-500003.
bhoomisunday@deccanmail.com