S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ అందాల ఆరబోత!

యువతను కైఫ్ ఎక్కించే సోయగాల సుందరి నికిషా పటేల్ గుర్తిందిగా! అవునులే.. అప్పుడే ఎలా మరచిపోతాం. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘కొమురం పులి’లో రెచ్చిపోయిన ఈ భామకు ఆ చిత్రం తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. పవన్‌కళ్యాణ్ సరసన అనే సరికి అందరూ నికిషాను చిత్రం విడుదలకు ముందు తెగ పొగిడేశారు. కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చాక ఆమె ఆశ తలకిందులైంది. అనుకున్నదొక్కటీ.. అయింది మరొక్కటీ! దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఈ అమ్మడు ఇక లాభం లేదునుకుందో..ఏమో..! కోలీవుడ్‌పై గురిపెట్టింది. టాలీవుడ్‌లో ఎందుకు నెగ్గుకు రాలేదో బాగా తెలుసుకుంది. ఆ అవకాశం కోలీవుడ్‌కు ఇవ్వలేదు. రెచ్చిపోయింది. తమిళ తంబీల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కోలీవుడ్‌లో చేసిన చిత్రాలు తక్కువే అయినా మంచి క్రేజ్‌తో పాటు ఒకింత సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది. ‘తలైవన్’తో అక్కడ అడుగుపెట్టి ‘ఎన్నమో ఏదో’, ‘కరైఓరం’, ‘నారదన్’ సినిమాలతో మంచి గ్లామర్ నటిగా విశేష ప్రాచుర్యాన్ని సొంతం చేసుకుంది. అంతటితో ఆగలేదు. తన తీరని దాహం టాలీవుడ్డే. ఆ దిశగా మళ్లీ ఇక్కడ రెచ్చిపోయేందుకు సిద్ధమవుతోంది. ఎలాగైనా టాలీవుడ్‌లో తన సత్తా చాటాలనుకుంటోందిట. అందులో భాగంగానే ‘అరకురోడ్’ అందాలు ఆరబోసింది. అయినా కాసింత నిరాశే! ఇకపై చేసే చిత్రాల్లో అందాలకే పెద్దపీట అని దర్శక, నిర్మాతలకు సెలవిచ్చింది. ఆ దిశగానే తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందట. ‘టాలీవుడ్‌లో నికిషా పవరేంటో త్వరలోనే చూస్తారుగా’ అంటూ తన సన్నిహితుల వద్ద అత్యుత్సాహంతో ఉరకలు కూడా వేస్తుందిట. ప్చ్..నికిషా.. గడుసుపిండమే!!