S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
మానవుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, తీరని బాధ కలిగినప్పుడు దైవాన్ని కొలుస్తాడు! కాని ఇతర సమయముల యందు దైవం జ్ఞప్తికి రాడు! ఇది కేవలం స్వార్థచింతనా? తెలిసి కూడా అహంభావనతో ప్రవర్తిస్తున్నాడా? తన కార్యం అయితే ముడుపులు చెల్లిస్తానని మొక్కుకొంటాడు! మరి ఈ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి?
అదే ‘మాయ’.

మన పెద్దలు శ్మశానం ఊరికి చాలా దూరంలో ఏర్పాటు చేసేవారు! అది శాస్త్ర సమ్మతం! కాని నేడు శ్మశానం నడిబొడ్డుగా నిలిచింది. ఇది అనిష్టానికేనా? కలి ప్రభావమా?
అన్నివైపులా ఊరు పెరుగుతూ పోయేకొద్దీ ఊరి బయటి స్మశానం ఊరి మధ్యలోకి రావటం అనివార్యం. అలాగని దాన్ని మళ్లీ పెరిగిన ఊరి బయటికి తరలించడమూ అయ్యే పనికాదు. పట్నవాసాలకు వాస్తు శాస్త్రం కుదరదని సరిపెట్టుకోవలసిందే.

కాళిదాసు విజయ్‌చంద్ర, కావలి
కేరళలో సంఘ కార్యకర్తల హత్యోదంతాలు తెల్సుకోవాలంటే జాగృతి, లోకహితం, హిందూ నగారా, సాందీపనిలు చదవాల్సిందేనా. మామూలు పత్రికలకు అవి పట్టవా? ఏ కళ్లద్దాలు పెట్టుకొన్నాయవి?
సూడో సెక్యులర్ ఎర్రద్దాలు.

వై.శేషగిరిరావు, ధవళేశ్వరం
ఐటి దాడుల్లో దొరికిన కొత్త నోట్లు వెంటనే బ్యాంకు ఎటిఎం అన్నింటిలోనూ పెట్టకూడదా? వీళ్ల దారిన వీళ్లు నో క్యాష్ అని ఏడుస్తుంటే వాళ్లు (ఐటి వాళ్లు) ఆ డబ్బు కోర్టులో జమచేసి పదేళ్లు కేసు నానబెట్టి తర్వాత అన్నీ ‘రద్దు’ చేస్తారా? లేక కొంత పార్టీ ఫండు ఇచ్చి కొంత పంచుకుంటారా? వెంటనే బ్యాంకుల్లో పెట్టడానికి జైట్లీ వద్దన్నాడా?
ఆ పనీ జరుగుతుందంటున్నారు.

ప్రొ.కే.ఎన్.రావు, కావలి
నవ్యాంధ్ర రాజధాని నగర అమరావతి యందు, రాష్ట్రం కోసం అమరజీవి అయిన కీ.శే.శ్రీ పొట్టి శ్రీరాములుగారి నిలువెత్తు పాలరాతి విగ్రహమును నిర్మింపజేసి ఆవిష్కరించు అభిప్రాయమును స్వపర భేదములు లేక అన్ని రాజకీయ పక్షములు సి.ఎం. బాబు గారిని కోరవచ్చును గదా?
పొట్టి శ్రీరాములా? ఎవరాయన? ఏ పార్టీ? అనగలరు మన నేతాశ్రీలు.

గోనుగుంట మురళీకృష్ణ, రేపల్లె
పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేదిట. ఇది కూడా నగదు రహితమేగా! అది మళ్లీ వస్తే ఎలా ఉంటుందంటారు?
కాష్ కరువు ఇలాగే సాగితే మునుముందు ఆ రోజులూ రావచ్చు.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
పి.ఎం.గారు నోట్లు రద్దు చేయకుండా నవంబరు 8 నుండి ఇలా ఐ.టి. దాడులు చేస్తే, ప్రజలకు ఈ కష్టాలు ఉండేవి కాదు, నల్లకుబేరులు పట్టుబడేవారు. ఎందుకు ఇలా చేయలేదూ?
పాపం ఎక్కడో లెక్క తప్పింది.

పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
పనీ పాటా లేకుండా ఎవరి మీద పడితే వారి మీద కోర్టుల్లో పిటీషన్లు, ‘పిల్’ కేసులు వేసే వారి మీద హైకోర్టు జరిమానా వేస్తే మంచిదే కదా? అలాగే డబ్బు కోసం ఈ కేసులు తీసుకునే లాయర్ల మీద కూడ జరిమానా విధిస్తే బాగుంటుంది కదండీ!
మంచిదే. కాని అది బలవంతుల చేతిలో ఆయుధంగా మారే ప్రమాదం లేకుండా చూడాలి.

ఆర్థిక శాఖ పాత నోట్లకు రోజుకో రూల్, సవరణలు. నిన్న పాత నోట్లు 5 వేలకు ఆరాలంటే, నేడు ఏం అక్కర లేదని, గడువుకు ఒక్కసారే మార్పిడి అని! రేపు ఏమంటారో? ఎందుకీ పిల్లిమొగ్గలు, కప్పదాటు వ్యవహారాలు. ముందు నోట్లు రద్దు మంచిదే అన్న బాబు కూడ అసంతృప్తి వ్యతిరేకత మెలికలు; మొత్తానికి విమర్శలకు తావిచ్చి తలనొప్పులు తెచ్చుకుంటున్నారనిపిస్తూంది.
ఔను.

ఆర్.కె., హైదరాబాద్
సత్రం పేరుతో అన్నదానం చేస్తూ రుసుము వసూలు చేసి, రసీదులు రాయడం కన్నా, వాటినే హొటళ్లు అనవచ్చుగా?
రుసుము వసూలుచేస్తే హోటలు. తిన్నవారు ఇష్టపూర్వకంగా ఇచ్చేదానికి రసీదు ఇస్తే సత్రం.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
గతంలో సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల ఆదరణ పొందిన రాంగోపాల్‌వర్మ ‘వంగవీటి’లాంటి వివాదాస్పద చిత్రాలు నిర్మించడం కేవలం పబ్లిసిటీ కోసమేనా? ఇలాంటి చిత్రాలను నిర్మించి ఏమి సాధించాలని? సామాజిక అంశాలతో చక్కటి కథాంశాలు ఎన్నుకోవచ్చుగదా?
ఎవరి టేస్టు వారిది.

కొటికలపూడి మధుసూదనరావు, నిజామాబాద్
మంచివాడు మంచి చావు, చెడ్డవాడు చెడ్డచావు చస్తారు’ అని మన హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది. గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి - వీరి చావులు ఎలా భావించాలి?
అలాగని ఏ ధర్మశాస్త్రంలో ఉందో నాకు తెలియదు. మీరన్నవారి అంతం భయానకమే అయనా ఒక రకంగా వారివీ అనాయాస మరణాలే.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
మనలో మనం,
ఆదివారం అనుబంధం,
ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్-500003.
: email :
sundaymag@andhrabhoomi.net