S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ తపన

తెల్లవారితే సముద్రం
వుండకపోవచ్చు
చుక్కలు పొదిగిన
ఆకాశం మళ్లీ
కనిపించకపోవచ్చు
లేదా
ఈ గాలి స్వేచ్ఛగ
ఎడారుల్ని పరిచి
వింత స్వప్నాల లోకాల్లోకి
తేలిపోవచ్చు
కుడి ఎడమల జ్వాలాముఖి
ఏ క్షణమో పేలవచ్చు
సహజంగా మార్పు
కొన్ని భయాలతో
మొదలవుతుంది
ఈ సుదీర్ఘమైన రాత్రి
ఆకులా కదులుతున్న
ఓ పర్వతాన్ని మీరు చూడవచ్చు
ఒక్క ఆకలికే ఈ లోకం
జ్వలించదు
ఒక్క వెనె్నలకే ప్రణయకాలం
సంకేతం వరించదు
సతమతమవుతున్న ఈ తపన
ఏ నిరీక్షణ కాలంలోకో
తేలిపోతుంది

- రవి ఆర్కె, 9849294127