S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్నేహం (సండే గీత)

చాలా విషయాల్లో మన అభిప్రాయాలతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. అదే విధంగా ఇతరుల అభిప్రాయాలతో మనం కూడా ఏకీభవించకపోవచ్చు. ఏకీభవించకపోయినా గౌరవించాలి. ఈ అభిప్రాయంతో చాలాకాలం నుంచి చాలా మంది ఉన్నారు. కానీ ఈ ఫేస్‌బుక్‌ల కాలం వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారిపోయింది. తమ అభిప్రాయాలతో ఏకీభవించని మిత్రులని చాలామంది అస్నేహితునిగా మారుస్తున్నారు. ఈ విషయం గురించి ఓ ఇద్దరు కవి మిత్రుల సంభాషణ నన్ను బాగా ఆకర్షించింది.
ఇక, విషయంలోకి వస్తే ఓ పేరొందిన కవి మిత్రుడిని చాలామంది అస్నేహితున్ని చేశారు. ఆయన మాటల్లో చెప్పాలంటే...
నాకు బాగా మిత్రుడు అనుకున్న కవి మిత్రుని పలకరిద్దామని ఆయన పేజీలోకి వెళ్లాను. విచిత్రం. ఆయనకు నేను స్నేహితున్ని కాను. ఒకరితో ఒకరి ఇళ్లకు వెళ్లేంత సాన్నిహిత్యం ఉండేది. ఐడియాలజికల్ భేదాల వల్ల అతనికి నేను స్నేహితున్ని కాలేకుండా పోయాను. ఐడియాలజికల్ వాదాలు లేకుండా సాహితీ లోకంలో ఎవరమూ లేము. మరెందుకు ఇలా జరిగింది.
ఇట్లాగే ఇంకో బృందం నుంచి కూడా అస్నేహాలు సంపాదించాను. ఎన్‌కౌంటర్లలో పలువురు మరణిస్తున్నా ఆ ఎత్తుగడని మార్చకపోవడం సరైంది కాదని అన్నందుకు ఈ అస్నేహాలు సంపాదించాను. ఒక మైనారిటీగా ముస్లింల మీద హిందువుల దాడులను ఖండించాల్సిందే కానీ ఒక మతంగా ఇస్లాంను సైతం విమర్శించాల్సిందేనని అన్నందుకు మరో ముగ్గురికి అన్‌ఫ్రెండ్ అయినాను. వీళ్లతో అన్‌ఫ్రెండ్ అయినందుకు బాధగానే ఉంది.
ఈ బాధకి మహంతి అనే మిత్రుడు చాలా మంచి జవాబు ఇచ్చాడు. ఇది ఆ కవి మిత్రులకే కాదు అందరికీ వర్తిస్తుంది.
‘ఈ ఉధృతం కల్లోలిత భూభ్రమణంలో మహామహా సిద్ధాంత వేదాంత రాద్ధాంతాలే చెల్లాచెదురై ఉల్కాపాతాల్లా రాలిపేలిపోతుంటే.. లేనిది..
అఫ్టరాల్.. ఏవో పిల్లిమొగ్గలేస్తూ, ఏవేవో ఐడింటిలా ఆసరాతో, ఓ చిన్న టైం అండ్ స్పేస్‌ను ఆక్రమించి, అదే అనంతమనే అతిశయాన్ని ఆశ్రయించి తమ సమీప పరిసరాలను సైతం నిజాయితీగా ప్రభావితం చేయడం చేతకాని అర్భక వ్యక్తిత్వాల అల్పప్రాణుల అలకలు కలయికల గురించి ఇంత అలజడి అవసరమా?
గిరగిరా తిరుగుతున్న భూమి బంతిపై వేలాడుతున్న ఏడువందల కోట్ల మానవాళి జనాభాలో మనమెరిగిన వారెందరు.. అందులో మనల్ని నచ్చేమెచ్చే వారెందరు. ఆ కొద్ది మందిలో ఎవరో కొందరు ఏవో కారణాలతో పక్కకు తప్పుకుంటే బాధపడాల్సింది ఎందుకు...?
మిగిలిన కోటానుకోట్ల మంది నుంచి నూతన స్నేహాలు వెతుక్కోలేమా.. సరికొత్త ప్రయోగాలు సాహించలేమా..
ఏదీ పరమ సత్యం కాదు. ఎవరూ పరమ జ్ఞానీ కాదు. ఏదీ శాశ్వత బంధం కాదు. అంతా సాపేక్షితం. నచ్చిన దారిలో ప్రయాణం. కలిసొచ్చేవారే సహచరులు’
అభిప్రాయ భేదాలు వున్నప్పుడు స్నేహాలను వదులుకోకుండా మిత్రులను గౌరవించాలి. గౌరవించని మిత్రుల గురించి బాధపడుతూ వుండకుండా కొత్త స్నేహాలతో ప్రయాణం కొనసాగించాలి.

- జింబో 94404 83001