S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చనిపోయనట్లు నటించి...

ఇక్కడ కనిపిస్తున్న ‘ఒస్సొమ్’ అనే క్షీరదం మరణించినట్టు కనిపిస్తోంది కదూ!. కానీ అది జీవించే ఉంది. శత్రువులను ఏమార్చడానికి అలా చచ్చినట్లు పడి ఉంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోను, కెనడాలోను కంగారూల మాదిరిగా పిల్లల్ని కనడానికి ఉండే పొట్టసంచీ ఉన్న ఏకైక క్షీరదం ఇది. వీటిని ఒస్సొమ్, పొస్సొమ్ అని పిలుస్తారు. 35 అంగుళాల పొడవు, మూడు కేజీల బరువు వరకు పెరిగే ఈ జంతువుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి పుట్టినప్పుడు కేవలం తేనెటీగ అంత చిన్నవిగా ఉంటాయి. పూర్తిగా ఎదిగేవరకు తల్లి పొట్టసంచీలోనే ఉంటాయి. ఎదుగుతున్న కొద్దీ తల్లి వీపుపై ఎక్కి హంగామా చేస్తూంటాయి. పెద్దయ్యాక సొంతగా బతుకుతాయి. శత్రువు లేదా ప్రమాదం ఎదురైనప్పుడు చనిపోయనట్లు నటిస్తాయి. కళ్లు తేలేయడం, నోట్లోంచి నురగ కక్కడం, నాలుక బయటకు వేళ్లాడేలా చేయడం, దుర్వాసనతోకూడిన ద్రవాలను విడుదల చేయడం వంటి పనులన్నీ చేస్తుంది. ఎంత తరచి చూసినా అది బతికి ఉందని కనిపెట్టడం కష్టం. వీటి చేష్టలను ‘పొస్సొమ్ ప్లే’గా పేర్కొంటారు. అతితెలివి చూపేవారిని, మోసం చేసేవారిని ఈ పరిభాషాపదంతో ఉదహరిస్తుంటారు. చాలా తక్కువ ప్రాంతాలలో వీటిని ఆహారంగా తీసుకుంటారు.

- ఎస్.కె.కె. రవళి