S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్కేలేదు!

వెండితెరపై వెలిగిపోవాలని ఎన్నో ఆశలు.. మరెన్నో కోరికలు.. అన్నీ నీరుగారిపోయాయి అందాల భామ సలోని విషయంలో. అచ్చ తెలుగమ్మాయికి వుండవలసిన అన్నీ ఫీచర్స్ వున్నా కెరీర్‌ని మాత్రం నిలబెట్టలేకపోయాయి. హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా పెట్టి అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించినా, ఆ చిత్రంలో హీరోయిన్‌గా మెరిసిన సలోనికి మాత్రం అవకాశాలను తెచ్చిపెట్టలేకపోయింది. తాజాగా టాలీవుడ్‌లో ఎవరితోనైనా..ఎలాంటి క్యారెక్టర్‌నైనా చేయడానికి సిద్ధమంటోందిట. అవేమిటో ఆమె మాటల్లోనే...

* మాది సింధీ ఫ్యామిలీ. మహారాష్టల్రో సెటిలయ్యాం. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. అమ్మ హౌస్‌వైఫ్.
* చదువు విషయానికొస్తే సైకాలజీలో డిగ్రీ.
* సినిమాల్లోకి రావడం మా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. మా ఫాదర్‌కైతే అస్సలు సినిమాలంటేనే ఎలర్జీ. నన్ను మంచి ఉద్యోగిగా చూడాలన్నది నాన్న కోరిక.
* మదర్ ప్రోత్సాహంతో ఫాదర్‌కి తెలియకుండా మోడలింగ్ ఏజెన్సీకి నా ప్రొఫైల్ పంపించాను. ఆ విషయం తెలిసి ఫాదర్
బాగా మందలించారు. తర్వాతర్వాత మెల్లిగా మోడల్‌గా మారి పలు కంపెనీ ఉత్పత్తులకు మోడలింగ్ చేశాను. మోడల్‌గా వస్తున్న పేరు చూసి ఫాదర్ సంతోషపడ్డారు.
* తొలిసారిగా 2003లో బాలీవుడ్‌లో సినిమా చేశా.
* 2005లో తెలుగులో ‘్ధన 51’ చేశాను. తర్వాత ‘ఒక ఊరిలో..’.
* ఎస్.ఎస్.రాజవౌళి ‘మగధీర’తో మంచి గుర్తింపు. ఆయన దర్శకత్వంలోనే ‘మర్యాదరామన్న’ పెద్ద బ్లాక్ బస్టర్.
* అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. అది ఎవరితోనైనా నటించడానికి రెడీనే.
* టాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనుంది.
* అత్యాశలేమీ లేవు. ఏదో అయిపోవాలన్న ఆరాటం అంతకన్నా లేదు.
* చేసినవి కొన్నయినా అవి ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే రవ్వంత ఆశ..అంతే!!

-సమీర్