S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గట్టి పోటీ!

బాలీవుడ్‌లో నువ్వా..నేనా? అన్న రీతిలో కెరీర్‌ను కొనసాగించిన అందాల భామలు దీపికాపడుకొనే, ప్రియాంక చోప్రాలకు హాలీవుడ్‌లోనూ ఇదే తంతు కొనసాగుతోందిట. హిందీ చిత్రాల్లో అగ్ర హీరోలనుంచి యువతరం కథానాయకులతో ఆడిపాడిన ఈ సుందరీమణులు నటించిన హాలీవుడ్ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ‘క్వాంటికో’ టీవీ సీరిస్ ద్వారా ఇప్పటికే హాలీవుడ్ జనాలకు బాగా పరిచయమైంది ప్రియాంక. అలాగే దీపికాపడుకొనే ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమాతో కొత్తగా హాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. బాలీవుడ్‌లోనే కాదు, హాలీవుడ్‌లోనూ ప్రియాంకకు దీపికా గట్టిపోటీదారుగానే కనిపిస్తోందిట. ఈ విషయం గురించి ప్రియాంకను కదిలిస్తే- ‘‘ఎక్కడైనా నాకు నేనే పోటీ. నాకెవరూ రారు సాటి. బాలీవుడ్‌లో ఎన్నో పాత్రల్లో నా ఫవరేంటో చూపించాను. అలాగే హాలీవుడ్‌లోనూ నా వంతు కృషి చేస్తున్నా. అంత మాత్రాన నాకు పోటీగా మరొకరు అని నేననుకోవడం లేదు. బాలీవుడ్‌లో నటించిన సినిమాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలాగే హాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిని నేను సమర్ధవంతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సిద్ధమయ్యాను’’అంటూ చెప్పుకొచ్చింది. వాహ్..ప్రియాంక!!

-సమీర్