S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రహస్యం చెప్పే పాదాల రంగు

జతకట్టేందుకు ఆడపక్షి ముందు లయబద్ధంగా నృత్యం చేసే ఈ సముద్ర పక్షుల పేరు ‘బ్లూ ఫుట్ బూబీ’. అందమైన నీలిరంగు పాదాలతో కనిపించే ఈ పక్షులు ‘కోర్ట్‌షిప్’ డ్యాన్స్‌కు పెట్టిందిపేరు. అయితే వాటి కాళ్ల రంగు వెనుక అతి ముఖ్యమైన రహస్యం ఉంది. అవి తినే ఆహారాన్ని బట్టి నీలిరంగు వస్తుంది. కరోటినాయిడ్స్‌తో కూడిన పిగ్మెంటేషన్ వల్ల ఆ రంగు వస్తుంది. రోగనిరోధక శక్తిని ఈ రంగు కలిగిస్తుంది. నీళ్లలో వీటి పాదాలకు ఏమీ కాకుండా ఈ రంగు కాపాడుతుంది. యవ్వనంలో ఉన్న పక్షులకు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న పక్షులకు ఈ నీలిరంగు స్పష్టంగా, కాంతివంతంగా ఉంటుంది. జతకట్టే ముందు ఈ మెరుపు ఎక్కువగా ఉన్న పక్షులనే ఆడపక్షులు ఎంచుకుని జతకడతాయి. రంగుతగ్గిందీ అంటే అవి వయసుపైబడినవని లేదా ఆరోగ్యం సరిగాలేనివని గుర్తిస్తాయి. అలాంటి పక్షులతో జతకలిస్తే బలహీనమైన సంతతిని కనడానికి ఇష్టపడవు. అందుకే ఏ మాత్రం రాజీపడని ఆడపక్షులు సమఉజ్జీలాంటి మగతోడును ఎంచుకుంటాయి. పాదాల రంగు, అవి చేసే డ్యాన్స్‌లో కొత్తదనం ఈ ఎంపికలో కీలకపాత్ర పోషిస్తాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, దక్షిణ అమెరికాలోని పెరూ, గలపగొస్ దీవుల్లో ఈ పక్షులు కనిపిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి