S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటి కళ్లే ఆకర్షణ

దక్షిణ అమెరికాలోని అతికొద్ది దేశాల్లో మాత్రమే కనిపించే ఈ ఎలుగుంట్ల పేరు వాటి కళ్ల ఆధారంగా వచ్చింది. వీటిని ‘స్పెక్టకల్డ్ బేర్స్’ అని పిలుస్తారు. వాటి కళ్లవద్ద ఉంటే మచ్చలు కళ్లద్దాల్లా కన్పించడం వల్ల ఆ పేరు వచ్చింది. ప్రతి ఎలుగుబంటికి ఈ మచ్చలు చూడటానికి ఒకేలా ఉన్నా భిన్నాంగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచి ఈ మచ్చలు వాటికి వస్తాయి. మన వేలిముద్రల్లా. మిగతా ఎలుగుల మాదిరిగా కాకుండా వీటి జీవితకాలంలో ఎక్కువ భాగం చెట్లపైనే ఉంటాయి. అందుకోసం చెట్ల కొమ్మలు, ఆకులు, ఊడలు, తీగలతో మంచెలు కట్టుకుంటాయికూడా. ఆడవాటికన్నా మగవి దాదాపు రెట్టింపు సైజులో ఉండటం మరో విశేషం. అర్జెంటినా, పెరు, ఈక్వెడార్, బొలీవియా, కొలంబియా, వెనిజులాలో ఇవి కనిపిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి