S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మట్టిరంగు బొమ్మలు

ఊరంటే... కొన్ని వీధులూ
యంకొన్ని యళ్ల సముదాయాలే కాదు,
కాసిన్ని ప్రేమలూ, పాశాలూ
ఆశలూ, ఆత్మీయతలూ కూడా!
అప్పటి వూరు... గంపెడు సంసారాల్ని
గుట్టుగా కడుపున దాచుకునే కోళ్లగంప!
పూరిళ్లూ మిద్దెలే గానీ, అవి ప్రేమ పందిళ్లు!
చెదిరిపోని అనుబంధాల చలువ పందిళ్లు!
గర్భగుడిలా - యళ్లు,
కాసింత యరుకుగానే ఉన్నా...
మనసులు, మోసులెత్తిన విశాల పచ్చిక మైదానాలు!
పల్లెపాదాన ఘల్లుఘల్లున మోగే సిరిమువ్వల్లా
రుతువు కొమ్మల మీద
రాగాలు పాడే మట్టిగువ్వలు!

పసుపు కుంకుమారబోసినట్టున్న పసిడిపొద్దులూ,
ఎండకావుళ్లు మోసుకొచ్చేవారికి
కొంగునీడ పట్టే తోటలూ,
నేలమ్మ ఎద పొంగిన పాలధారల సెలయేళ్లూ,
వేకువ నదిలో అరటిదొప్పల మీద సాగే కార్తీక దీపాలూ
కలువపూల కళ్ల కోనేటి కాంతులూ
ఆలపొదుగుల లేగల తుళ్లింతలూ
యంటిముందు మఠమేసిన ధాన్యం గాదులూ
చల్లకుండను చిలికే వేకువ కవ్వాలూ
తుళ్లే తుంపరల్లానూ... పల్లె మెడలో పచ్చలహారంలానూ... ఎగిరే పక్షులూ
వేప మండలతో అసిరమ్మ ఘటాల ముందు
మోగే డప్పుల సవ్వళ్లూ
వీధి అరుగుల మీద ఊసులు ఆరబోయడాలూ
పున్నమి రాత్రులు పంచన వెనె్నల గంధాలూ
ఊరి చెట్టుకు రెమ్మల్లా
కమ్మరి కుమ్మరి కులవృత్తులూ
వాకాయపూల స్వాగతాల పొలాల కాలిబాటలూ,
గాలి ఉయ్యాలలూగే
మబ్బులను బ్రతిమలాడి, బీళ్లు
పసిడి క్షేత్రాలుగా సింగారించుకోవటాలూ,
తూరుపు కొమ్మ వంచి సూరీడ్ని తుంచి
పల్లె సిగలో తురుముకోవటాలూ
వెనె్నల తీగల్ని వీధి దీపాలు చేసి వెలిగించుకోవటాలూ
తరతరాల ఆచారాల సాంప్రదాయాల పండగల పబ్బాల ఆనంద తరంగాల
ఆనాటి నా వూరు ఒక జీవనది!
మాయదారి కాలం దాపురించింది
వేయపడగల విధ్వంసమేదో
అభివృద్ధి ముసుగేసుకుని
నా వూర్లో అడుగుపెట్టిందివాళ!
యపుడు, యళ్లముందు అరుగులూ లేవు,
అనుబంధాలూ లేవు!
మిద్దెలు కూలిపోయనట్టు
మమతల మందిరాలూ కూలిపోయాయ!
పల్లె గుడారాల్ని
పట్నం ఎడారి ఓడలు ఆక్రమించిన వేళ
యపుడు, వూరు కాంక్రీట్ తోటై పోయంది

రెక్కలు విప్పార్చిన సెల్ టవర్లూ
నల్లత్రాచుల రహదార్లూ
పెట్రో రేసు గుర్రాలూ హైటెక్ సాలెగూళ్లూ
విద్యుత్ వెనె్నల తరంగాలూ... ఒకటేమిటి?
బహుళ బేహారుల గూడలైపోయన
డిజిటల్ పల్లెల్లో లేనివేమున్నాయ?
కానీ, మనుషులే లేరిక్కడ!
ఉన్నా... కనిపించని కత్తులకోత పడ్డ
వాళ్ల మొహాల్లో నెత్తురుచుక్క లేదివాళ
పైన గంభీరంగానే ఉన్నా...
లోన ఎడతెగని దుఃఖంతో గాయపడ్డ మనసులు
చితికి చితికి చితులై రగులుతూనే ఉన్నాయ!

వచ్చిపడింది ప్రపంచీకరణ వరద!
యప్పుడు ఊళ్లు,
వరద నీటికి కరిగిపోయన మట్టిరంగు బొమ్మలు!!

- సిరికి స్వామినాయుడు, 94940 10330