S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకృతి కవ్విస్తోంది

ప్రకృతిని సందర్శిస్తూ ఉంటే మనసు పరవశిస్తోంది
రంగురంగుల సీతాకోకచిలుకలా
పూవుపూవునా వాలి అందాన్ని చూడాలని వుంది
ఆకాశంలో ఎగురుతూ పండు పండునా వాలుతూ
రామచిలకలా దోరపళ్ళ రుచులు చూడాలని వుంది
కొమ్మకొమ్మకి ఎగబాకుతూ ఎగురుతూ
కుచ్చుతోక ఆడిస్తూ ముచ్చటైన మూడు గీతలతో
ముద్దుగొలిపే రామానుగ్రహం పొందిన ఉడుతలా
కొమ్మకొమ్మకి ఎగిరి పళ్ళు కాయలు రుచి చూడాలని వుంది
ఎన్నో రకాల పువ్వుల్లా అరవిరిసి వాసనలు వెదజల్లాలని వుంది
లేత ఆకుపచ్చ రంగులో గాలి తాకిడికి
రెపరెపలాడుతూ అల్లల్లాడే లేత ఆకుల్లా వెలగాలని వుంది
పండ్లతో నిండుగా వుండి అందరికీ నీడనిచ్చే
పచ్చని నిండైన చెట్టులా నిలవాలని వుంది
అందరికీ దాహార్తిని తీరుస్తూ కొండకోనల్లో
జలజలపారే సెలయేరుల్లా పరవశిస్తూ పారాలని వుంది
ఉత్సాహంతో గంతులేసే లేగదూడలా గెంతాలని వుంది
ఇదీ అదీ అని వేరువేరుగా చెప్పేదేముంది?
ప్రకృతిలో అణువణువులో చేరి పరవశించాలని ఉంది

- ఆర్.ఎస్.హైమవతి, 9444945942