తెరచాటు అందం
Published Saturday, 28 January 2017అందాన్ని కాపాడుకోవడం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. చూడచక్కని మోము చిన్నబోకుండా చూసుకోవడంకన్నా ముఖ్యమైన పని వారికి ఇంకోటి ఉండదు. బిజీబిజీగా ఉండే చైనా రాజధాని బీజింగ్‌లో మహిళల మనసూ అంతే. చల్లటి మంచు తుంపరల మధ్య రోజువారీ పనులు మానుకోవడం సాధ్యంకాని పని. బయటకు వెళితే మంచుతునకలు తగిలి ముఖవర్ఛస్సు పాడైపోతుంది. అందుకే ఓ కొత్త తరహా వస్త్రంతో తయారు చేసిన స్కార్ఫ్ ధరించి ఈ అమ్మడు రయ్‌మంటూ బైక్‌పై చెక్కేస్తోంది. మంచునుంచి రక్షణ, ఎదర ఏముందో కన్పించే రీతిలో ఈ స్కార్ఫ్స్ తయారు చేస్తున్నారు. ఆ అమ్మడిలాగే ఆ ముఖవస్త్రాలూ ముచ్చటగానే ఉన్నాయికదూ!