S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కర్తవ్యోపదేశం

చిత్ర విచిత్ర దృశ్యాలు
తడియారని తన్మయత్వపు అనుభూతులు
తలెత్తి పైకి చూస్తే అన్నీ
నింగి ముంగిట వాలిన అగణిత దృశ్యకావ్యాలు
దిక్కుల దిగంతాల వరకు ఆరబోసిన
చుక్కల చూపులన్నీ
చల్లదనాన్ని వెదజల్లే
చంద్రుని కౌగిటలో ఒదగాలనే
చీకటినే కాటుకగా ధరించిన రాతిరి మడుగు
అనేకానేక గ్రహ సుమాలకు నెలవు
కమనీయ ప్రకృతి, రమణీయ ఆకృతి
హృదయాన్ని కదిలించే భావం
అణువణువునా నిండిన జవం
దృశ్యాదృశ్య భావ భంగిమలతో విరబూసిన
సప్తవర్ణాల సింగిడి
కష్టసుఖాలు కలగలిసిన జీవితానికి మచ్చుతునక
పాలపుంతల పయనాలు
అమావాస్య పౌర్ణమిల
శుభాశుభ సంకేతాలు
భూమాతను ముద్దాడాలనే మేఘదూతలు
హర్షించి పులకించే వర్షధారలు
తడిసి పరవశించే సమస్త ధరాతలం
ఋతువుల గతులు, కాలవ్యవధులు... ఇవన్నీ
ఎప్పటికప్పుడు ప్రాణికోటికి
ప్రబోధించే ‘కర్తవ్యోపదేశం’ వంటివే
జీవన గమనమంటే
నింగివాకిట విప్పారిన ఈ భావాకృతుల విధమే
కాలగతిలో చేయ కలిపి, మేలు ప్రగతి కోరి
నడిస్తేనే జీవితం సుగమం - లేదంటే అగమ్యం

- సుప్పని సత్యనారాయణ, 9492626910