S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎవర్‌గ్రీన్ విలన్

‘అమృతవర్షిణి’ శీర్షికని ఏ విధంగా వర్ణించాలో తెలీటంలేదు. అలనాటి సంగీతామృతాన్ని మళ్లీ మా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. మా చిన్నతనంలో ‘కృష్ణలీల’లో కంసుడు, ‘కనకతార’లో విలన్, ‘సతీ సావిత్రి’లో యముడుగా స్టేజీ నాటకాలలో వేమూరి గగ్గయ్యగారు ఏకైక విలన్. ‘్ధక్కారమును సైతునా’ అన్న పాట ‘పో బాల పొమ్మికన్’ అనిన పాట ఆయన నోటే వినాలి. ఆయన గంభీర రూపం, మైక్‌లు లేకున్నా అదిరిపోయే గళం ఆయనదే. (గగ్గయ్యగారి వారసులే వేమూరి రామయ్యగారు) దొమ్మేటి సత్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు, నిడుముక్కల సుబ్బారావు ప్రభృతులను ఈ శీర్షిక గుర్తు చేసింది. వారు అందరూ ఎన్నటికీ వాడని, నిత్య సుగంధ బంధుర నవ పారిజాతములే. మల్లాది సూరిబాబు గార్కి నమస్సులు.
-శ్రీమతి సుజాత నాగరాజరావు (చెన్నై)
పథకం
మల్లాది సస్పెన్స్‌తో కథ అల్లడం, ఆ కథకు ఆసక్తికరంగా మాటలు సృష్టించడం, పాత్రలకు కొత్త పేర్లు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఆదివారం అనుబంధంలో ప్రచురితమవుతున్న ఆంగ్ల కథలకు అనువాదం చేస్తూ పాఠకులను థ్రిల్లర్ లోకంలో విహరించేలా చేస్తున్నారు. అపరాధన పరిశోధన కథలు చదువుతున్నట్టుగా ఉంది. అలాగే - తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దత్తత తీసుకున్న ఇబ్రహీంపూర్, ద్వారపూడి గ్రామాల గురించిన కథనం బాగుంది. ఈ స్ఫూర్తితో మరిన్ని గ్రామాలను ప్రముఖులు ఎవరైనా దత్తత తీసుకుంటే గ్రామాల అభివృద్ధికి దోహదం చేసినట్టవుతుంది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
ఫేస్‌బుక్
ఫేస్‌బుక్ స్నేహాల్ని ఉదహరిస్తూ ‘ఏదీ పరమ సత్యం కాదు. ఎవరూ పరమ జ్ఞాని కాదు. అభిప్రాయ భేదాలున్నప్పుడు స్నేహితుల్ని వదులుకోక వారిని గౌరవించాలి’ అన్న సండే గీత నేటి తక్షణావసరం. పొట్టి శ్రీరాములా? ఎవరాయన? ఏ పార్టీ? అని మన నేతాశ్రీలు అడగొచ్చునన్న మీ జవాబు బ్రహ్మాండంగాపేలింది. అక్షరాలోచనల్లో ‘వానపాములు మిన్న?’ కవిత అద్భుతంగా ఉంది.
-పి.శాండిల్య (కాకినాడ)
డిజిటల్
మన దేశంలో నిరక్షరాస్యులు, గ్రామీణులు అత్యధికం. కాబట్టి నగదు రహితం కుదరదన్న విమర్శల మధ్య తెలంగాణలోని ఇబ్రహీంపూర్, విజయనగరం జిల్లాలోని ద్వారపూడి డిజిటల్ దిశగా అడుగులేసి నగదు రహిత తొలి గ్రామాలవడం శుభసూచకం. తన ఇంటిని తగలబెట్టే పనిని ఒకనికి అప్పగించి, ఆ ఇంటిలో అతడు బందీ అయేట్టు చేసి తను రగిల్చిన మంటల్లోనే కాలి చనిపోయేట్టు చేసి అతడు పగ తీర్చుకున్న క్రైం కథ ‘పథకం’ ఆద్యంత సస్పెన్స్‌తో బాగుంది. ప్రకృతి నియమాలు జీవిత ధర్మాల్ని సృష్టించిన దైవం అయినా వాటిని అధిగమించలేడని చెప్పిన కథాసాగరం కథ బహు బాగు.
-డి.అభిలాష (సాంబమూర్తి నగర్, తూ.గో. జిల్లా)
చిరునవ్వు
‘ఓ చిన్న మాట’ శీర్షికన అందిస్తున్న ఆర్టికల్స్ బాగుంటున్నాయి. ‘చిరునవ్వు’ సమస్యలను తొలగించకపోయినా కొంత ఉపశమనాన్ని కలిగిస్తుందని చిరునవ్వును గూర్చి చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. ‘కవర్‌స్టోరీ’ వీరిదే రి‘కార్డు’ అంటూ తెలంగాణలో ఇబ్రహీంపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారపూడి మరొకటి అంటూ అక్షరాస్యత అంతగా లేకున్నా నగదు రహిత విధానాన్ని అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలిచాయి అంటూ చక్కగా తెలియజేశారు. ఆయా గ్రామ ప్రజలకు, నాయకులకు నా శుభాకాంక్షలు. అలాగే మరిన్ని గ్రామాలు మారాలి. అలాగే ‘నాటి వైభవానికి ఆనవాలు దోమకొండ గడికోట’ గురించిన విశేషాలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
లోకాభిరామమ్
ఈ వారం ‘లోకాభిరామమ్’ మెదడుకి మేత పెట్టింది. కోతులు మన తాతలు కాదన్న సత్యాన్ని తెలిపింది. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రాతల గురించి చెప్పారు. బాగుంది. రామాయణ, భారతాల నుంచి ఎవరి నమ్మకాలు, సిద్ధాంతాలను బట్టి విశే్లషణలు చేసి రాసేస్తారు వారు. పాఠకులు కూడా తమ నమ్మకాల్నిబట్టి వాటిలో కొన్నింటిని స్వీకరించి మిగిలిన వాటిని తిరస్కరిస్తారు. నమ్మకాల వైరుధ్యాల మధ్య అసలు నిజాలు మరుగున పడిపోతాయి. ఎవరి సిద్ధాంతానికి వారు వేలాడుతూ ఉంటారు. ఇక- దోమకొండ గడికోట వైభవాలు, సాహిత్య సేవల గురించిన కథనం అలరించింది.
-ఆర్.శాంతిసమీర (వాకలపూడి)
కానుక
చిరునవ్వు ఎదుటి వారికి మనమిచ్చే కానుక మాత్రమే కాదు మనకు మనం కానుకగా ఇచ్చుకునేది. అది సమస్యల్ని తీర్చకపోయినా ఉపశమనం కలిగిస్తుందన్న ‘ఓ చిన్న మాట’ మాకు ఉపశమనం కలిగించి పెదవులపై నవ్వులు పూయించింది. నోట్ల రద్దు లేకుండా నల్ల కుబేరులపై దాడులు జరిపిస్తే బాగుండేదన్న అభిప్రాయం అర్థసత్యమే. ఉగ్రవాదులు పోగేసిన డబ్బు, నక్సలైట్ల డంప్‌లలోని డబ్బు ఎలా బయటికొస్తుంది? ప్రవాహంలా పాక్ నించి వస్తున్న నకిలీలను అడ్డుకోవడం ఎలా? ఆర్థిక శాఖ రోజుకో రూల్ పెట్టడానికి కారణాలు ఎప్పటికప్పుడు రూల్స్‌ని పక్కదారి పట్టించే నల్లకుబేరుల నక్కజితులు.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)