S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రక్షకుడు

ఇరవై శతాబ్దపు తొలి రోజుల్లో జాగ్రఫీ పరిశోధకుడు డాక్టర్ హేన్స్ మరో తొమ్మిది మందితో కలిసి సహారా ఎడారిని పరిశోధించడానికి వెళ్లాడు. వారంతా స్థానిక గైడ్ సహాయంతో ఎడారిలోకి పది రోజులు ప్రయాణించారు. అది ఇసుక తుఫాను సీజన్. పదకొండో రోజు మధ్యాహ్నం వైర్ లెస్‌లో పశ్చిమ దిశలో పెను ఇసుక తుఫాను ఆరంభమైందని, అది తమ వైపే వస్తోందని సమాచారం అందుకున్నారు. ఆ బృందంలోని డాక్టర్ ఏండర్సన్ తామ దాని దారిలో ఉంటే మరణం తప్పదని, మరో దిక్కుకి వెళ్లిపోదామని సూచించాడు. కాని డాక్టర్ హేన్స్ గాలి దిశ ఎటు మారుతుందో తెలీదని, అక్కడే ఉండటం మంచిదని దాన్ని తిరస్కరించాడు. పది మంది బృందంలోని ఏడుగురు వెనక్కి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నారు. డాక్టర్ హేన్స్‌కి మద్దతు ఇచ్చే ఇద్దరు, ఓ ఒంటె, స్థానిక గైడ్ హనీఫ్ మాత్రమే అక్కడ మిగిలారు.
మర్నాడు సాయంత్రం స్థానిక గైడ్ ఒంటెని ఎక్కి పారిపోవడం గమనించిన బృందంలోని ఒకరు అతన్ని ఆగమని అరిచినా వినకపోవడంతో తుపాకీతో కాల్చాడు. హనీఫ్ ఒంటె మీంచి కింద పడ్డాడు. అతను దొంగిలించిన రెండు తోలు నీటి సంచీల్లోని ఓ దానికి గుండు తాకడంతో అందులోని నీళ్లన్నీ ఇసుకలోకి కారిపోయాయి.
డాక్టర్ హేన్స్ ఆ గొడవకి అక్కడికి పరిగెత్తి కెళ్లి చూసి జరిగింది గ్రహించాడు. హనీఫ్ మరణించాడు. కేవలం అతన్ని భయపెట్టడానికే కాల్చానని, గుండు అతన్ని తాకుతుందని తను అనుకోలేదని కాల్చిన వ్యక్తి చెప్పాడు. ఈ హడావిడికి ఒంటె పారిపోయింది. కాలి నడకన దాన్ని వెదికి చీకటి పడేలోగా పట్టుకోవడం కష్టం. కాని మర్నాటికల్లా ఇసుక తుఫాను దాని కాలి ముద్రలన్నీ తుడిచేస్తుంది. తమ దగ్గరున్న నీరు ముప్పై ఆరు గంటలు మించి సరిపోదని గ్రహించిన హేన్స్ నీటికి రేషన్‌ని విధించాడు.
మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి ఎటు చూసినా ఇసుక తుఫాను. కాబట్టి ఎవరూ బయటకి వెళ్లలేదు. ఆకాశం నిండా ఇసుక అలముకుని, సూర్యరశ్మికి అది గొడుగులా ఏర్పడి, వేడి లేకపోవడంతో వారికి దాహం పెద్దగా వేయలేదు. ఆ రాత్రి తుఫాను తగ్గినా వారు గుడారంలోనే గడిపారు.
మర్నాడు ఉదయం వారు బయటకి వస్తే చుట్టూ ఎతె్తైన ఇసుక మేటలు కనిపించాయి. రాత్రుళ్లు ఎండ ఉండదు కాబట్టి చెమట పట్టి దాహం వేయదని, సముద్రం వైపు నడిచి వెళ్దామన్న డాక్టర్ హేన్స్ మిగిలిన ఇద్దరూ అంగీకరించడంతో పశ్చిమం వైపు బయలుదేరారు. రెండు రోజుల పాటు వారు రాత్రుళ్లు మాత్రమే నడిచి పగలు కేన్వాస్ గుడారంలో నిద్రపోయారు. అలా వారు సుమారు ఇరవై ఐదు మైళ్లు నడిచి ఉంటారు. సముద్రం ఇంకా ముప్పై ఐదు మైళ్ల దూరంలో ఉండచ్చు అని డాక్టర్ హేన్స్ అంచనా వేశాడు.
కాని అక్కడికి చేరుకునే దాకా నీరు ఉండదు. మర్నాటి మొత్తం నీరు ఖర్చై పోతుంది. వారిలో క్రమంగా అలసట పెరిగి శక్తి తరగసాగింది. ఆ రాత్రి డాక్టర్ హేన్స్ తాము కనుగొన్నదంతా ఓ కాగితం మీద రాసి ఖాళీ సీసాలో ఉంచి పైన లక్క సీల్‌ని వేసి ఎడారిలో ఓ చోట ఉంచాడు. భవిష్యత్‌లో అది ఎవరి కంటైనా పడచ్చని ఆశించాడు.
మర్నాడు ఉదయం డాక్టర్ హేన్స్‌కి మెలకువ వచ్చి గుడారంలోంచి బయటకి రాగానే దూరం నించి ఒళ్లంతా ఎండ వేడికైన గాయాలతో తూలుతూ నడిచి వచ్చే ఓ యువకుడు కనిపించాడు. అతన్ని గుడారంలోకి తీసుకెళ్లి ఎండకి కమిలిన చర్మానికి మందుని రాశాడు. తమ దగ్గర మిగిలిన నీటిని తాగించాడు. తేరుకున్నాక అతను తన పేరు ఎరిక్ అని, సహారా ఎడారి తనకి క్షుణ్ణంగా తెలుసని, పశ్చిమం వైపు వెళ్లడం తప్పని, దక్షిణం వైపు పధ్నాలుగు మైళ్ల దూరంలో ఓ ఒయాసిస్ ఉందని చెప్పాడు. అంతా అతని వెంట నడిచారు.
అతను ఇసుక మేటలని ఎక్కి దిగుతూ దగ్గర దారిలో వారిని నడిపించాడు. చివరకి వారు ఓ బావి దగ్గరికి చేరుకున్నారు. దాన్నిండా ఇసుక. దాని పేరు లేక్ ఆఫ్ కామర్స్ అని, మూడు వేల సంవత్సరాలుగా ఎడారిని దాటే వ్యాపారులు, వారి జంతువులు అక్కడ సేద తీరేవారని చెప్పాడు. ఐతే ఈ బావి ఇరవై ఏళ్ల క్రితం మూసుకుపోయిందని చెప్పి ముందుకి తీసుకువెళ్లాడు.
ఎనిమిది మైళ్ల దూరం ప్రయాణించాక ఎరిక్ నీరసించి కదల్లేకపోయాడు. అతన్ని మూడు మైళ్లు మోసుకు వెళ్లాక అలసిన అంతా కొద్దిసేపు ఓ ఇసుక మేట నీడలో ఆగారు. తను జీవించి లేకపోతే తన గురించి తన తండ్రికి చెప్పమని ఎరిక్ ఆ వివరాలు డాక్టర్ హేన్స్‌కి చెప్పాడు. అందరికీ నిద్ర పట్టింది. సూర్యాస్తమయ సమయంలో డాక్టర్ హేన్స్ లేచి చూస్తే ఎరిక్ అదృశ్యం అయ్యాడు. పక్కనే ఇసుక మీద ఎరిక్ గీసిన ఒయాసిస్‌కి వెళ్లే దారి కనిపించింది.
చీకటి పడ్డాక వారు అక్కడికి చేరుకుని ఒయాసిస్‌లోని నీళ్లు తాగుతూ, చెట్ల నించి ఖర్జూరపు పళ్లని కోసుకుని తింటూ మూడు రోజులు అక్కడే గడిపారు. ఆహారం, నీళ్లు ఉన్న ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్తే మరణం తప్పదని వాళ్లకి తెలుసు. చివరికి ఎడారి తండా సహాయంతో వాళ్లు తిరిగి ఈజిప్ట్ చేరుకున్నారు.
తర్వాత డాక్టర్ హేన్స్ జర్మనీలోని హేంబర్గ్‌కి వెళ్లడం సంభవించింది. ఓ సాయంత్రం అక్కడి జాగ్రఫీ టీచర్ బాల్డ్‌విన్‌ని కలిశాడు. ఆయన ప్రఖ్యాత జాగ్రఫీ పరిశోధకుడు అని తెలిసిన బాల్డ్‌విన్‌కి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. తన కొడుకు ఎరిక్‌కి డాక్టర్ హేన్స్ అంటే ఇష్టం అని, అతను అక్కడ ఉండి ఉంటే సంతోషించేవాడని బాల్డ్‌విన్ భార్య చెప్పింది.
ఎరిక్ తమకి ఎడారిలో చేసిన సహాయం గురించి, అదృశ్యం అవడం తండ్రి చిరునామాని చెప్పి, ఆయన్ని కలవమని చెప్పడం గురించి డాక్టర్ హేన్స్ వివరించాడు. ఎరిక్ ఇంటికి తిరిగి వచ్చి ఉంటాడని ఆశించిన డాక్టర్ హేన్స్‌కి వింతైన సమాచారం తెలిసింది.
ఎరిక్‌కి చిన్నప్పటి నించీ భౌగోళిక పరిశోధన అంటే ఇష్టం అని అతని గదిలోని వాటికి సంబంధించిన పుస్తకాలని చూపించి బాల్డ్‌విన్ చెప్పాడు. ఆ గదిలోని తన ఫొటోని చూసి డాక్టర్ హేన్స్ ఆశ్చర్యపోయాడు. ఐతే ఎరిక్‌కి ఎనిమిదో ఏట వెనె్నముకలో వచ్చిన ఇన్‌ఫెక్షన్ వల్ల పక్షవాతం వచ్చి మంచం మీదే గడిపాడు. భౌగోళిక పరిశోధన అంటే ఇష్టం కాబట్టి ఆ రకం పుస్తకాలని విరివిగా చదివేవాడు. తను ఆ ప్రదేశాలకి వెళ్లాలనే గాఢమైన కోరిక ఉండేది. ఇరవై రెండో ఏట 9, సెప్టెంబర్ 1910న ఎరిక్ మరణించాడు! అక్టోబర్ 1932లో, అంటే ఎరిక్ మరణించిన ఇరవై రెండేళ్ల తర్వాత ప్రమాదంలో పడ్డ డాక్టర్ హేన్స్‌కి ఎడారిలో సహాయం చేశాడు! ఎరిక్ తండ్రి చూపించిన అనేక ఫోటోల్లోని ఎరిక్ ఫొటోని డాక్టర్ హేన్స్ గుర్తుపట్టాడు! జీవించి ఉండగా మంచం దిగని ఎరిక్ తన మరణానంతరం తను ఆరాధించే డాక్టర్ హేన్స్‌ని ఆపద నించి ఎలా రక్షించగలిగాడు? అది దేవుడికే తెలియాలి. ఎరిక్ చేసిన సహాయం గురించి డాక్టర్ హేన్స్ రాసిన వ్యాసం ఓ జాగ్రఫీ పత్రికలో ముద్రించబడింది.

- పద్మజ