S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త పంథాలో...!

ఓవైపు పక్కా కమర్షియల్.. కానె్సప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు.. మరో వైపు వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని ఏర్పరచుకుంటోంది అందాలతార నయనతార. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కెరీర్‌ని కాపాడుకుంటూ విభిన్నమైన చిత్రాలను, అంతకంటే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో దాస్ దర్శకత్వంలో ఏక కాలంలో రూపొందుతున్న ‘డోర’ అనే చిత్రంలో వైవిధ్యమైన పాత్రను పొషిస్తోంది. హారర్, సస్పెన్స్‌తో కూడిని ఈ చిత్రంలో నయనతార పాత్ర అందర్నీ కదిలిస్తుందనీ.. ఆలోచింపజేస్తుందనీ దర్శకుడు చెబుతున్నారు. నయన పాత్ర చిత్రణ ఓ కొత్త పంథాలో వుంటూ ఉత్కంఠను రేకెత్తిస్తుందట. ఇలాంటి పాత్రలను పోషించడంలో నయనతారను మించి మరొకరు వుండరనీ చిత్రం యూనిట్ అంటోంది. ఈ విషయం గురించి నయనను కదిలిస్తే- ‘‘కొన్ని చిత్రాలు.. కొన్ని పాత్రలు కోరుకుంటే వచ్చేవి కావు. అలాంటి వాటిలో నటించాలంటే మనకు ప్రతిభకే కాదు, అదృష్టమూ తోడవ్వాలి. నేను చేస్తున్న చిత్రాలు.. పోషిస్తున్న పాత్రలు నా కెరీర్‌ను మంచి స్థాయిలో నిలబెడుతున్నాయి. ఇలాంటి పాత్రల విషయంలో ఇక ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ప్రస్తుతం చేస్తున్న ‘డోర’లోని నా పాత్ర హృదయాన్ని కదిలించేదే. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’అని చెప్పుకొచ్చింది నయనతార.

-సమీర్