S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? ( ఫిబ్రవరి 5 నుండి 11 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ, వ్యాపార, విద్య, వృత్తి రంగాల వారు అనుకోని లబ్ధిని పొందుతారు. ప్రయాణాదులందు అప్రమత్తత అవసరం. ఆసరాగా చేసుకుని కొంతమంది మీ వెంట పడతారు. పరిశీలన మంచిది. ప్రయత్నంపై కొన్ని కార్యాలు నెరవేర్చుకుంటారు. స్పెక్యులేషన్ అనుకూలం. ఆత్మస్థైర్యంతో ఉత్సాహాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఖర్చుని నియంత్రించుకోండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
పెళ్లికాని వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు కావలసిన వారికి, మార్పు కోరేవారికి అనుకూలం. ఈ వారంలో విశేషాలు వింటారు. విద్యార్థులకు శ్రమానుకూలంగా ఫలాలు అందుతాయి. వృత్తులు నిలకడ, నిబద్ధతతో ఫలవంతమవుతాయి. బంధుమిత్రులు సమయానికి ఆదుకుంటారు. ఆస్తి విలువలు వృద్ధి బాటను పడతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. స్ర్తిలకు ఫలవంతమైన సమయం. ఆభరణాలతో అప్రమత్తంగా ఉండండి. ప్రయాణాదులందు మెళకువ పాటించండి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆర్థిక రంగం ఆలోచింపజేస్తుంది. నిరుద్యోగులకు ఫలప్రదమైన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ఇష్టపడి శ్రమిస్తేనే అనుకున్నవి అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్య, వ్యాపార, వైద్య, కళ, స్టేషనరీ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి వృద్ధి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది. అనుకోని శుభ వర్తమానాలందుకుంటారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

స్వీయ పర్యవేక్షణతో అనుకున్నవి సాధిస్తారు. బంధుమిత్రులు సమయానికి సాయపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఊపందుకుంటాయి. తడబాటు, మతిమరుపు లేకుండా మెలగండి. కళ, సాహిత్య, వైద్య రంగాలందు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. స్పెక్యులేషన్ ఫలప్రదం. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు గతం కంటె తృప్తికరం. పరిచయాలు ప్రయోజనకారిగా ఉంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

బుద్ధిబలంతో అనుకున్నవి సాధిస్తారు. దూరపు బంధువుల వస్తారు. మీకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఎదుటి వారిని తేలికగా నమ్మకండి. తక్కువ అంచనా వేయకండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విదేశీ ప్రయత్నాలు ఫలవంతం. విద్యారంగంలో అనుకోని మార్పులుంటాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వైద్య, ఐటి, దైనందిన వ్యాపారాలు తృప్తినిస్తాయి. మిత్రులతో కలసి కార్యాలు పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ మిశ్రమం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఆరోగ్యం జాగ్రత్త. అన్నింటా అప్రమత్తత అవశ్యం. బంధుమిత్రుల సాయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలందు మెళకువ అవసరం. విద్య, వైద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు అనుకున్నవి సాధిస్తారు. దంపతులు ఫలవంతమైన కార్యాలు చేస్తారు. శుభకార్యాలు కలసి వస్తాయి. ఎక్కువ ధనంతో ప్రయాణాలు చేయడం మంచిది కాదు. వాహన ప్రమాదాలు లేకుండా జాగ్రత్త పడాలి. స్పెక్యులేషన్ ఫలప్రదం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

కుటుంబంలో శుభములు జరుగుతాయి. బంధుమిత్రుల విషయంలో మీరు మార్గదర్శకత్వం వహిస్తారు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, విదేశీ, వాణిజ్య రంగాల వారికి మెరుగైన ఫలాలందుతాయి. దంపతులు నిబద్ధతతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉంటాయి. స్పెక్యులేషన్ ఫలప్రదం. మీ మాట తీరులో మంచి మార్పులు ఏర్పడుతాయి. అన్నింటా పర్యవేక్షణ మంచిది. విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్త వహించండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అనుకూల వాతావరణంలో కార్యాలు పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకు గతం కంటె మెరుగైనదిగా ఉంటుంది. శ్రమ ఉన్నా ఫలితాలు అందుకు అనుగుణంగా ఉంటాయి. ప్రయోజనాలుంటాయి. కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ మాటలకు, చేతలకు గుర్తింపు లభిస్తుంది. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. స్ర్తిలు అనుకున్నవి నెరవేర్చుకుంటారు. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ మెరుగవనుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆదాయ వ్యయాలు సరిచూసుకోవాలి. అనుగుణంగా ఖర్చును నియంత్రించుకోవాలి. వైవిధ్యమైన పనులు పూర్తి చేస్తారు. అప్పు చేయాల్సి రావచ్చు. ఇతరుల విషయాలందు ఆసక్తి వద్దు. మీ వ్యవహారాదులు సరిచూసుకోవటం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైద్య, విద్య రంగాలు ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి. స్పెక్యులేషన్ అనుకూలం. ప్రయాణాదులందు జాగ్రత్త అవశ్యం. శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. సమయానికి పైకం సర్దుబాటవుతుంది. మానసిక అధైర్యానికి అవకాశమివ్వకండి. శుభకార్య యత్నాలు ఫలప్రదమవుతాయి. వస్త్ర, క్రయ, విక్రయాల్లో ఖర్చును నియంత్రించుకోవాలి. ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాలు మెరుగవుతాయి. బంధుమిత్రుల సహాయం ప్రయోజనకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

కొత్త పనులు వాయిదా వేయటం మేలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలందు స్వీయ పరిశీలన అవసరం. స్వశక్తికి ప్రాధాన్యత నివ్వండి. కొన్ని సమస్యలను పరిష్కరించుకొంటారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ప్రయాణాదులందు మెళకువ అవసరం. వాహన ప్రయాణీకులు వేగాన్ని నియంత్రించుకోవటం మంచిది. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాల నిస్తుంది. లౌక్యం అన్నింటా మేలు. విద్యార్థులు శ్రమపై అనుకూల ఫలితాలందుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న పనులు అనుకున్నట్లు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. ఇతరులకు పైకం ఇచ్చేటప్పుడు మెళకువ పాటించండి. జామీలుండవద్దు. కోపతాపాలొద్దు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు స్వీయ పర్యవేక్షణ అవసరం. ఇతరులను తక్కువగా అంచనా వేయకండి. దంపతులు సంయమనం పాటించాలి. స్పెక్యులేషన్ మిశ్రమం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855