S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భవిష్యవాణి

మెరీ ఇంట్లో ఆమె ఎంగేజ్‌మెంట్ పార్టీ జరుగుతోంది. తన మిత్రురాలు హెలెన్ సంవత్సరం నించి హిప్నాటిక్ నిద్రలోకి వెళ్లి జరగబోయేది చెప్తోందని, తన కాబోయే భర్త గురించి ముందే చెప్పిందని, తన సైకిల్ చక్రం పంక్చరవడం వల్ల అతనితో పరిచయం అవుతుందని చెప్పిందని, అది నిజమైందని మేరీ తన అతిథులతో చెప్పింది. వెంటనే వారంతా తమ భవిష్యత్ తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు. కాని తనకి ఆ మూడ్ లేదని హెలెన్ తిరస్కరించింది.
అతిథుల్లోని డగ్లస్ మాత్రం దాన్ని కొట్టి పారేస్తూ ఇలాంటి విద్య వల్ల ఉచిత కాక్‌టెయిల్ పార్టీలు లభిస్తాయని, ఓసారి చికాగోలో ఇలాంటి ఒకామె తను ఇల్లినోయ్ గవర్నర్ అవుతాడని చెప్పిందని ఎగతాళిగా చెప్పాడు. చికాగో నించి వచ్చిన డగ్లస్ ఆ రాత్రే విమానంలో వెళ్లిపోతున్నాడని, అతని అనుమానాన్ని పోగొట్టమని హెలెన్ భర్త ఛార్లీ తన భార్యని ప్రోత్సహించాడు.
అతని గురించి హెలెన్‌కి ఏమీ తెలీదు. వారు కలవడం అదే మొదటిసారి. ఆమె ముందు అంగీకరించక పోయినా అకస్మాత్తుగా సరే అన్నది. ఛార్లీ ఆమెని హిప్నాటిక్ నిద్రలోకి పంపించాక ఆమె నెమ్మదిగా ఏదో దృశ్యం చూస్తున్నట్లుగా ‘తాళం చెవులు.. తాళం చెవులు... అవీ మీవి కావు లెండి’ అని చెప్పింది. తర్వాత రైల్వేస్టేషన్‌లోని అనేకమంది ప్రయాణీకుల మధ్య డగ్లస్ ఒకడని, అతను 102 కంపార్ట్‌మెంట్‌లోని బి కేబిన్‌లోకి ఎక్కాడని, బూడిద రంగు దుస్తుల్లోని ఓ అమ్మాయి వేలికి మెరిసే పాము తల ఉంగరం కనిపిస్తోందని, డగ్లస్ ఆమె నించి భయపడి పరిగెత్తుతున్నాడని, ఆమె చేతిలో కత్తి కనిపించిందని చెప్పి, అకస్మాత్తుగా భయంగా ‘అంతా చీకటి.. చీకటి’ అని ఏదో భయంకరమైంది చూస్తున్నట్లుగా భయపడుతూ గట్టిగా అరవసాగింది. ఛార్లీ వెంటనే ఆమెని స్పృహలోకి రప్పించాడు.
తను విమానంలో వెళ్తున్నాడన్న సంగతి హెలెన్ వినలేదని డగ్లస్ తన మిత్రుడైన మేరీ కాబోయే భర్తతో ఎగతాళిగా చెప్పాడు. తనేం చెప్పిందని హెలెన్ డగ్లస్‌ని అడిగితే, ‘తను నూట ఏభై ఏళ్లు జీవిస్తాడని, మిస్ యూనివర్స్‌ని పెళ్లి చేసుకుంటాడని, ప్రపంచ కుబేరుడు అవుతాడని’ చెప్పిందని డగ్లస్ హాస్యంగా చెప్పాడు.
కాని డగ్గస్ వెళ్లాల్సిన విమానం న్యూయార్క్‌లోని మంచు తుఫాను వల్ల రద్దయింది. దాంతో అతను టేక్సీలో రైల్వేస్టేషన్‌కి బయలుదేరాడు. అతను టేక్సీ దిగాక డ్రైవర్ అలవాటుగా సీట్లని చెక్ చేసి, వెనక సీట్లోని తాళం చెవుల గుత్తిని చూసి, డగ్గస్‌ని పిలిచి వాటిని ఇవ్వబోతే అతనికి ‘తాళం చెవులు.. అవి నీవి కావు’ అని హెలెన్ ఇందాక చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవి అతనివి కావు.
టి.సి. అతని టిక్కెట్‌ని చూసి 102 కంపార్ట్‌మెంట్, బి కేబిన్ అని దాని మీద రాసిచ్చాడు. అతనికి మళ్లీ హెలెన్ ఇందాక చెప్పింది గుర్తొచ్చి, వేరే చోట ఇవ్వగలరా అని అడిగితే, 271సి ఖాళీగా ఉందని అందులో కూర్చోవచ్చని చెప్పాడు. తీరా కొద్దిసేపటికి టిసి నల్లరంగు దుస్తుల్లోని ఓ మహిళా ప్రయాణీకురాలితో వచ్చి, రైల్వే ఉద్యోగి చేసిన తప్పు వల్ల అది ఖాళీగా ఉందని తను చెప్పానని, అది ఆ మహిళ కొన్ని వారాల క్రితం రిజర్వ్ చేసుకున్న సీట్ అని, డగ్లస్‌ని ఇంకో చోట కూర్చోపెడతానని చెప్పాడు. ఏ కంపార్ట్‌మెంట్, ఏ కేబిన్ అని అడిగితే ‘102 బి’ అని టిసి చెప్పాడు. ఆమెనే అక్కడికి తీసుకెళ్లమని డగ్లస్ కోరితే, ఈ కంపార్ట్‌మెంట్ చికాగోకి వెళ్లకుండా దారిలో రైలు నించి విడదీయబడుతుందని, అతను 102 బికే వెళ్లాలని చెప్పాడు.
పేంట్రీ కంపార్ట్‌మెంట్‌లో ఆమె డగ్లస్‌కి మళ్లీ తారసపడింది. ఈసారి ఆమె వొంటి మీద బూడిద రంగు డ్రెస్‌ని చూడగానే హెలెన్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అంత దాకా ఆమె చెప్పిందంతా నిజం అవడంతో అతను ఆందోళన పడ్డాడు. హెలెన్ చెప్పినట్లుగానే ఆమె అందంగా ఉంది.
ఆమెకి హెలెన్ రిచర్డ్‌సన్ తెలుసా అని అడిగితే ఆ పేరే తను ఎన్నడూ వినలేదని చెప్పింది. ఆమె ఎడమ చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని చూసి డగ్లస్ నివ్వెరపోయాడు. అది పాము తల గల వెండి ఉంగరం. అతను భయపడి అక్కడ నించి వేగంగా వెళ్లిపోయాడు. అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన ఆమె అతన్ని అనుసరించింది. అతను 102బిలో కూర్చున్న కొద్దిసేపటికి బజర్ వినపడటంతో తలుపు తీస్తే, బూడిద రంగు డ్రెస్‌లోని ఆమె కనిపించడంతో అతను భయంగా వణికిపోతూ కారిడార్లో పరిగెత్తాడు. ‘మిస్టర్ డగ్లస్. ఏమిటి? ఎందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారు?’ తెలుసుకోవాలని అడుగుతూ ఆమె అతని వెంటే వెళ్లింది.
అతను కారిడార్లో చివరకి చేరుకున్నాడు. ఆ తర్వాత కంపార్ట్‌మెంట్స్ లేవు. అతను తన వైపు వస్తున్న ఆమె వంక చూస్తూ భయంగా చెయిన్ లాగాడు. వెంటనే అతనికి చీకట్లు అలుముకుని నేలకూలాడు.
* * *
అతనికి మళ్లీ స్పృహ రాగానే ఎదురుగా చేతితో కత్తితో ఆమె కనిపించింది.
‘మీకేం కాలేదు. కిందపడ్డప్పుడు మీ తల కొట్టుకుని మీకు స్పృహ తప్పింది. మీరు అదృష్టవంతులు. కేవలం చర్మం చిట్లింది తప్ప కపాలానికి ఏం కాలేదు. నేను ఫస్ట్‌క్లాస్ సర్జికల్ నర్స్‌ని.. మీరు ఎమర్జన్సీ చెయిన్‌ని ఎందుకు లాగారు? లేదా వందల మంది మరణించి ఉండేవారు. బహుశ మీకో మెడల్ ఇస్తారు. ఇదే పట్టాల మీద ఓ గూడ్సు బండి సిగ్నల్ ఫెయిల్ అవడంతో ఆగి ఉంది. మీరు చెయిన్ లాగడంతో కేవలం ఆరు గజాల దూరంలోనే దాని వెనకే మన రైలు ఆగింది. ఎవరికీ తెలీనిది, అక్కడ ఆ రైలు ఆగి ఉందని మీకు ఎలా తెలిసింది?’ ఆమె అడిగింది.
హెలెన్ రిచర్డ్‌సన్‌కి తెలుసని, అందుకే చివర్లో ఆమె భయపడిపోయి అరిచిందని డగ్లస్ తేలిగ్గా ఊహించగలిగాడు. కాని హెలెన్‌కి ఎలా తెలుసు అన్న దాని మీద అనేక థియరీలు ఉన్నాయి. క్లెయిర్‌వాయెన్స్, ప్రిమానిషన్, ఆనందకరమైన కాకతాళీయం.. నిజం దేవుడికే తెలియాలి.

- పద్మజ