S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కేరింత

వానకి వయసు మళ్లింది, ఓపిక తగ్గింది
ముసలి నసలా చినుకుల్ని రాలుస్తోంది

వాకిలి ముందు పారుతూ పిల్లకాలువలు
సిరలూ, ధమనుల్లా సాగిసాగి
క్రమంగా సనసన్నని నాళాలవుతున్నాయ

కాలువలో ముందు వేగంగా
అంతలో నిదానంగా - పడవలు,
కత్తి పడవలు
వాటి వేగానికి చోదకశక్తినివ్వాలని
ఒకటే కేరింతలు, త్రుళ్లింతలు, కవ్వింపులు -
పిల్లకాయలు!

కత్తి పడవ కాలికి అడ్డం పడి
పయనాన్ని అడ్డుకుంది - పుల్ల
ఎగురుతూ, చేయ సాచి, తీసి
తన ‘వస్తువు’ని తాను అందుకుంది పాప
ఇప్పుడది రూపం కోల్పోయన పడవ!

ఇటు చివికిన పుల్ల చిట్లి చెదిరింది
అటు తడిసిన కాగితం విచ్చిపోయంది
పుల్లని ఆవలికివిసిరేసి
కాగితాన్ని విప్పి చూస్తే - ‘కాలమ్’ కవిత!

‘కాలం ప్రవహిస్తూనే ఉంటుంది
కవిత ప్రసరిస్తూనే ఉంటుంది’

రేపటి గళం
అక్షరాల్ని కూడబలుక్కుంటోంది
అవి నిత్యసత్యాలు!!

- విహారి, 9848025600