S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ప్రెయరీ డాగ్స్’ కుక్కలు కావు!

ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడాల్లో మాత్రమే కనిపించే ‘ప్రెయరీ డాగ్స్’ నిజానికి కుక్కలు కావు. కనీసం అవి కుక్కల జాతికి చెందినవి కూడా కాదు. వాటి రూపురేఖలు కూడా కుక్కలతో పోలి ఉండవు. కేవలం పేరులో మాత్రమే ‘డాగ్’ అన్న పదం ఉంటుంది. నిజానికి ఇవి ‘ఉడత’ (గ్రౌండ్ స్క్విరల్) జాతికి చెందినవి. సమూహాలుగా జీవించే వీటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఆప్యాయంగా ఒకదానిని ఒకటి ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ప్రేమను, అభిమానాన్ని చాటుకోవడం వీటి ప్రత్యేక లక్షణం. అయితే ఇదంతా ఒక కుటుంబం అంటే ఒక కాలనీ సభ్యుల మధ్య మాత్రమే. ఇతర కుటుంబాలు, కాలనీల నుంచి వచ్చే వాటితో ఇవి దాదాపు యుద్ధమే చేస్తాయి. తరిమేస్తాయి. ప్రమాదం పొంచి ఉంటే ఒక ప్రత్యేకమైన, విభిన్నమైన అరుపుతో మిగతావాటిని అలర్ట్ చేస్తాయి. నేలలోపల బొరియల్లాంటి గుంతల్లో ఇవి నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అందులో టాయిలెట్, పిల్లల్ని సాకే నర్సింగ్ రూమ్, విశ్రాంతి తీసుకునే రెస్టింగ్ రూమ్ కచ్చితంగా ఉంటాయి. అయితే సాధారణంగా కొన్ని రకాల పాములు, ఇతర జంతువులు వీటి బొరియలను కబ్జా చేసేస్తూంటాయి. ఇవి ఆహారాన్ని తింటున్నప్పుడు కొన్ని రకాల పక్షులు లాక్కుని తినేసినా ఇవి ఊరుకుంటాయి.

- ఎస్.కె.కె. రవళి