S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాలో నేను

భవితవ్యం రెక్కలాడిస్తున్న
నా మనో విహంగము
ధర్మాకాశానికెగిరి
దిగంతాలను ముద్దాడనీ

శక్తియుక్తులు నింపుకున్న
నా కండరాల అండబలము
మతోన్మాదుల మదమణగించి
ప్రాయశ్చిత్తం పంచన ఉంచనీ

నేను ఆనాటి గంధర్వుడిలా
గగనములో గమించగలిగితే
దొంగస్వాముల కొంగ జపం
నేపథ్యాన్ని చీల్చిచెండాడనీ

నేను గడ్డపార దొడ్డమనసునైతే
ప్రజాస్వామ్యం కలల కాసారాన్ని
కొల్లగొడుతున్న కల్లవాదుల
వెన్ను పూసలో దిగబడనీ

అన్యాయాలను అంతం చేసే
తుపాకి తూటాల వర్షాన్నైతే
దేశ రక్షాదీక్ష యాజ్ఞికుల
రక్షణ వలయాన్ని సృష్టించనీ

- ఐతా చంద్రయ్య, 9391205299