S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పట్ట్భాషేకం

‘అమృతవర్షిణి’ శీర్షిక ద్వారా అలనాటి రంగస్థల వైభవాన్ని మళ్లీ కళ్ల ముందుకు తెస్తున్నారు. తెర వెనుక నటీనట బృందమంతా కలిసి నీరాజనమిస్తూ ‘పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ’ అంటూ సాగే బృందగానం ప్రేక్షక జన హృదయాలను పరవశింపజేసేది. ఏమా వైభవం? తన జీవితమే కృష్ణ పాత్రగా జీవించి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటుడు పీసపాటి. నటన ఒకవైపు, సంభాషణలు మరోవైపు, ఆ రెంటినీ అనుసంధానం చేస్తూ సాగే కమనీయమైన పద్యగానం ఇంకొక వైపు. ప్రేక్షకులకు కన్నులవిందు, వీనులవిందుగా సాగేవి. పీసపాటి వారి కృష్ణ పాత్రకు అంతటి ప్రత్యేకతకు కారణం సంభాషణలు పలకటంలో స్పష్టం, పద్యం పాడటంలో విలక్షణమైన శైలి, హావభావాల ప్రదర్శనలో, ఇతర పాత్రలను సమన్వయం చేయటంలో మేటి. చక్కటి శీర్షికను అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు.
-కైప నాగరాజు (అనంతపురం)
ఔర్ చల్‌తే
‘లోకాభిరామమ్’ శీర్షిక మమ్మల్ని ఎంతగానో అలరిస్తోంది. ‘ఔర్ చల్‌తే’ చదువుతూంటే రోజూ మనం చూసే ఎన్నో సంఘటనలు, వ్యక్తులు కళ్ల ముందు కదలాడుతారు. అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అలాగూ చేయవచ్చనుకో అనడానికి, మరో పరిస్థితి ఉందని మనిషికి మాత్రమే తెలుసునేమో? మనుషులు మాత్రం అందరూ అవకాశాలను గుర్తిస్తున్నారా? అలవాటుగా చేస్తున్న పనినే ఆలోచన లేకుండా చేస్తూ పోతున్నారా? ప్రశాంతంగా నడవడానికి తగిన ప్రదేశం ఎక్కడయినా ఉందా? ఉండకపోతుందా? అతను ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు.. అన్న మాటలు అక్షర సత్యాలు. రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూంటే కలిగే భావాలను చక్కగా అక్షరబద్ధం చేశారు. ధన్యవాదాలు. అలాగే ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ఆసక్తికరంగా ఉంది.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
మాధుర్యం
అమ్మ - ఆ పిలుపులోని మాధుర్యం, ఆ పదంలోని గొప్పతనం, ఆమెతో ఉన్న బాంధవ్యం ఎవరైనా ఎంతని చెప్పగలరు? ఎన్ని రకాలుగా వర్ణించినా.. ఎంతగా కీర్తించినా తక్కువే కదూ?! నవమాసాలు మోసి, రక్తమాంసాలు పంచి, తన ప్రాణానే్న ఫణంగా పెట్టి, జన్మనిచ్చి, జీవితాన్నిచ్చిన అమ్మ - ప్రత్యక్ష దైవం కాక మరేమిటి? అంటూ మొదలై.. ‘సర్కారీ ఉయ్యాల’ను చక్కగా పరిచయం చేశారు. ఆడపిల్ల పుట్టగానే ముళ్లపొదల్లోనో, చెత్తకుప్పల్లోనో దర్శనమిచ్చే ఘటనలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. ఆడశిశువుల దీనావస్థను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం వారి కోసం ఎక్కడా లేని విధంగా తొలి అడుగు వేయటం స్ఫూర్తిదాయకం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
భవిష్య వాణి
‘నమ్మండి ఇది నిజం’ శీర్షికన అందిస్తున్న కథనాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. లోకంలో ఇటువంటి ఫిక్షన్స్ కూడా జరుగుతాయా? అనిపిస్తోంది. ‘్భవిష్య వాణి’ కథనంలో హెలెన్ రిచర్డ్‌సన్‌కి రైలు ప్రమాదం గురించి ఎలా తెలిసిందని? క్లెయిర్‌వాయెన్స్, ప్రిమానిషన్ లేదా కాకతాళీయమా? ఏది ఏమైనప్పటికీ కొన్ని వందల మంది ప్రాణాలను హెలెన్ కాపాడగలిగింది. ఆ థియరీ ఏమిటో అర్థంకాక ఇప్పటికీ శాస్తవ్రేత్తలు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
సంస్కృతి?
‘జంతు హింస సంస్కృతి మనకుందా?’ వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. భారత కథ కుక్కతో మొదలై.. కుక్కతోనే ముగియటం.. పురాణేతిహాసాల్లోని చిన్నచిన్న కథలను ఈ వ్యాసం ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే ‘రామాయణం’ క్విజ్ మాకెంతో నచ్చింది. ఈ విధంగానైనా పిల్లలు రామాయణ గాథను చదివి ఆకళింపు చేసుకుంటారు.
-గుండు రమణయ్య (పెద్దాపూర్)
దుత్త
‘ఊదర దుత్త’ కథ మాకెంతో నచ్చింది. పొలంలో ఎలకల్ని పట్టాలంటే ఇంత తతంగం ఉంటుందా? అనిపించింది ఆ వర్ణన చదువుతూంటే. అలాగే ‘కథాసాగరం’లోని కథలు ఎంతో నీతిని ప్రబోధిస్తున్నాయి. ‘ఎవరు పెళ్లాడాలి?’ కథ ఏనాటిదో అయినా.. మళ్లీ చదువుతూంటే కొత్తదనం కనిపించింది.
-చోడవరపు నాగేశ్వరరావు (హైదరాబాద్)
మృదు స్వభావి
‘విలన్స్...’ శీర్షికన అందిస్తున్న క్రైం కథలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఉత్కంఠభరితంగా ఉంటూనే థ్రిల్లర్‌లో మమ్మల్ని ముంచెత్తుతున్నాయి. ‘మృదు స్వభావి’ కథ బాగుంది. అలాగే ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతోంది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
‘కథ’ బాగుంది
కథ శీర్షికన అందిస్తున్న కథలు ఎంతో బాగుంటున్నాయి. ఇటీవల ప్రచురించిన ‘కథ’ నేటి సమాజానికి చక్కని సందేశాన్ని అందించింది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎడాప్ట్ చేసుకోకుండా ఎడిక్ట్ అయ్యి, ప్రేమానురాగాలు, మానవత్వపు విలువలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఆప్యాయతలకు దూరమై టెక్నాలజీ అందించే పరికరాలకు నేటి ఆధునిక మానవుడు బానిసవుతున్నాడన్నది నిర్వివాదాంశం. మానవుడు నిత్యం ఎదుర్కొనే సమస్యలలో అధిక శాతం ఈ అపసవ్య జీవన విధానం వల్లనే ఉత్పన్నవౌతున్నాయన్న రచయిత అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మంజరి గారి ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ వైవిధ్యభరితంగా సాగుతోంది. ‘నమ్మండి ఇది నిజం’ శీర్షికలోని విశేషాలు సంభ్రమాశ్చర్యాలు గొలిపే విధంగా ఉంటున్నాయి.
-సి.పి. (హైదరాబాద్)