S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభిమాన తార!

బాలీవుడ్‌లో యమక్రేజీ తారగా అలియాభట్ ఎప్పటికప్పుడు కెరీర్‌లో ముందుకు దూసుకెళుతూ నిత్యం వార్తలో వుంటూ వస్తోంది. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఎంతోమందికి అభిమానతారగా మారింది. అలియాభట్ ట్విట్టర్ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య పది మిలియన్లకు చేరిందంటే ఆమె ఎలాంటి స్థాయిలో వుందో ఇట్టే అర్థం అవుతోంది. ఈ విషయం గురించే అలియాను కదిలిస్తే- ‘‘అవును..చాలా ఆనందంగా వుంది. నా ఫాలోవర్స్ పది మిలియన్లకు చేరారంటే ఆనందంతో పాటు ఆశ్చర్యమూ కలుగుతోంది. నేను సోషల్ మీడియా ద్వారా నా అనుభవాలను అభిమానులతో పంచుకున్నా. ఆనందాన్ని వ్యక్తం చేశా’’అంటూ చెప్పుకొచ్చింది. ఇంతటి ఊపుమీదున్న ఈ సుందరాంగి ప్రస్తుతం ‘బద్రీనాథ్‌కి దుల్హానియా’ చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది. ఈ చిత్రంలో వరుణ్‌ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆమె చేతినిండా చిత్రాలున్నాయి. ఇవి విడుదలైతే అలియాభట్ క్రేజ్ మరింత ఊపందుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వాహ్..అలియా!!