S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్కీగాళ్!

టాలీవుడ్‌లో క్రేజీ హీరోల చిత్రాల్లో తన గ్లామర్‌తో యువతరాన్ని కట్టిపడేసిన అందాలభామ హన్సికకు తెలుగులో కాలం కలిసిరాలేదు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్‌టిఆర్, రవితేజ, నితిన్, రామ్‌లాంటి హీరోలతో ఆడిపాడింది. అంతేకాదు, మంచు విష్ణుతో అయితే హ్యాట్రిక్ కొట్టేసింది. ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న ఈ అమ్మడు తాజాగా ‘లక్కున్నోడు’లోనూ విష్ణుతో జోడీకట్టి అదరగొట్టేసింది. ఈ చిత్రంతో హన్సిక లక్కీగాళ్‌గా ముద్రను వేసుకుంది. ఈ చిత్రంలో పోషించిన పాజిటివ్ పద్మావతి క్యారెక్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆ పేరుకు తగ్గట్టుగా పాత్రకూడా పాజిటివ్‌గానే వుంది. ఇప్పటి వరకూ హన్సిక చేసిన సినిమాలన్నీ కమర్షియల్ చిత్రాలే. తాజాగా గోపీచంద్‌తో ‘ఆక్సిజన్’లోనూ జోడీ కట్టింది. స్టార్ హీరోలో అవకాశాలు ఎందుకు తగ్గాయని హన్సికను కదిలిస్తే- ‘‘నాకు చిన్నా, పెద్దా తేడా లేనేలేదు. నా దృష్టిలో అందరూ స్టార్ హీరోలే. నాకు గుర్తింపు వచ్చింది తెలుగులోనే. తమిళంలో బిజీగా వుండటం వల్ల తెలుగులో అవకాశాలు వచ్చినా డేట్లు సర్దుబాటు కాక చేయడం కుదరలేదు అంతే. త్వరలోనే మళ్లీ తెలుగులో విజృంభిస్తా’’అంటూ ఎంతో హుషారుగా చెప్పుకొచ్చింది’’ అంది. దటీజ్..హన్సిక!!