S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిల్క్‌బ్యూటీ ఆశ!

ఎన్నో ఆశలతో.. మరెన్నో కోరికలతో వెండితెరపై అడుగుపెట్టిన భామల టార్గెట్ బాలీవుడ్డే అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. తాము నటిస్తున్న భాషల్లో పేరు తెచ్చుకున్నాక ఎలాగైనా హిందీ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిపోవాలనుకుంటారు. అక్కడ నటిస్తేనే దేశ వ్యాప్తంగా పేరొస్తుందనేది ఈ భామల ఆశ. మిల్క్‌బ్యూటీ తమన్నా కూడా ఇప్పుడే అదే దారిలో పయనిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో కుర్ర హీరోయిలతో పాటు, అగ్ర హీరోల చిత్రాల్లో ఆడిపాడింది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగినా బాలీవుడ్‌లో మాత్రం కాలం కలిసిరాలేదు. అక్కడ ‘హిమ్మత్‌వాలా’తో ఎంట్రీ ఇచ్చి ‘హమ్ షకల్స్’, ‘ఎంటర్‌టైన్ మెంట్’, ‘ టుక్ టుక్ టుటియా’ల్లోనూ నటించింది. ఈ చిత్రాల్లో ఏ ఒక్కటీ ఆమెకు పేరు తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో తమన్నా కెరీర్ బాలీవుడ్‌లో ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోయింది. అయినా బాలీవుడ్ ప్రయత్నాలను మాత్రం మానుకోకపోగా ఇంకా ముమ్మరం చేసింది. ఎన్నటికైనా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకోవాలన్నదే తమన్నా కోరికనట. అదే తన టార్గెట్ అని కూడా తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటోందిట. ఈ విషయం గురించి తమన్నా వివరిస్తూ- ‘‘తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా. అయితే నా టార్గెట్ బాలీవుడ్డే. అలా అని తెలుగు, తమిళ చిత్రాలను వదిలిపోవడం అని కాదు. ఇక్కడ చేస్తూనే అక్కడ కూడా మనమంటే ఏంటో చూపించాలన్నదే నా తపన. చాలా హిందీ కథలు వింటున్నా. వీటిలో ఏదైనా నన్ను బలంగా కదిలిస్తే వెంటనే ప్రకటిస్తా’’ అంది. తమన్నా నటించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఇందులో తమన్నా అవంతిక అనే పాత్రలో నటించింది. మొదటి భాగం కంటే రెండో భాగం ఇంకా బాగుందన్న నమ్మకంతో ఉంది కాబట్టే హుషారుగా కనిపిస్తోంది.

-సమీర్