S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హ్యాపీ..హ్యాపీగా!

ఇటు వైవాహిక జీవితాన్నీ, అటు కెరీర్‌నూ ఎంతో హ్యాపీగా గడుపుతున్న సమయంలోనే అందాలతార అమలాపాల్ జీవితంలో నిరాశ చోటుచేసుకుంది. మూడేళ్ల ప్రేమ, మూడు ముళ్లు ఏడడుగుల బంధంతో ముడిపడి రెండేళ్లు గడవకుండానే ఆ పెళ్లి కాస్త పెటాకులైపోయి అమలాపాల్‌ను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. కెరీర్ పరంగా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఒక దశలో కెరీరా, భర్తా? అన్న సందిగ్ధంలో పడిపోయింది. తీవ్రంగా ఆలోచించాక తనకు భర్త కన్నా, కెరీరే ముఖ్యమని తెలుసుకుంది. అంతే విడాకులుతో పుల్‌స్ట్ఫా పెట్టేసింది. పెళ్లాయ్యాక నటించింది. ఇప్పుడూ నటిస్తోంది. విడాకులు ఆమె కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. అవకాశాలు వస్తూనే వున్నాయి. గతం కన్నా ఎంతో హ్యాపీగా అమలాపాల్ కనిపిస్తోంది. పెళ్లాయ్యాక కొన్ని పరిమితులుండేవి. ఇప్పుడు అలాంటివేం లేవు. ఒకప్పుడు ఆమెను ఫ్యాషన్ ఐకాన్ అన్నారు. ఇప్పుడేమో విమర్శిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత అమల హాట్ హాట్ డ్రెస్సులు వేస్తోంది అన్న విమర్శలు వెల్లువలా వచ్చాయి. విడాకులు తీసుకున్నంత మాత్రాన మోడ్రన్‌గా ఉండకూడదా? అన్నది ఆమె ప్రశ్న. ఇప్పుడు కోలీవుడ్‌లో రెండు సినిమాలు, కన్నడంలో ఓ సినిమా చేస్తోంది. త్వరలో టాలీవుడ్‌లో సినిమా చేయబోతోంది. అలాగే మాలీవుడ్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఇవన్నీ బయటికొచ్చాక కొత్త అమలాను చూస్తారంటోంది ఈ భామ. అదీ..చూద్దాం...అమలాపాల్ కెరీర్‌లో ఎలా పరుగులు పెడుతుందో!!

-సమీర్