S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కదిలే శివలింగం

ఈ ప్రపంచం అతిపెద్ద వింతల నిలయం. ఇక్కడ జరిగే కొన్ని సంఘటనలను విశే్లషించి, విశదీకరించడానికి గొప్పగొప్ప మేధావులకు కూడా శక్తి చాలదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో గల రుద్రపూర్ పట్టణంలో ఉన్న శివలింగం. మన దేశంలో దాదాపు అన్నిచోట్లా మనకు శివాలయాలు కనిపిస్తాయి. అందులో ప్రత్యేకతేం లేదు. కానీ దియోలో ఉన్న శివలింగం మాత్రం ఎంతో ప్రత్యేకమైనదని దాని విశిష్టతను తెలుసుకుంటే ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఆ శివలింగం కదులుతుంది. ఇది నూటికి నూరుపాళ్ల నిజం. దియోరియాలోని శివలింగం నిజంగానే కదులుతుంది. ఏకధాటిగా ఇది ఇరవై నాలుగు గంటల పాటు కదులుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. అప్పుడు మనం ఎంత కదిపినా తలవెంట్రుక మొనంత కూడా కదలదు. శివుడు దుగ్దేశ్వరనాథుడిగా పూజలందుకుంటున్న ఈ శివాలయం మధ్యప్రదేశ్‌లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపాలయంగా చెబుతారు. దియోరియాలోని రుద్రపూర్ ఆనాటి రాజరిక ప్రాభవానికి ప్రతీక. ఇక్కడ మనకు శతసీ రాజ్యానికి చెందిన ఎన్నో రాజప్రాసాదాలు, భవంతులు గోచరిస్తాయి. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టులకు వాటి కంటే కదిలే శివాలయమే ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగం భూమీదే మనకు గోచరిస్తూ ఉంటుంది. ఇది స్వయంభూ లింగమని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఈ శివలింగం కదలడం మొదలైతే అది గంటైనా కావచ్చు, రెండు గంటలైనా కావచ్చు... లేదా ఒక రోజంతా అయినా కావచ్చు. అలా కదిలే శివలింగం ఆగిపోయిన తర్వాత మాత్రం అస్సలు కదలదు. ఎంత బలవంతులు వచ్చి ప్రయత్నించినా ఆ శివలింగాన్ని కదిలించడం వారి తరం కాదు. అందుకే ఉత్తరప్రదేశ్‌కి వెళ్లే టూరిస్టులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తుతుంటారు. క్యూలైన్‌లో నిల్చుని మరీ కదిలే శివలింగాన్ని అబ్బురంగా కళ్లార్పకుండా చూస్తారు. ఇలా కదిలే శివలింగం రహస్యమేమిటో తెలుసుకోవడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయట. కొందరు ఈ మర్మాన్ని తెలుసుకోవడానికి తవ్వకాలు కూడా చేపట్టారని, ఎంత తవ్వినా అంతూదరీ తెలియలేదని చెబుతారు. దాంతో అప్పటి నుండి అటువంటి ప్రయత్నాలకు స్వస్తి పలికారట.

- దుర్గాప్రసాద్ సర్కార్