S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హుషార్ (మాతో-మీరు)

ఒక ఉపగ్రహంతో ప్రారంభమై రెండు.. మూడు.. ఇలా బుడిబుడి అడుగులు వేస్తూ తొలిసారిగా 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలు పంపి విజయం సాధించింది భారత్. ఆ తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను కూడా పంపి ప్రపంచ దేశాలకు దీటుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మేటిగా నిలిచింది. ‘షార్.. హుషార్’ కవర్‌స్టోరీ కథనం ఆలోచింపజేసేదిగా ఉంది. గగన వీధిలో ఘనమైన విజయాలు సాధించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు దేశం నలుమూలల ఎన్నో కేంద్రాలు విస్తరించాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ని చూసి వివిధ దేశాలు సంకటంలో పడుతున్నాయేమో ననిపిస్తోంది. ‘చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది సాహిత్యమే’ అంటూ ప్రపంచానికి హితబోధ చేస్తున్న చిచ్చరపిడుగు దానియా మేరీ అరానా గురించి తెలుసుకొని ఆశ్చర్య చకితులమయ్యాం.
-అల్లాడి వేణుగోపాల్ (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు)

ఓ చిన్న మాట
బంధుమిత్రులు శుభకార్యాలకు సరిగా పిలవలేదనీ, అతిథి మర్యాదలు సరిగా చేయలేదని విమర్శించడం వల్ల అసహనం, అసంతృప్తి పెరిగి ఆనందం హరించుకు పోతుంది. అమర్యాదల గురించి ఆలోచించరాదన్న ఓ చిన్న మాట బావుంది. ఎండాకాలం చల్లదనం కోరుతాం. చలికాలం వెచ్చదనం ఆశిస్తాం. అందని దాని కోసమే ఆరాటం అని చెప్పిన కవిత ‘రెక్కలు’ చక్కగా ఉంది. ఎవరైనా భోజనానికి రాలేని పరిస్థితి ఉంటే ‘రండి రండి’ అని పదిసార్లు పిలిచి ‘సరే వస్తాను’ అనగానే మాట మార్చేసే వాళ్లు చాలామంది కనిపిస్తారు మనలో. అదో లౌక్యం! నోబెల్‌కి వంద కోట్ల బహుమతి ప్రకటన కూడా ఆ తరహా లౌక్యమే. పట్టించునక్కర్లేదు.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)

ఉక్కిరిబిక్కిరి
ఒక్క అమెరికానే కాక యావత్ ప్రపంచానే్న ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పేరు ట్రంప్. నిజమే. ఆయన చేస్తున్న ప్రకటనలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నవే. అయినా ముందు ముందు ఏం జరగబోతున్నదా అని శత్రువులనే కాక మిత్రులనూ ఆందోళనలోకి నెట్టివేస్తున్నది. మరో నాలుగైదు నెలలు గడిస్తే గానీ స్పష్టత రాదు. అంతవరకు నిరీక్షణ తప్పదు. అమెరికా ఐశ్వర్యం ప్రపంచానిది కాకపోయినా, అమెరికా బాధ మాత్రం ప్రపంచానికి బాధే! గుంటూరు ప్రయాణం గురించి కలకాలం గుర్తుండే అంశం కారం కాదు, శర్మగారి అభిమానం అంటూ గోపాలంగారి గుంటూరు విశేషాలు భలేగా ఆకట్టుకొన్నాయి.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)

క్రైం
పాశ్చాత్యులకు పురాతన వస్తువులంటే పిచ్చి ప్రేమ. సాధారణంగా కనిపించే వస్తువుల్ని కూడా పురాతనం అనగానే లక్షలు ఖర్చు పెట్టి కొనేస్తారు. అలాంటి వస్తువుల కొనుగోళ్లలో మిత్రుల సలహాల్ని కూడా నమ్మరాదని ‘క్రైం’ కథలో బాగా నిరూపించారు. కథాసాగరంలో ఎవరినీ తక్కువగా చూడరాదన్న నీతి ఉంది.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)

అమృతవర్షిణి
ఆదివారం అనుబంధంలో అన్నీ అంశాలు చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ‘అమృతవర్షిణి’ శీర్షిక. మల్లాది సూరిబాబు గారు చెబుతున్న విశేషాలు ఎంతో ఆసక్తిని గొల్పుతున్నాయి. సండే గీత, ఓ చిన్న మాట శీర్షికలు ఎప్పటి మాదిరిగానే అలరిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. ‘అక్షరాలోచనలు’లో కవితలు సందేశాత్మకంగా ఉంటున్నాయి. కార్టూన్ల సంఖ్య తగ్గింది. ఆదివారం ఆంధ్రభూమి అంటేనే కార్టూన్లకు పెట్టింది పేరు. కార్టూన్ల సంఖ్య పెంచండి. అలాగే ‘ఊదర దుత్త’ కథ బాగుంది. జంతు హింసపై దీక్షితులుగారి వ్యాసం బాగుంది. మూగజీవాలు ప్రకృతిలో భాగమే. బతకడానికి మనిషికి ఎంత హక్కు ఉంద జంతువులకూ అంతే హక్కు ఉంది. కవర్‌స్టోరీ బాగుంది.
-మార్టూరు అజయ్‌కుమార్ (చిలకలూరిపేట)

తప్పొప్పులు
ప్రతీ విషయంలో తులనాత్మక ధోరణితో మాట్లాడడం, ప్రతీ చిన్న విషయానికి ఇతరులలో తప్పొప్పులు ఎంచి విమర్శించే ధోరణి వలన ఇతరుల కంటే మనకే ఎక్కువ కీడు జరుగుతుందని ‘ఓ చిన్న మాట’లో చక్కగా చెప్పారు. జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, మనకు ఆనందం, తృప్తి కలిగేలా డబ్బును వ్యూహాత్మకంగా వినియోగించడం అంతే ముఖ్యమని సండే గీతలో తెలుసుకున్నాం. ఆధ్యాత్మికతపై మనలో మనంలో శాస్ర్తీగారి సమాధానం మమ్మల్నెంతగానో ఆలోచింపజేసింది. కథాసాగరంలోని కథలు జీవితంలో నిత్య సత్యాలకు చక్కని అక్షర రూపంగా నిలుస్తున్నాయి. సర్వజిత్‌గారి ‘తోడు నీడ’ కథ నవ నాగరిక సమాజంలో పెరుగుతున్న వ్యాపారాత్మక ధోరణి, క్షీణిస్తున్న మానవ సంబంధాలకు దర్పణం పట్టింది. సినిమా విశేషాలు అలరిస్తున్నాయి.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)

నమ్మలేనిది
తన ప్రమేయం లేకుండానే తనకు తెలియని భాషని బ్లాక్ బోర్డు మీద రాసేసిన పంతులమ్మ ఉదంతం నిజంగా నమ్మలేని నిజమే. ఈ ప్రపంచంలో ఎన్ని వింతలో కదా! అమ్మ-చిన్నమ్మ టైటిల్‌తో కాకపోయినా రామూ అమ్మ మీద సినిమా తీస్తానన్నాడు. తమిళ తంబీలు ఎందరు అమ్మల్ని దింపుతారో! స్వదేశం నుంచి పారిపోవలసిన భయంకర పరిస్థితులున్న దేశాల సంఖ్య పెరగడం, శరణార్థుల్ని భరించగలిగే ఆర్థిక, సామాజిక పరిస్థితులు విచ్ఛిన్నమయే దేశాల సంఖ్య తగ్గిపోతుండటమే శరణార్థుల అవస్థలకు కారణం అవుతున్నాయి. బాధపడటం తప్ప ప్రజలేం చేయగలరు?
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)